మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2020-21 విద్యా సంవత్సరానికి IX-XII తరగతులకు సి.బి.ఎస్.ఈ. సవరించిన పాఠ్యప్రణాళికను ప్రకటించిన - కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి
అభ్యాస సాధన యొక్క ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, ప్రధాన అంశాలను నిలుపుకోవడం ద్వారా సిలబస్‌ను 30 శాతం వరకు హేతుబద్ధీకరించడం జరిగింది - కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి
Posted On:
07 JUL 2020 6:21PM by PIB Hyderabad
దేశంలో మరియు ప్రపంచంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా, సి.బి.ఎస్.ఈ. పాఠ్య ప్రణాళికను సవరించి, 9 నుంచి 12 వ తరగతి విద్యార్థులకు కోర్సు భారాన్ని తగ్గించాలని సూచించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ అన్నారు. తదనుగుణంగా, 2020-21 విద్య సంవత్సరానికి IX - XII తరగతుల పాఠ్యప్రణాళికను సి.బి.ఎస్.ఈ. సవరించింది.
కొన్ని వారాల క్రితం, #SyllabusForStudents2020 ని ఉపయోగించి సోషల్ మీడియాలో సిలబస్ తగ్గించడంపై విద్యావేత్తలందరి నుండి సలహాలను ఆహ్వానించినట్లు ఆయన తెలియజేశారు. 1500 కంటే ఎక్కువగా సూచనలు వచ్చాయని శ్రీ నిశాంక్ తెలియజేస్తూ, అధిక ప్రతిస్పందనకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు.
పాఠ్యప్రణాళికలో చేసిన మార్పులను బోధన ప్రణాళిక కమిటీ మరియు బోర్డు పాలకమండలి ఆమోదంతో సంబంధిత కోర్సు కమిటీలు ఖరారు చేశాయని కేంద్ర మంత్రి చెప్పారు.
దేశంలో మరియు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల కారణంగా పాఠ్యప్రణాళికను సవరించాలనే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అభ్యాస స్థాయిని సాధించవలసిన ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని, పాఠ్యప్రణాళికలోని ప్రధాన అంశాలను నిలుపుకోవడం ద్వారా 30 శాతం మేర పాఠ్యాంశాలను సాధ్యమైనంతవరకు హేతుబద్దీకరించడం జరిగింది.
వివిధ విషయాలను అనుసంధానించడానికి అవసరమైన మేరకు తగ్గించబడిన అంశాలను కూడా విద్యార్థులకు వివరించాలని, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు బోర్డు సూచించింది. అయితే, తగ్గించిన సిలబస్ లోని అంశాలను ఇంటర్నల్ పరీక్షలు, ఏడాది చివర నిర్వహించే బోర్డు పరీక్షల్లో ఇచ్చే అంశాలతో పాటు కలపకూడదు. ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ మరియు విభిన్న వ్యూహాలను ఉపయోగించి బోధించే పాఠ్యాంశాలతో పాటు ఎన్.సి.ఈ.ఆర్.టి. నిర్దేశించిన పాఠ్యాంశాలు కూడా అనుబంధ పాఠశాలల్లో బోధించే పాఠ్యాంశాలలో భాగంగా ఉంటాయి.
ప్రాధమిక తరగతులు (I-VIII) కోసం పాఠశాలలు ఎన్.సి.ఈ.ఆర్.టి. నిర్దేశించిన ప్రత్యామ్నాయ అకాడెమిక్ క్యాలెండర్ మరియు అభ్యాస ఫలితాలను అనుసరించాలి.
సవరించిన సిలబస్ సి.బి.ఎస్.ఈ. అకాడెమిక్ వెబ్‌సైట్ www.cbseacademic.nic.in లో అందుబాటులో ఉంది.
*****
(Release ID: 1637109)
Visitor Counter : 265