పర్యటక మంత్రిత్వ శాఖ

దేఖో అప్నా దేశ్ సిరీస్ కింద ‘కోవిడ్ కాలంలో సురక్షితంగా, బాధ్యతగా తెరుచుకుంటున్న పర్యాటక రంగం: ఆరోగ్య సంరక్షణ దృక్పథం’ పేరుతో 39 వ వెబి‌నార్‌ నిర్వహించిన పర్యాటక మంత్రిత్వ శాఖ


Posted On: 29 JUN 2020 3:38PM by PIB Hyderabad

 

దేఖో అప్నా దేశ్ వెబి‌నార్ సిరీస్ కొనసాగింపులో, పర్యాటక మంత్రిత్వ శాఖ 2020 జూన్ 27 న కోవిడ్ సమయంలో అన్‌లాకింగ్ ట్రావెల్, టూరిజంపై సిరీస్‌లో తాజా సెషన్‌ను ప్రారంభించింది.  దేఖో అప్నా దేశ్ సిరీస్ ఏక్ భారత్ శ్రేష్ట భారత్ కింద భారతదేశం గొప్ప వైవిధ్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం. 

దేఖో అప్నా దేశ్ వెబి‌నార్ సిరీస్ 39 వ సెషన్‌ను పర్యాటక మంత్రిత్వ శాఖ ఏడిజే శ్రీమతి రూపీందర్ బ్రార్ సమన్వయం చేశారు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ సందీప్ భల్లా,  కొచ్చిలోని అమృతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ & సైన్సెస్ రీసెర్చ్ సెంటర్ చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంజీవ్ కుమార్ సింగ్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పరిధి మోడి కోవిడ్ సమయంలో సురక్షితంగా, బాధ్యతగా ప్రయాణించడం గురించి వివరించారు.

భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఇప్పుడు క్రమంగా వాణిజ్యం, ప్రయాణ, పర్యాటక రంగాలతో సహా పరిశ్రమలను తెరుస్తున్నందున, జీవితాన్ని సాధారణ స్థితికి తీసుకురావడం పెద్ద ఆందోళనగా ఉంది. కొత్తగా ఇపుడు రావాల్సిన సాధారణ పరిస్థితుల్లో ప్రతి పరిశ్రమ తన సిబ్బందిని, క్లయింట్‌ను సంక్రమణ నుండి రక్షించడానికి ముందు జాగ్రత్త, నివారణ చర్యలు తీసుకోవాలి. శాస్త్రీయ సమాచారాన్ని సరళమైన రీతిలో వ్యాప్తి చేయడం, అపోహలు, తప్పుడు సమాచారాన్ని తొలగించడం కూడా అవసరం. కార్యాలయాలను తిరిగి తెరవడానికి తీసుకోవలసిన నివారణ చర్యలకు సంబంధించి పాల్గొనేవారికి అవగాహన పెంచడం, కోవిడ్ సమయంలో సిబ్బంది, వారి కుటుంబం, ఖాతాదారుల భద్రత, శ్రేయస్సును నిర్ధారించడంపై ఈ సందర్భంలో, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. 

కోవిడ్ -19  స్థితిగతులను వివరించడంతో ఈ సెషన్ ప్రారంభమైంది. కోవిడ్ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణలోనే కాకుండా దేశ అభివృద్ధికి కూడా అసాధారణమైన అంతరాయాన్ని సృష్టించింది. దీర్ఘకాలిక ప్రాతిపదికన వ్యాధి ప్రాబల్యం ఇది జీవితంలోని అన్ని అంశాలను తిరగరాయబోతోందని, రాబోయే కొత్త పరిస్థితుల్లో ప్రాధాన్యతలు భిన్నంగా ఉంటాయని సూచిస్తోంది.

భారతదేశంలో కేసులు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ సానుకూల అంశాలు కూడా ఉన్నాయి, రికవరీ రేటు సుమారుగా భారతదేశంలో 58.2% ఉంది. మన దేశానికి సానుకూలమైన మరో అంశం మహమ్మారికి రాష్ట్రాలు వివిధ నమూనాలతో ముందుకు వచ్చాయి. ఈ మహమ్మారి గురించి తెలుసుకోవడానికి, అవగాహన పొందటానికి ఇది సమయం, భయం నుండి బయటపడటం ప్రస్తుతానికి ప్రాథమిక లక్ష్యం / ఆలోచన.

అంతేకాకుండా, మహమ్మారికి సంబంధించిన వివిధ వాస్తవాలు, గణాంకాలు, భద్రతా చర్యలను ఈ సెషన్ ప్రముఖంగా ప్రస్తావించింది. 80% కోవిడ్ కేసులు లక్షణరహితమని, అందువల్ల నివారణ ఉత్తమ ఔషధమని ఈ వెబినార్ లో వివరించారు. మాస్క్ ల వాడకం రోజుకు 3% వ్యాధి సంక్రమణను తగ్గిస్తుందని సమర్పకులు తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణ కార్మికులు ఎన్95, 3ప్లై  సర్జికల్ మాస్క్‌లను ఉపయోగించాలి, ప్రజలు డబుల్ లేయర్ క్లాత్ మాస్క్‌ని ఉపయోగించవచ్చు, వీటిని సరిగ్గా కడిగి ఎండబెట్టాలి. తగినదాన్ని ఎంచుకోవడానికి మార్కెట్లో వివిధ రకాల హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉన్నాయని సమర్పకులు తెలియజేశారు, శానిటైజర్‌లో ఉన్న ఆల్కహాల్ ఉనికిని తనిఖీ చేయవచ్చు.

విమానం, బస్సు ప్రయాణ పరంగా ఆచరించాల్సిన జాగ్రత్తల గురించి ఈ సెషన్ ప్రముఖంగా వివరించింది. ఆతిథ్య కార్యకలాపాలు, ఫుడ్ ప్యాకింగ్, వ్యక్తిగత పరిశుభ్రత, శుభ్రపరిచే ప్రోటోకాల్స్, డైనింగ్ ప్రోటోకాల్స్ కోసం ఈ సెషన్ హైలైట్ చేసింది. మానసిక ఆరోగ్యం కోసం ప్రజలతో కనెక్ట్ అవ్వడం, యోగా, ధ్యానం చేయడం, “నాకు సమయం మాకు సమయం” గడపడం, దాతృత్వం చేయడం, వాట్సాప్, నకిలీ వార్తలను నివారించడం మంచిది. అంతేకాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థలో, ఉద్యోగాల కోసం, దేశ అభివృద్ధికి పర్యాటక రంగం పెద్ద పాత్ర పోషిస్తుందని సెషన్ వివరించింది.

భారతదేశం కోవిడ్ -19 తో గట్టిగా పోరాడుతోందని, ప్రభుత్వం భారీ జనాభా గలిగిన మొత్తం దేశాన్నంతా దృష్టిలో పెట్టుకుని అనేక చర్యలు తీసుకుంటోంది.  ప్రతి పౌరుడు చాలా బాధ్యత వహించాలి, మార్గదర్శకాలు, భద్రత, ముందు జాగ్రత్త చర్యలను అనుసరించడం ద్వారా ప్రభుత్వ చేపట్టే ప్రయత్నాలలో భాగస్వామ్యులు కావాలి. భయాందోళనలను నివారించండి, చుట్టూ ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి.. అని నూతన ఉత్తేజం ఇచ్చిన సందేశంతో వెబినార్ ముగిసింది. 

వెబినార్ సెషన్లు ఈ లింకుల్లో అందుబాటులో ఉంటాయి. 

https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured

http://tourism.gov.in/dekho-apna-desh-webinar-ministry-tourism

https://www.incredibleindia.org/content/incredible-india-v2/en/events/dekho-apna-desh.html

 

తరువాతి వెబినార్ జులై 4వ తేదీ శనివారం ఉదయం 11గంటలకు ' మహిళా మోటార్ సైకిల్ డ్రైవర్' అనే పేరుతో జరగనున్నది. 

*******

 



(Release ID: 1635251) Visitor Counter : 180