జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్ అమలు కోసం జమ్మూ, కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ తో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా చర్చించిన - కేంద్ర జల శక్తి శాఖ మంత్రి

2022 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించాలని యోచిస్తున్న - కేంద్రపాలితప్రాంతం

Posted On: 10 JUL 2020 4:16PM by PIB Hyderabad

కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ, కశ్మీర్ లో జల్ జీవన్ మిషన్ అమలుకు సంబంధించి కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్ ఈ రోజు జమ్మూ, కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్.జి) శ్రీ గిరీష్ చంద్ర ముర్మూ తో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా చర్చించారు.  దేశ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంపై దృష్టి సారించిన భారత ప్రభుత్వం కనీస ప్రాథమిక సేవలను అందించడానికి కట్టుబడి ఉంది.  త్రాగునీటి సరఫరా అనేది ఒక సేవాపరమైన కార్యక్రమం. నీటి పరిమాణం, నాణ్యత, సమయం మొదలైనవి నిర్ధారించాలి.  దీని కోసమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం జల్ జీవన్ మిషన్ (జె.జె.ఎం) అమలులో ఉంది.  సార్వత్రికంగా అమలుచేయాలనేది ఈ మిషన్ యొక్క లక్ష్యం.  అంటే, గ్రామంలోని ప్రతి కుటుంబానికి వారి ఇంటిలో పంపు నీటి కనెక్షన్ అందుబాటులో ఉండాలి. 

2022 నాటికి కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికీ ట్యాప్ కనెక్షన్ ద్వారా నీటిని సరఫరా చేసి, 100 శాతం లక్ష్యాన్ని సాధించే విధంగా  జమ్మూ, కాశ్మీర్ యోచిస్తోంది.  ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో, మూడు జిల్లాలు - గాంధర్బల్, శ్రీనగర్ మరియు రైసీ లలోని మొత్తం 5,000 గ్రామాలలో 100 శాతం గృహాలకు ట్యాప్ కనెక్షన్ ద్వారా నీటి సరఫరా చేయాలని కేంద్ర పాలితప్రాంతం ప్రణాళికలు సిద్ధం చేసింది.  ఈ నేపథ్యంలో, కేంద్రమంత్రి, కేంద్రపాలిత ప్రాంతంలో జల్ జీవన్ మిషన్ పురోగతిపై, లెఫ్టనెంట్ గవర్నర్ తో సవివరంగా, చర్చలు జరిపారు.

గ్రామీణ ప్రజల జీవితాలను మెరుగుపర్చడానికి మిషన్ యొక్క ప్రాముఖ్యతను కేంద్ర మంత్రి వివరిస్తూ, ప్రస్తుత నీటి సరఫరా పథకాలను పునర్వినియోగపరచడం మరియు పెంచడంపై ఉద్ఘాటించారు.  ఇప్పటికే ఉన్న పబ్లిక్ స్టాండ్-పోస్టుల నుండి గృహ ట్యాప్ కనెక్షన్లను అందించడానికి ఈ పనిని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ఆయన కోరారు.  గ్రామీణ ప్రాంతాల్లో గృహ ట్యాప్ కనెక్షన్‌లను నిర్ణీత సమయంలో అందించే లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రపాలితప్రాంతంలో జల్ జీవన్ మిషన్ను, వేగంగా అమలు చేస్తామని లెఫ్టనెంట్ గవర్నర్ హామీ ఇచ్చారు. 

జమ్మూ, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని, 18.17 లక్షల గ్రామీణ గృహాల్లో కేవలం 7.96 లక్షల గృహాలకు మాత్రమే ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది.  2020-21 ఆర్ధిక సంవత్సరంలో  2.32 లక్షల గృహాల్లో ట్యాప్ కనెక్షన్లు అందించాలని జమ్మూ, కశ్మీర్ యోచిస్తోంది.  2020-21 ఆర్ధిక సంవత్సరంలో, 681.77 కోట్ల రూపాయలు కేటాయించడంతో, కేంద్ర పాలిత ప్రాంతం వాటాతో సహా ఇప్పుడు 923 కోట్ల రూపాయల మేర నిధులు అందుబాటులో ఉన్నాయి.  భౌతిక మరియు ఆర్థిక పనితీరు ఆధారంగా అదనపు కేటాయింపులకు కేంద్రపాలిత ప్రాంతం అర్హత కలిగి ఉంది.  ఈ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర పాలితప్రాంతానికి పూర్తి సహాయం అందించాలన్న కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను కేంద్ర మంత్రి శ్రీ షెఖావత్ పునరుద్ఘాటించారు. గృహాలకు అందజేసిన ట్యాప్ కనెక్షన్ల పరంగా మరియు అందుబాటులో ఉన్న నిధుల వినియోగం ఆధారంగా, పూర్తిచేసిన పని ఆధారంగా భారత ప్రభుత్వం, జల్ జీవన్ మిషన్ కోసం, నిధులను అందిస్తుంది.

గ్రామ పంచాయతీ యొక్క ఉప కమిటీగా కనీసం 50 శాతం మహిళా సభ్యులతో, ప్రణాళిక, రూపకల్పన, అమలు మరియు గ్రామంలో నీటి సరఫరా మౌలిక సదుపాయాల నిర్వహణ వంటి బాధ్యతల కోసం, గ్రామ నీటి మరియు పారిశుద్ధ్య కమిటీ / జల సమితి లను ఏర్పాటు చేయడంతో పాటు, గ్రామ కార్యాచరణ ప్రణాళికలను తయారుచేయాలని, కేంద్ర మంత్రి నొక్కిచెప్పారు. అన్ని గ్రామాలు, ఆయా గ్రామాల కార్యాచరణ ప్రణాళిక (వి.ఏ.పి) లను సిద్ధం చేయాలి, ఇందులో తాగునీటి వనరుల అభివృద్ధి / నీటి సరఫరా వృద్ధి, నీటి సరఫరా, మురుగు నీటి పారుదల యాజమాన్యం, నిర్వహణ మొదలైనవి ఉంటాయి.  మొత్తం 6,877 గ్రామాలకు గాను, 1,800 గ్రామాలు తమ గ్రామ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేశాయి.  అన్ని గ్రామాల్లో, జల్ జీవన్ మిషన్ను, నిజంగా ప్రజల ఉద్యమంగా మార్చడానికి కమ్యూనిటీ సమీకరణతో పాటు ఐ.ఇ.సి.  ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉంది.

అన్ని తాగునీటి వనరులను రసాయనాల పరంగా ఒకసారి మరియు ప్రతి సంవత్సరం బాక్టీరియా కాలుష్య నివారణ కోసం రెండుసార్లు (వర్షాకాలానికి ముందు ఒకసారి, తర్వాత మరొకసారి) పరీక్షించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది.  దీనితో పాటు, ప్రతి గ్రామంలో కనీసం 5 మందికి, ముఖ్యంగా మహిళలకు, ఫీల్డ్ టెస్ట్ కిట్స్ (ఎఫ్.‌టి.కె) ద్వారా నీటి నాణ్యతను పర్యవేక్షించడానికి శిక్షణ ఇవ్వాలని కోరడమైంది.  రాబోయే కొద్ది నెలల్లో అన్ని ప్రయోగశాలలు ఎన్.‌ఎ.బి.ఎల్.  గుర్తింపు పొందేలా చూడాలని కూడా కేంద్రపాలిత ప్రాంతాన్ని కోరడం జరిగింది. 

ప్రస్తుతం కోవిడ్ -19 వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల్లో, గ్రామీణ గృహాల్లో ప్రాధాన్యతా ప్రాతిపదికన ట్యాప్ కనెక్షన్‌లను అందించాలనేది, ప్రభుత్వ ప్రయత్నం, తద్వారా గ్రామీణ ప్రజలు వీధి కుళాయిల వద్ద, చెరువుల వద్ద ఎదురుచూస్తూ నీటి కోసం కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఉండకూడదు. 

*****


(Release ID: 1637831) Visitor Counter : 213