ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఉత్తరప్రదేశ్ లో కోవిడ్ మీద పోరులో ముందున్న ఆశా కార్యకర్తలు


తిరిగి వచ్చిన 30.43 లక్షల వలస కార్మికులను గుర్తించిన లక్షా 60 వేలమంది ఆశా కార్యకర్తలు

Posted On: 30 JUN 2020 12:52PM by PIB Hyderabad

 

ఉత్తరప్రదేశ్ లోని బహ్రైచ్ జిల్లాలోని హుజోర్పూర్ బ్లాక్, నిబూహి గ్రామానికి చెందిన ఇరవయ్యేళ్ళ సురేశ్ కుమార్ ముంబై నగరంలో ఒక జ్యూ షాప్ లో పనిచేసేవాడు. మరికొందరు వలస కార్మికులతో కలిసి మే మొదట్లో ఒక లారీలో ఇంటికి తిరిగొచ్చాడు. ఆ ప్రయాణం దాదాపు ఐదు రోజులపాటు సాగింది. అలా ఇంటికి చేరగానే చంద్ర ప్రభ అనే స్థానిక ఆశా కార్యకర్త ఒకరు అతణ్ని కలుసుకొని వివరాలన్నీ నమోదు చేసుకున్నారు. బహ్రైచ్ జిల్లా రాపిడ్ రెస్పాన్స్ టీమ్ వారికి ఆమె ఆ వివరాలు అందజేశారు. వెంతనే ఆ ధికారులు అతణ్ణి ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాల్సిందిగా సూచించారు. చంద్ర ప్రభ అతడి కుటుంబ సభ్యులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి హోమ్ క్వారంటైన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ వివరించారు.ామె క్రమం తప్పకుండా ఆ ఇంటికి వెళుతూ కుటుంబ సభ్యులకు అన్నివిధాలా నచ్చజెప్పారు. సురేష్ కు లక్షణాలు బైటపడిన వెంటనే ఆమె అప్రమత్తత, నవ్చజెప్పిన తీరు ఫలితంగా అతణ్ణి చితౌరా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించ గలిగారు. అదే విధంగా సురేశ్ కుటుంబ సభ్యులందరికీ కోవిడ్ పరీక్షలు జరిపించటంలోమ్ కూడా చంద్ర ప్రభ చొరవ తీసుకున్నారు.


( ఫొటో: ఉత్తరప్రదేశ్ గ్రామాలు: కోవిడ్ మీద పోరులో ముందు నిలిచిన ఆశా కార్యకర్తలు )


 


 దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండటం, హాట్ స్పాట్ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వలస కార్మికులు రావటం ఉత్తరప్రదేశ్ కు పెనుసవాలుగా మారింది. ఇలా ఊళ్లకు తిరిగి వచిన వారందరికీ వైద్య సదుపాయాలు కల్పించటం, వైరస్ వ్యాప్తిని అరికట్టటం, మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా సమస్యగా తయారైంది. అలాంటి సంక్షోభ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆశా కార్యకర్తలు ఆశాకిరణంలా మారారు.

ఈ భారీ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ లోని లక్షా అరవై వేల మంది ఆశా కార్యకర్తలు భాగస్వాములయ్యారు. ఊళ్ళకు తిరిగొచ్చిన 30.43 లక్షలమంది వలసకార్మికుల గుర్తించటంలో వాళ్లదే కీలకపాత్ర. మొదటి దశలో 11.24 లక్షలమంది, రెండో దశలో 19.19 లక్షల మంది ఇళ్ళకు చేరుకున్నట్టు తేల్చారు. కేవలం వాళ్లను గుర్తించటానికే పరిమితం కాకుండా కరోనా వైరస్ సోకిన లక్షణాలున్న 7965 మందికి పరీక్షలు జరిపించారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ శాంపిల్స్ సేకరణలోనూ చురుగ్గా వ్యవహరించారు. అలా తిరిగొచ్చిన వలస కార్మికులలో2232 మంది సాంపిల్స్ తీయగా వారిలో 203మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో వాళ్ళను కోవిడ్ ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. అన్ని గ్రామాలలో నిగ్రాణి సమితులు పేరిట నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. ఈ వాలంటీర్లు గస్తీ బృందాలుగా తయారై ఆశా కార్యకర్తలకు వలస కార్మికుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వచ్చారు. క్రమం తప్పకుండా సబ్బు నీళ్లతో చేతులు కడుక్కోవటం, మాస్కులు ధరించాల్సిన అవసరం, భౌతిక దూరం పాటించటం లాంటి విషయాలలో అవగాహన పెంచటంలోనూ ఆశా కార్యకర్తలు తమ వంతు పాత్ర పోషించారు. దీని ఫలితంగా అందరికీ అవగాహన పెరిగింది.  సమీపంలోని ఆరోగ్య కేంద్రాలను ఎలా వాడుకోవాలో తెలిసింది. ఈ పోరులో భాగంగా విధులు నిర్వహించిన  ఆశా కార్యకర్తలకు మాస్కులు, సానితైజర్ల లాంటి ప్రాథమిక రక్షణ సామగ్రి అందించారు.

అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక పాఠశాలలవంటి భవనాలలో సామూహిక క్వారంటైన్ కేంద్రాల నిర్వహణలో పంచాయితీరాజ్ శాఖకు కూడా ఆశా కార్యకర్తలు ఎంతగానో సాయపడ్డారు. అలాంటి చోట్ల ఆరోగ్య సేతు యాప్ ను తప్పనిసరిగా వాడేలా చూశారు. అందుకు అవసరమైన అవగాహన పెంచారు

కోవిడ్ తో నేరుగా సంబంధం లేని ఇతర సేవలలో కూడా ఆశాకార్యకర్తలు అద్భుతమైన సేవలందించారు. ాఅయుష్మాన్ భారత్ కింద హెల్త్, వెల్ నెస్ కేంద్రాలలో అందరికీ ఏ మేరకు రిస్క్ ఉందో పరిశీలించే కార్యక్రమంలో కూడా సాయం చేశారు. బీపీ, మధుఇమేహం, కాన్సర్, క్షయ, కుష్ఠవ్యాధి లాంటి దీర్ఘ కాల వ్యాధులున్నవారికి స్క్రీనింగ్ పరీక్షలు జరపటానికి అందరినీ ఆయా కేంద్రాలకు తరలించటంలో కీలకపాత్ర పోషించారు. గర్భిణులకు, శిశువులకు వైద్య సేవలందించటంలో ద్వారా వాళ్ళు భౌతికదూరం పాటిస్తూ చికిత్స అందుకోవటానికి సాయపడ్డారు.  ఇలాంటి సౌకర్యం అందుబాటులో ఉన్న విషయం ప్రజలకు తెలియజేసి అవగాహన కల్పించటంలో ముందున్నారు. 


దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దాదాపు 10లక్షల మంది ఆశా కార్యకర్తలకు నేషనల్ హెల్త్ మిషన్ సహాయపడుతోంది. వారిలో ఆరోవంతు మంది, అంటే లక్షా 67 వేలమంది ఉత్తరప్రదేశ్ వారే కావటం గమనార్హం.

 

*****(Release ID: 1635428) Visitor Counter : 237