విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి-కుసుమ్ పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకోమని కోరుతున్న మోసపూరిత వెబ్ సైట్ లకు వ్యతిరేకంగా తాజా అడ్వైజరీ జారీ చేసిన - ఎమ్.ఎన్.ఆర్.ఈ.
Posted On:
10 JUL 2020 2:35PM by PIB Hyderabad
ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సూరక్షా క్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్ (పిఎం-కుసుమ్) పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకోమని కోరుతున్న మోసపూరిత వెబ్‌సైట్‌లకు వ్యతిరేకంగా నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎం.ఎన్.ఆర్.ఈ.) ఈ రోజు తాజా అడ్వైజరీ జారీ చేసింది. ప్రధానమంత్రి-కుసుమ్ పథకం కోసం రిజిస్ట్రేషన్ పోర్టళ్ళు గా రెండు కొత్త వెబ్ సైట్లు అక్రమంగా పేర్కొంటున్నట్లు ఇటీవల గుర్తించడం జరిగింది. ఆ రెండు వెబ్ సైట్ల చిరునామాలను https://kusum-yojana.co.in/ మరియు https://www.onlinekusumyojana.co.in/ గా గుర్తించారు. ఈ వెబ్‌సైట్ల వెనుక ఉన్న దుండగులు సామాన్య ప్రజలను మోసగించడంతో పాటు, ఈ నకిలీ పోర్టళ్ళ ద్వారా సంగ్రహించిన సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ వెబ్‌సైట్ల వెనుక ఉన్న దుండగులపై ఎం.ఎన్.ఆర్.ఈ. చర్యలు తీసుకుంటోంది. కాగా, ఈ వెబ్‌సైట్లకు డబ్బు లేదా సమాచారాన్ని అందజేయవద్దని, మంత్రిత్వశాఖ ఔత్సాహిక లబ్ధిదారులను, సాధారణ ప్రజలను హెచ్చరించింది.
అదేవిధంగా, వార్తా పోర్టళ్ళు కూడా తమ డిజిటల్ లేదా ప్రింట్ మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించే ముందు ప్రభుత్వ పథకాలకు రిజిస్ట్రేషన్ పోర్టల్ అని చెప్పుకునే వెబ్ సైట్ల ప్రామాణికతను తనిఖీ చేయాలని సూచించారు.
ప్రధానమంత్రి-కుసుమ్ పథకానికి, ఎం.ఎన్.ఆర్.ఈ., 2019 మార్చి, 8వ తేదీన పరిపాలనా ఆమోదం జారీ చేసింది. కాగా, ఈ పథకం అమలుకు, 2019 జులై, 22వ తేదీన మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి. సౌర పంపుల ఏర్పాటు, ఇప్పటికే గ్రిడ్ తో అనుసంధానించబడి ఉన్న వ్యవసాయ పంపులకు సౌర విద్యుత్తు సరఫరా, గ్రిడ్ తో అనుసంధానమయ్యే పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు మొదలైన వాటిని ఈ పథకం సమకూరుస్తుంది. ఈ పథకాన్ని ప్రారంభించిన తరువాత, కొన్ని వెబ్‌సైట్లు ప్రధానమంత్రి=కుసుమ్ పథకానికి రిజిస్ట్రేషన్ పోర్టళ్ళుగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, లబ్దిదారులకు, సాధారణ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా ఉండటానికి, ఎం.ఎన్.ఆర్.ఈ. గతంలో 18.03.2019 తేదీ మరియు 03.06.2020 తేదీలలో అడ్వైజరీలను జారీ చేస్తూ, ఇటివంటి వెబ్ సైట్లలో ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజును జమ చెయవద్దనీ, ఈ వెబ్‌సైట్లలో వారి సమాచారాన్ని అందజేయవద్దనీ సలహా ఇచ్చింది.
సంబంధిత రాష్ట్రాల్లోని అమలు సంస్థల ద్వారా ప్రధానమంత్రి-కుసుమ్ అమలు చేస్తున్నట్లు సంబంధిత భాగస్వాములందరికీ మంత్రిత్వ శాఖ తెలియజేస్తోంది. ఆ ఏజెన్సీల వివరాలు ఎమ్.ఎన్.ఆర్.ఈ. వెబ్ సైట్ www.mnre.gov.in లో అందుబాటులో ఉన్నాయి. ఈ పథకం కింద లబ్ధిదారులను ఎమ్.ఎన్.ఆర్.ఈ. తన వెబ్ సైట్ల ద్వారా నమోదు చేయదు. అందువల్ల ఈ పథకం కోసం ఎమ్.ఎన్.ఆర్.ఈ. రిజిస్ట్రేషన్ పోర్టల్ అని చెప్పుకునే ఏ పోర్టల్ అయినా అది తప్పుదారి పట్టించేది మరియు మోసపూరితమైనదిగా గుర్తించాలి. ఏదైనా అనుమానాస్పద మోసపూరిత వెబ్‌సైట్ ను, ఎవరైనా గమనించినట్లయితే, ఆ సమాచారాన్ని ఎమ్.ఎన్.ఆర్.ఈ. కి పిర్యాదు చేయవచ్చు.
పథకంలో పాల్గొనడానికి అర్హత గురించి సమాచారం మరియు ఈ పధకం అమలు విధానం వంటి వివరాలు ఎమ్.ఎన్.ఆర్.ఈ. వెబ్ సైట్ www.mnre.gov.in లో లభిస్తాయి. ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలు ఎమ్.ఎన్.ఆర్.ఈ. వెబ్ సైట్ సందర్శించవచ్చు లేదా ఉచిత హెల్ప్ లైన్ నంబర్ 1800-180-3333 కు ఫోను చేసి తెలుసుకోవచ్చు.
*****
(Release ID: 1637776)
Visitor Counter : 312