రక్షణ మంత్రిత్వ శాఖ
కొరియా రక్షణ మంత్రితో టెలిఫోన్‌లో మాట్లాడిన మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్
ద్వైపాక్షిక రక్షణ సహకార విషయంలో పురోగతిపై సమీక్ష
Posted On:
10 JUL 2020 1:30PM by PIB Hyderabad
కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ఈ రోజు రిపబ్లిక్ ఆఫ్ కొరియా (ఆర్ఓకే) జాతీయ రక్షణ శాఖ మంత్రి శ్రీ జియోంగ్ కియోంగ్-డూతో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరు రక్షణ మంత్రులు కోవిడ్-19 మహమ్మారి పరిస్థితికి సంబంధించిన సమస్యలపై చర్చలు జరిపారు. ఈ మహమ్మారికి వ్యతిరేకంగా అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాలకు భారతదేశం అందించిన కృషి గురించి కూడా శ్రీ రాజ్ నాథ్ సింగ్ కొరియా మంత్రి జియోంగ్ కియోంగ్-డూకు తెలియజేశారు. మహమ్మారికి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటంలో భాగంగా పరస్పర సహకారం గురించి ఇరువురు చర్చించారు. కోవిడ్ మహమ్మారి కారణంగా తాము ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవటానికి కలిసి పనిచేయడానికి గాను ఇరువురు మంత్రులు అంగీకరించారు. టెలిఫోన్ సంభాషణ సందర్భంగా మంత్రులు వివిధ ద్వైపాక్షిక రక్షణ సహకార కార్యక్రమాలలో తాజా పురోగతిని సమీక్షించారు. దీనికి తోడు సాయుధ దళాల మధ్య రక్షణ సహకారంను మరింత ప్రోత్సహించే విషయమై తమతమ నిబద్ధతను వ్యక్తం చేశారు. రక్షణ పరిశ్రమల రంగంలో ఒప్పందాలను ఇరు దేశాల మధ్య రక్షణ సాంకేతిక సహకారాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి కూడా వీరు అంగీకరించారు. ప్రాంతీయ పరిణామాలు భద్రతా ఆసక్తుల విషయాలను కూడా టెలిఫోనిక్ సంభాషణలో పంచుకున్నారు.
****
(Release ID: 1637760)
Visitor Counter : 294