ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మేఘాలయ ఆశాలు: కోవిడ్ సంక్షోభం మీద పోరులో కీలకం
నిఘా, అవగాహన పెంపును బలోపేతం చేసిన 6700 మంది ఆశాలు
Posted On:
04 JUL 2020 3:39PM by PIB Hyderabad
మేఘాలయలో కోవిడ్ వ్యాప్తిని గుర్తించిన వెంటనే ఆశా కార్యకర్తలకు తగిన శిక్షణ ఇచ్చి బాధితుల గుర్తింపు బృందాలలోను, కంటెయిన్మెంట్ ప్రాంతాల గుర్తింపులోను వారిని భాస్వాములను చేశారు. ఆ సమయంలో రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ కు 12 కిలోమీటర్ల దూరంలో 70కి పైగా ఇళ్ళున్న మాథారియా పొమ్లకరై అనే గ్రామంలో ఒక కోవిడ్ నిర్థారిత కేసు బైటపడింది. వెంటనే స్థానిక కోవిడ్ నిర్వహణ కమిటీ ఏర్పాటు చేసి అందులో ఆశా కార్యకర్త ఎస్, కుర్కళాంగ్ ను కీలక సభ్యురాలిని చేశారు.
ఆ గ్రామంలో బాధితునికి చేరువగా ఉండి వ్యాధి సోకే అవకాశమున్న 35 మందిని గుర్తించటంలో ఆమె పాత్ర కీలకంగా మారింది. మిగిలిన స్థానికులను ఇళ్ళలోనే క్వారెంటైన్ లో ఉండాల్సిందిగా సూచిస్తూ ఇళ్లలో పాటించాల్సిన పద్ధతులమీద తాను అందరికీ కౌన్సిలింగ్ చేసింది. క్రమం తప్పకుండా ఆ ఇళ్లకు వెళుతూ వాళ్ళ వైద్య అవసరాలను కూడా నెరవేర్చింది.
గ్రామ కార్యకర్తలతోకలిసి ఆమె గ్తామస్తులకు నిత్యావసర వస్తువుల వంటివి అందజేస్తూ ఇళ్లలో త్రాగునీరు సైతం అందేలా చర్యలు తీసుకుంది. మరోవైపు గ్రామంలో వైద్య సేవలు అందించటంలో ఎంతమాత్రమూ నిర్లక్ష్యం చెయ్యలేదు. గర్భిణుల ఆరోగ్య సేవలు, ప్రసవాలు, పసికందుల వైద్య సేవలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు. టీబీ, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులను ఓ కంట కనిపెట్టటం కొనసాగిస్తూనే వచ్చింది. ప్రసవాలు సంస్థాగతంగా ఆస్పత్రులలోనే జరిగేటట్టుగా చూడటం, గర్భిణులకు, పిల్లలకు సకాలంలో టీకాలు వేయించటం లాంటి పనులు కూడా కొనసాగించింది. అవసరమైనప్పుడు స్థానిక వాలంటీర్ల సహకారమూ అందుకుంటోంది. ఆ విధంగా తన దైనందిన బాధ్యతలు నిర్వర్తిస్తూనే అదనంగా వచ్చిన కోవిడ్ బాధ్యతలు చేపట్టింది. కోవిడ్ కాని వ్యాధుల చికిత్సకు ఎలాంటి ఆటంకమూ కలగకుందానే కోవిడ్ బాధితులపట్ల జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్రత్యేకత చాటుకుంది.
ఆవిధంగా స్థానికులకు ఆశా కార్యకర్త తోడై నేడు పొమ్లకరై గ్రామాన్ని కోవిడ్ రహితంగా మార్చారు.
మేఘాలయలో ముందువరసలో నిలబడి పోరాడిన ఈ యోధులే వ్యాధి వ్యాప్తిని సమర్థంగా అడ్డుకోగలిగారు. కోవిడ్ కు వ్యతిరేకంగా పోరాడిన తీరులో ఆశా కార్యకర్తల సేవలను వాడుకున్న విధానం ఆ రాష్ట్రపు ఆదర్శాన్ని చాటుకుంది. అన్ని స్థాయిలలోను 6700 మంది ఆశా కార్యకర్తలు కోవిడ్ గ్రామ ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లోను, కోవిడ్ బాధితుల గుర్తింపు, వ్యాప్తి నివారణలోని వీరు భాగస్వాములయ్యారు. కంటెయిన్మెంట్ జోన్లలో సోదాలు జరపటంలో ముందున్నారు. ప్రజలలో అవగాహన పెంచుతూ చేతులు శుభ్రంగా కడుక్కోవటం, మాస్కులు ధరించటం, భౌతిక దూరం పాటించటం లాంటి జాగ్రత్తలను వివరించారు. లక్షణాలున్న వారిని సకాలంలో గుర్తించటం ద్వారా వ్యాప్తిని కూడా సమర్థంగా అడ్డుకోగలిగారు.
******
(Release ID: 1636480)
Visitor Counter : 258