వ్యవసాయ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రైతులకు బాసటగా ఉండేలా, వ్యవసాయ కార్యకలాపాలను సులభతరం చేసేందుకు పలు చర్యలను చేపట్టిన భారత ప్రభుత్వపు వ్యవసాయ, సహకార మరియు రైతు సంక్షేమ శాఖ
ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణ విస్తరణలో గణనీయమైన వృద్ధి
Posted On:
03 JUL 2020 10:20PM by PIB Hyderabad
కోవిడ్- 19 మహమ్మారి విస్తరిస్తున్న వేళ క్షేత్ర స్థాయిలో రైతులకు బాసటగా నిలిచేందుకు, వ్యవసాయ కార్యకలాపాలను సులభతరం చేసేందుకు గాను భారత ప్రభుత్వపు వ్యవసాయ, సహకారం మరియు రైతు సంక్షేమ శాఖ పలు చర్యలు చేపట్టింది. దీంతో ఖరీఫ్ పంటల క్రింద విస్తీర్ణ విస్తరణలో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. వివరాలు ఈ కిందన ఇవ్వబడ్డాయి:
వేసవి పంటల విస్తరణ విస్తీర్ణం:
బియ్యం
వేసవిలో సుమారు 68.08 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో వరి పంట సాగు చేయబడింది. గత సంవత్సరం ఇదే కాలంలో వరి సాగు చేసిన విస్తీర్ణం 49.23 లక్షల హెక్టార్లుగా ఉంది.
పప్పుధాన్యాలు
సుమారు 36.82 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పప్పుధాన్యాలు సాగు చేయబడ్డాయి. గత సంవత్సరం సంబంధిత కాలంలో 9.46 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోనే ఇవి సాగు చేయబడ్డాయి.
ముతక తృణధాన్యాలు
అంతకు ముందు ఏడాది వేసవిలో 35.20 లక్షల హెక్టార్ల విస్తీర్ణంతో పోలిస్తే.. ఈ ఏడాది ఇదే కాలంలో 70.69 లక్షల హెక్టార్లలోనే ముతక తృణధాన్యాలు సాగు చేయబడ్డాయి.
నూనెగింజలు
గత ఏడాది వేసవి పంటకాలంలో 33.63 లక్షల హెక్టార్లతో పోలిస్తే .. ఈ ఏడాది వేసవిలో 109.20 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో నూనె గింజల పంట సాగు చేయబడింది.
చెరకు
వేసవిలో దాదాపు 50.62 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో చెరకు పంట సాగు చేశారు. గత ఏడాది ఇదే సమయంలో 49.86 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో చెరకు పంట సాగు చేయబడింది.
జనపనార & గోగునార
5.89 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో జనపనార & గోగునారను సాగు చేయగా.. గత ఏడాది ఇదే కాలంలో 6.80 లక్షల హెక్టార్ల మేర ఈ పంటలు సాగు చేయబడ్డాయి.
పత్తి
సుమారు 91.67 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగు చేయబడింది. గత ఏడాది ఇదే సమయంలో సుమారు 45.85 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పంట సాగు చేయబడింది.
పంటల సాగు విస్తీర్ణం వివరాలు ఈ లింక్‌లో చూడొచ్చు..
****
(Release ID: 1636536)
Visitor Counter : 316