ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జార్ఖండ్ సహియాలు: సామాజిక ఆరోగ్య కార్యకర్తలకు స్ఫూర్తి


కోవిడ్ బాధితుల గుర్తింపు కోసం ప్రజారోగ్య సర్వేలో 42,000 మంది సహియాల సేవలు

Posted On: 01 JUL 2020 12:33PM by PIB Hyderabad

మార్చి 13న జార్ఖండ్ లోని బొకారో జిల్లా తేలో గ్రామానికి కమరున్నీసా, ఆమె భర్త నూర్ మహమ్మద్ వచ్చారు. వారు జమాత్ లో పాల్గొని ఇల్లు చేరారు. విమానాశ్రయంలో జరిపిన వైద్య పరీక్షల అనంతరం ఊళ్ళోనే హోమ్ క్వారంటైన్ లో ఉండాలని వాళ్ళకు చెప్పారు. సహియా గా పిలిచే అక్కడి ఆశా కార్యకర్త రీనాదేవి ఈ సమాచారాన్ని తన ఇంటింటి సర్వేలో భాగంగా సేకరించింది.

ఆమె వెంటనే ఆ బ్లాక్ వైద్యాధికారికి సమాచారం తెలియజేసింది. నిబంధనలకు అనుగుణంగా హోమ్ క్వారంటైన్ పాటించాల్సిందిగా ఆ జంటకు కౌన్సిలింగ్ ఇచ్చింది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా తెలుసుకుంటూ ఉంది. అవసరమైన వైద్య సదుపాయం అందేట్టు చూసింది. ఈ క్రమంలో కమరున్నీసా కు పాజిటివ్ గా నిర్థారణ కావటంతో వెంటనే బొకారో జనరల్ ఆస్పత్రిలో ఆమెను క్వారంటైన్ చేశారు.  మరునాడే ఒక వైద్య బృందం వాళ్ళ ఇంటికి వెళ్ళేలా సహియా రీనాదేవి తగిన చర్యలు తీసుకుంది. కుటుంబ సభ్యులందరూ హోమ్ క్వారంటైన్ లో ఉండేలా సహాయపడింది. ఆ జంటకు వైద్యసాయం అందించటంతోబాటు కుటుంబ సభ్యులందరూ క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరాన్ని నచ్చజెప్పి వ్యాధి విస్తరించకుండా జాగ్రత్త పడింది. సకాలంలో సానుకూలంగా స్పందించి రీనాదేవి వ్యవహరించిన తీరు కారణంగా ఆ కుటుంబంలో ఇతరులకు వైరస్ సోకకుండా కాపాడగలిగింది.

జార్కండ్ లోని ఆశా కార్యకర్తలను సహియాలుగా పిలుస్తారు. మారుమూల ప్రాంతాలలో,ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో సైతం వైద్య సేవలు అందేలా వారు కృషి చేశారు. ఆ రాష్ట్రంలో మొత్తం42,000 మంది సహియాలు, వారికి సహాయకారులుగా 2260 మంది సహియా సాథీలు582 మంది బ్లాక్ ట్రెయినర్లు, 24 జిల్లాల కమ్యూనిటీ మొబిలైజర్లు, రాష్ట్రస్థాయి వనరుల కేంద్రం ఉన్నాయి. ఈ కార్యక్రమం ఆరంభమైనప్పటినుంచి సహియాలు ఎంత అంకిత భావంతో పనిచేసేవారో సమాజానికి తెలిసి వచ్చింది. వెళ్ళటానికి కూదా సాధ్యంకాని మారుమూల గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలు అందటానికి వారి కృషి ఎంతగానో ఉపయోగపడింది.

2020 మార్చి నుంచి కోవిడ్ సంబంధ సేవలలో సహియాలు నిమగ్నమయ్యారు. తరచు సబ్బునీళ్ళతో చేతులు కడుక్కొవటం, మాస్కుల వాడకం, బహిరంగ ప్రదేశాలకు వెళుతున్నప్పుడు మాస్కుల వాడకం, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు పాటించాల్సిన నియమాల వంటి ముందస్తు జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించటంలో కీలపాత్ర పోషించారు.  అదే విధంగా వ్యాధి సోకినవారిని గుర్తించటంలో కూడా సహాయపడ్దారు.

జార్హండ్ రాష్ట్రం జూన్ 18 నుంచి 25 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ సోకే అవకాశమున్న జనాభాను గుర్తించే  ప్రజారోగ్య సర్వే కార్యక్రమం చేపట్టింది. మొదటి రోజు గ్రామ స్థాయిలోను, పట్టణాలలోను సమావేశాలు జరిపి క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలను, చేపట్టాల్సిన కార్యక్రమాలను ఖరారు చేసింది. ఆ తరువాత వరుసగా ఇంటింటికీ సర్వే చేపట్టింది. ఇందులో దాదాపు 42,000 మంది సహియాలు కీలకపాత్ర పోషించారు. వేలాది ఇళ్లకు తిరిగి ఫ్లూ తదితర ఊపిరితిత్తుల సమస్యలున్నవారిని, దీర్ఘ కాల వ్యాధులతో బాధపడుతున్నవారిని, ఐదేళ్లలోపు ఉండి టీకాలు వేయించుకోని పిల్లలను, నిర్దిష్ట కాలంలో చికిత్సలు పొందాల్సిన గర్భిణులను గుర్తించారు.  అదే సమయంలో ఇతర వ్యాధులు కూడా గుర్తించారు.  అలా కొవిడ్ సోకే అవకాశమున్నవారి సమాచారాన్ని సబ్ సెంటర్, బ్లాక్, జిల్ల వైద్య బృమ్దాలకు తెలియజేసారు.

ఈ సర్వే సమయంలో సహియాలు కౌన్సిలింగ్ తో బాటు పసికందుల సంరక్షణ, దీర్ఘకాల వ్యాధులున్నవారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజెప్పటం లాంటి బహుళ బాధ్యతలు నిర్వర్తించారు.  అందువలన ఆ ఇళ్ళకు  వేరు వేరు పనులమీద పదే పదే వెళ్లాల్సిన అవసరాన్ని కూడా తగ్గించగలిగారు.

జార్ఖండ్ లోని ఆశా కార్యకర్తలు లేదా సహియాలు మాతృత్వం, జననాలు, పిల్లల ఆరోగ్యం వంటి విషయాలలో తమ అంకిత భావాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు కోవిడ్ సంబంధ కార్యకలాపాలలో కూడా సందర్భానికి తగినట్టు వ్యవహరించి అందరి మన్ననలూ పొందగలిగారు.

 జార్ఖండ్ సన్నివేశాలు: సామాజిక వైద్య సేవలలో నిమగ్నమైన సహియాలు

 

 

*****


(Release ID: 1635636) Visitor Counter : 329