ఆర్థిక సంఘం

కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రితో 15వ ఆర్థిక క‌మీష‌న్ భేటీ, వ్య‌వ‌సాయ సంస్కరణల ఎజెండా ప్ర‌కారం రైతు సంక్షేమ రాష్ట్రాలకు త‌గిన ప్రోత్సాహ‌కాలు


Posted On: 26 JUN 2020 5:43PM by PIB Hyderabad

 

15వ ఆర్థిక కమిషన్ ఛైర్మన్ శ్రీ ఎన్.కె. సింగ్, క‌మిష‌న్ స‌భ్యులు ఈ రోజు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్,  మంత్రిత్వ శాఖ సీనియ‌ర్ ఉన్నతాధికారులతో సమావేశ‌మయ్యారు. దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా దేశ వ్యవసాయ రంగానికి త‌గిన మ‌ద్ద‌తునిచ్చే విధంగా ప్ర‌భుత్వం ప‌లు చ‌ర్య‌ల‌ను ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా సాగు, మత్స్యసంప‌ద‌, ఆహార ప్రాసెసింగ్ రంగాలకు చెందిన‌ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ మరియు సామ‌ర్థ్య‌పు పెంపును బలోపేతం చేయడానికి మరియు రీఓరియంట్ చేయడానికి.. వ్యవసాయాన్ని పెంచేందుకు గాను భారత ప్రభుత్వం వివిధ చర్యలను ప్రకటించింది. వ్యవసాయ సంస్కరణలు మరియు ఎగుమతుల ప్రోత్సాహకాలపై దాని ప్రతిపాదిత సూత్రీకరణకు గాను.. 15వ ఆర్థిక కమిషన్ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రితో ఈ త‌ర‌హా చర్చకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఈ సమావేశం నిర్వ‌హించారు. 15వ ఆర్థిక కమిషన్ టీఓఆర్ యొక్క-7 మేర‌కు దేశంలో సాగు సంస్కరణలు, ఎగుమతులు ప్రోత్సాహకాలపై ప్రతిపాదిత సూత్రీకరణ తిరిగి మార్చే విష‌య‌మై.. చ‌ర్చించేలా కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రితో ఈ స‌మావేశం జ‌రిపారు. ఐటీసీ సంస్థ సీఎండీ అధ్య‌క్ష‌త‌న అంతకు ముందు 15వ  ఆర్థిక కమిషన్ వ్యవసాయ ఎగుమతులపై ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే.

వ్య‌వ‌సాయ‌-ఎగుమతులకు సంబంధించి ఇప్పటివరకు కమిటీ సమావేశాలలో చర్చించిన కొన్ని ముఖ్య అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

  • భారత్‌ ప్రపంచంలో రెండవ అత్యధిక వ్యవసాయ ఉత్పత్తిదారుగా ఉంది.. మరియు అనేక ముఖ్యమైన వ్యవసాయ విభాగాలలో ప్రపంచ అధినేత‌గా ఉంది.
  • వ్యవసాయంలో ఇతర దేశాల కంటే ఇది పోటీ ప్రయోజనాన్ని కలిగి ఉంది. ఎందుకంటే దాని విభిన్న వ్యవసాయ వాతావరణ పరిస్థితులు విభిన్న పంటల‌ పోర్ట్‌ఫోలియో సామర్థ్యాన్ని సృష్టించాయి; రెండు ప్రధాన పంట సీజన్లు (ఖరీఫ్ మరియు రబీ) మరియు శ్రమ మరియు తయారీకి తక్కువ ఖర్చు వ్య‌వ‌సాయానికి క‌లిసి వ‌చ్చే అంశాలు. అయితే, పోటీతత్వాన్ని చూస్తే, వ్యవసాయ ఎగుమతుల విషయంలో భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా 11 వ స్థానంలో ఉంది.
  • వ్యవసాయ యోగ్యమైన భూమి పరంగా భారతదేశం ప్రపంచ వ్యాప్త‌ ప్రయోజనం  క‌లిగి ఉంది. అయితే హెక్టారుకు సాధించే దిగుబ‌డి విష‌యంలో చిన్న దేశాలను గణనీయంగా వెనుకబడి ఉంది. (ఎ) తక్కువ దిగుబడి మరియు త‌క్కువ వ్యవసాయ ఉత్పాదకత (బి) విలువ చేరికపై తక్కువగా దృష్టి పెట్టడం,  దీంతో వియత్నాం లాంటి ఇతరులు మార్కెట్‌ల‌ను స్వాధీనం చేసుకున్నారు (సి) పెద్ద దేశీయ మార్కెట్
  • భారతదేశం యొక్క ప్రాసెస్ చేయబడిన ఎగుమతులు క్రమంగా మెరుగు ప‌డుతూ వ‌స్తున్నాయి. కాని ఇప్పటికీ ప్ర‌పంచ వ్యాప్తంగా విశ్లేషించి చూస్తే ప్రాసెస్ చేసిన వస్తువుల కంటే ముడి వస్తువులలో వాటానే ఎక్కువగా క‌లిగి ఉంది.
  • భారతదేశం యొక్క వ్యవసాయ ఎగుమతులు గత 10 సంవత్సరాలుగా అస్థిరంగా ఉన్నాయి, కానీ ఇటీవల ఇది కొంత స్థిరీక‌ర‌ణ దిశ‌గా సాగుతున్నాయి.
  • ఈ ఆఫర్ విదేశీ మార్కెట్లోకి భార‌త్ అడుగుపెట్టేందుకు మ‌రియు మారకద్రవ్యం సంపాదించడానికి, వ్యవసాయ ఉత్పత్తులకు అధిక ధరలను సంపాదించడానికి ఉత్పత్తిదారులకు అవకాశం కల్పిస్తుంది.
  • భారతదేశం యొక్క టాప్ 50 వస్తువులు మరియు వ్యవసాయ ఉత్పత్తుల‌ది మొత్తం ఎగుమతుల్లో 75 శాతం వాటా.
  • భారతదేశం తన వ్యవసాయ విలువలో 70 శాతాన్ని 20 దేశాలకు ఎగుమతి చేస్తుంది; ఐరోపా మరియు అమెరికాకు ఎక్కువ ఎగుమతి చేసే అవకాశం ఉంది.
  • భారతదేశం వ్యవసాయ ఉత్పత్తులలో 20 బిలియ‌న్ డాల‌ర్ల కంటే కూడా ఎక్కువ దిగుమతి చేస్తోంది.
  • ఇది ఇప్పటికీ 18 బిలియ‌న్ డాల‌ర్ల ముఖ్యమైన వాణిజ్య మిగులును నిర్వహిస్తుంది.
  • వ్యవసాయ రంగానికి సంబంధించి ఇటీవలి ప్రకటనల‌పై (కోవిడ్ త‌రువాత ప‌రిస్థితి) నేటి చర్చల్లో దృష్టి సారించారు. 15వ ఆర్థిక క‌మీష‌న్ వీటికి 2021-22 నుండి 2025-26 వరకు అవార్డు కాలంగా పరిగణనలోకి తీసుకోనుంది. వాటిలో ప్రాథమికమైనవి:
  •  ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా వ్యవసాయానికి సంబంధించిన సంస్కరణల వివరాలు
  • అత్య‌వ‌స‌ర వస్తువుల చట్టానికి సవరణలు
  • ది ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) ఆర్డినెన్స్, 2020
  • ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ స‌ర్వీసెస్ ఆర్డినెన్స్‌, 2020 పై రైతుల (సాధికారత మరియు రక్షణ) ఒప్పందం.

ఈ రంగం యొక్క అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలను మంత్రిత్వ శాఖ వివరంగా ప్రదర్శించింది. 2021-22 నుండి 2025-26 మధ్య కాలంలో వ్యవసాయ పరిశోధన మరియు విద్యా శాఖ (డీఏఆర్ఈ)/ ఐసీఏఆర్ కేంద్ర రంగ పథకాల అమలు మరియు బడ్జెట్ అవసరాలపై కమిషన్ ‘ప్రెజెంటేషన్’ ఇచ్చింది. 2020-21 సంవత్సరానికి గాను సాగు సంస్కరణల నిమిత్తం రాష్ట్రాలకు పనితీరు ఆధారిత మంజూరు గురించి 15వ ఆర్థిక క‌మిష‌న్ ఇచ్చిన నివేదికపై కూడా ఈ సమావేశంలో చర్చలు జ‌రిగాయి. వ్యవసాయ సంస్కరణల ఎజెండాలో రాష్ట్రాలను ప్రోత్సహించడానికి, త‌గిన  యంత్రాంగాన్ని రూపొందించడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖతో పాటు 15వ ఆర్థిక కమిషన్ సభ్యుడు (శ్రీ రమేష్ చంద్), కార్యదర్శి (వ్యవసాయం) మరియు కార్యదర్శి (డీఏఆర్ఈ) తో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం సిఫార‌సుల‌ను తుది నివేదిక‌లో చేర్చనున్నారు.

 

******



(Release ID: 1634680) Visitor Counter : 215