రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

కోవిడ్-19కి పల్స్ ఆక్సిమీటర్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల వంటి కీలకమైన వైద్య పరికరాల ధరల పెరుగుదలను ఎన్‌పిపిఎ పర్యవేక్షిస్తుంది, దేశంలో తగినంత లభ్యతను కూడా నిర్ధారిస్తుంది

Posted On: 02 JUL 2020 4:31PM by PIB Hyderabad

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో చికిత్స నిర్వహణకు అవసరమైన కీలకమైన వైద్య పరికరాలు తగిన స్థాయిలో అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం కృషిని ముమ్మరం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అటువంటి పరికరాలను గుర్తించి అవి లభ్యతలో ఉండేలా చూడవలసిందిగా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ)ని కోరింది.

వినియోగదారులకు సరసమైన ధరలకు ప్రాణ రక్షక మందులు / పరికరాల లభ్యత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని వైద్య పరికరాలు డ్రగ్స్‌గా నోటిఫై అయ్యాయి. డ్రగ్స్, కాస్మటిక్స్ యాక్ట్, 1940, డ్రగ్స్ ధరలు (కంట్రోల్ ఆర్డర్), 2013, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుండి నియంత్రణ వ్యవస్థలో ఉన్నాయి. క్లిష్టమైన వైద్య ధరల పెరుగుదలను తనిఖీ చేయడానికి ఎన్‌పిపిఎ, డిపికో, 2013 కింద ఇవ్వబడిన అధికారాల అమలులో భాగంగా, (i) పల్స్ ఆక్సిమీటర్ (ii) ఆక్సిజన్ కాన్సంట్రేటర్ తయారీదారులు / దిగుమతిదారుల నుండి ధర సంబంధిత డేటాను తెప్పించుకున్న ప్రభుత్వం 2020 ఏప్రిల్ 1 వ తేదీ నాటికి ఉన్న ధరలకు సంవత్సరంలో 10% కంటే ఎక్కువ పెంచకుండా చూసుకోవాలని సూచించింది.

మెడికల్ డివైసెస్ ఇండస్ట్రీ అసోసియేషన్స్, సివిల్ సొసైటీ గ్రూపులతో వాటాదారుల సంప్రదింపులు 2020, జూలై 1 న ఎన్‌పిపిఎలో జరిగాయి, ఇందులో క్లిష్టమైన వైద్య పరికరాల తయారీదారులు / దిగుమతిదారులందరూ దేశంలో తగినంత లభ్యతను నిర్ధారించాలని నొక్కిచెప్పారు. అన్ని వైద్య పరికరాలు డిపిసిఓ, 2013 కింద ధరల నియంత్రణలలోకి వచ్చాయి. ఎన్‌పిపిఎ చైర్మన్ కూడా పరిశ్రమను "సాధారణంగా జరిగే వ్యాపారం మాదిరీ చూడరాదని, ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల్లో లాభం పొందే సమయం కాదని అన్నారు. ఎన్-95 మాస్కుల తయారీదారులు / దిగుమతిదారులు చేసినట్లుగా, ప్రస్తుత పరిస్థితులలో పెద్ద ప్రజా ప్రయోజనంతో క్లిష్టమైన వైద్య పరికరాల రిటైల్ ధరను తగ్గించాలని వైద్య పరికరాల పరిశ్రమ సంఘాలను కోరారు.

 

******



(Release ID: 1636038) Visitor Counter : 267