రక్షణ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 తో పోరాడటానికి వీలుగా ఒక కుటుంబానికి ఒక పల్స్ ఆక్సిమీటర్ ధరను ఈ.సి.హెచ్.ఎస్. క్రింద తిరిగి చెల్లింపు
Posted On:
08 JUL 2020 1:13PM by PIB Hyderabad
కోవిడ్-19 రోగుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఆక్సిజన్ సంతృప్త స్థాయిని కొలవడం చాలా ముఖ్యమైన పారామితులలో ఒకటి కాబట్టి, మాజీ సైనికోద్యోగుల కంట్రిబ్యూటరీ ఆరోగ్య పధకం (ఈ.సి.హెచ్.ఎస్) లబ్ధిదారులు కొనుగోలుచేసిన పల్స్ ఆక్సీమీటర్ ఖర్చును ఈ క్రింది షరతులకు లోబడి తిరిగి చెల్లించాలని, రక్షణ మంత్రిత్వ శాఖ (ఎమ్.ఓ.డి) ఆధీనంలోని మాజీ సైనికుల సంక్షేమ శాఖ (డి.ఎస్.ఈ.డబ్ల్యూ) నిర్ణయించింది.
(ఎ) కోవిడ్-19 పాజటివ్ గా పరీక్షించబడిన ఈ.సి.హెచ్.ఎస్. లబ్ధిదారులకు ప్రతి కుటుంబానికి ఒక పల్స్ ఆక్సిమీటర్ కొనుగోలు చేయడానికి అనుమతి ఉంది. మరో మాటలో చెప్పాలంటే, ఈ.సి.హెచ్.ఎస్. లబ్ధిదారుని కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నట్లయితే, వారు ఒక పల్స్ ఆక్సిమీటర్ ధరను మాత్రమే తిరిగి పొందవచ్చు.
(బి) పల్స్ ఆక్సిమీటర్ యొక్క వాస్తవ ధర ప్రకారం ఆ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. అయితే, ఇది 1,200 రూపాయల గరిష్ట పరిమితికి లోబడి ఉంటుంది.
*****
(Release ID: 1637243)
Visitor Counter : 342