ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ కు సంబంధించిన సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలని ఇన్వెస్టర్లు, రాష్ట్రాలకు పిలుపునిచ్చిన కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీమతి హరిసిమ్రత్ కౌర్ బాదల్
6 రాష్ట్రాలు, 193 మంది ఇన్వెస్టర్లు పాల్గొన్న వెబినార్‌కు అధ్యక్షత వహించిన ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి
2020 జూన్ 29న ప్రారంభం కానున్న మైక్రో ఎంటర్‌ప్రెన్యుయర్ల ఫార్మలైజేషన్ పథకం
Posted On:
26 JUN 2020 4:58PM by PIB Hyderabad
కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీమతి హరిసిమ్రత్ కౌర్ బాదల్ , భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్, ఫెసిలిటేషన్ ఎజెన్సీ-ఇన్వెస్ట్ ఇండియా వారి ప్రత్యేక ఇన్వెస్ట్‌మెంట్ ఫోరానికి చెందిన ఫుడ్ ప్రాసెసింగ్ ఎడిషన్ రెండో సిరీస్‌కు అధ్యక్షత వహించారు . 2020 జూన్ 22 వ తేదీ న జరిగిన తొలి ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ సమావేశానికి కొనసాగింపుగా ఇది జరిగింది. ఈ సమావేశంలో కేంద్రప్రభుత్వానికి చెందిన అత్యంత సీనియర్లు అయిన విధాన నిర్ణేతలు పాల్గొన్నారు. అలాగే , ఆరు రాష్ట్రప్రభుత్వాలు-బీహార్, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, 19 దేశాల నుంచి 193 కంపెనీలు ఈ ఫోరం సమావేశంలో పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీమతి హరిసిమ్రత్ కౌర్ బాదల్, కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి దేశం నలుమూలలా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేట్టు చేయడం వల్ల లాక్‌డౌన్ విజయవంతమైందని అన్నారు. దీనిని సుసాధ్యం చేయడానికి అద్భుత కృషి చేసిన ఆహార పరిశ్రమకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. వ్యాపారం పడిపోవడం, తగినంతమంది కార్మికులు అందుబాటులో లేకపోవ డం, త్వరగా పాడైపోయే గుణంగల సరకులలో వృదా వంటి ఎన్నో కొత్త సవాళ్లు ఉన్నప్పటికీ ఈ రంగం అద్బుతంగా కృషి చేసిందన్నారు.
అహార పరిశ్రమలో కొత్త విధానాలు అమలు చేయడం ద్వారా , ఈ సవాళ్లను అవకాశాలుగా మలచుకోవాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర భారత్, స్థానిక వస్తువులకు అధిక ప్రాధాన్యత నివ్వాలంటూ ఇచ్చిన ఓకల్ ఫర్ లోకల్ నినాదాన్ని పాటించాల్సిందిగా ఈ సమావేశంలో పాల్గొన్న వారిని మంత్రి కోరారు. ప్రస్తుతం ఎన్నో దేశాలు భారత్‌ను సోర్సింగ్ హబ్‌గా భావిస్తున్నాయని, ఇవి గతంలో తాము సంప్రదాయికంగా దిగుమతులు చేసుకుంటున్న దేశాలనుంచి కాక ఇండియావైపు చూస్తున్నాయని అన్నారు. పరిశ్రమ తన పూర్తి సామర్ధ్యాన్ని వినియోగించుకోవలసిన సమయం ఆసన్నమైనదని ఆమె అన్నారు. ఇందుకు సంబంధించి ఆమె ఒక ఉదాహరణను ప్రస్తావించారు. తమ మంత్రిత్వశాఖ నిధులతో ఏర్పాటు చేసిన కోల్డ్ చెయిన్ కు కొత్త కొత్త భౌగోళిక ప్రదేశాలనుంచి పండ్లు , కూరగాయల ఆర్డర్లు వస్తున్నాయని చెప్పారు. రెడీ టు ఈట్ ( ఆర్ టి ఇ) రంగంలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, దీనిపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టాలని మంత్రి సూచించారు. భారతదేశానికి చెందిన సూపర్ ఫుడ్స్‌ను, పశ్చిమ దేశాలలో ప్రముఖంగా తెలియజేయాలని, రాష్ట్రాలు బాగా పాపులర్ అయిన , పోషక విలువలు కలిగిన స్థానిక ఆహార పదార్థాల గురించి తెలియజేయాలని, వాటికి బ్రాండ్ కల్పించి, విదేశాలలోని భారత సంతతి లక్ష్యంగా విదేశీ బడా రిటైలర్లద్వారా వాటిని మార్కట్ చేయవచ్చని ఆమె అన్నారు.
వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన నిల్వలను దేశవ్యాప్తంగా పర్యవేక్షించడానికి ఒక అగ్రిగేషన్ పోర్టల్‌ను రూపొందించడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరాన్ని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది పరిశ్రమ అవసరాలు తీర్చడానికే కాకుండా ఎగుమతుల పెంపునకు ఎంతగానో దోహదపడనుందని అన్నారు.
సూక్ష్మ ఎంటర్ ప్రెన్యూయర్లకు సంబంధించి తమ మంత్రిత్వశాఖ 2020 జూన్ 29 నుంచి ఒక కొత్త పథకాన్ని ప్రారంభించనున్న విషయాన్ని ఆమె తెలిపారు. ఇది అధునాత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చుకునేందుకు మద్దతునిస్తుంది. అలాగే చౌకగా రుణం, కొత్త మార్కెట్‌లను అందుబాటులోకి తేవడానికి మద్దతు నిస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో ని మొత్తం ఉపాధిలో 74 శాతం ఉపాధి అసంఘటిత రంగంలోనే ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. 25 లక్షల యూనిట్లలో 60 శాతం యూనిట్లు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయని చెప్పారు. ఇందులో 80 శాతం కుటుంబ అధీనంలోని యూనిట్లని తెలిపారు. ఈ రంగం ఆత్మనిర్బర భారత్‌కు భవిష్యత్తుగా నిలవనున్నదని, దీనిని ఈ రంగం విజయవంతం చేయగలదని ఆమె అన్నారు.
ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన సహాయ ప్యాకేజ్‌లలో భారీ ప్రాధాన్యత పొందిన రంగాలలో అగ్రి -ఫుడ్ విభాగం కీలకమైనదని బాదల్ అన్నారు. దేశంలో విదేశీ పెట్టుబడదులు , దేశీయ పెట్టుబడులను ఆకర్షించడానికి, వాటికి మద్దతు నివ్వడానికి కార్యదర్శుల సాధికారతా గ్రూప్ (ఇజిఒఎస్), మంత్రిత్వశాఖలు, విభాగాలలో ప్రాజెక్టు డవలప్‌మెంట్ సెల్ (పిడిసి)లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి ఈ సమావేశంలో పాల్గొన్న వారికి మంత్రి తెలిపారు. అన్ని పెట్టుబడులకు సంబంధించిన ప్రయోజనాలకు ఒక పద్ధతి ప్రకారం మద్దతునిచ్చేందుకు ఇన్వెస్ట్ ఇండియాలో గల ఫుడ్ ప్రాససెంగి్ ఇండస్ట్రీ మంత్రిత్వశాఖకు చెందిన ప్రత్యేక పెట్టుబడుల సహాయాతా కేంద్రం గురించి మంత్రి వివరించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు విద్యుత్ రేట్లను తగ్గించాల్సిందిగా కేంద్ర మంత్రి, రాష్ట్రాలను కోరారు. ప్రత్యేకించి కొల్డ్ చెయిన్ యూనిట్లకు వ్యవసాయరంగ రేట్లతో సమానంగా ఉండేలా చూడాలని కోరారు. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకు కేంద్ర ప్రభుత్వంతొ కలసి రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని, కొత్త శక్తిని సంతరించుకోవాలని మంత్రి అన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ సహాయమంత్రి శ్రీ రామేశ్వర్ తెలి, ఈ సమావేశంలో పాల్గొన్నవారంతా. ఇన్వెస్ట్‌మెంట్ ఫోరంలో చేరినందుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి నానాటికీ పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు, ఇన్వెస్టర్లందరికి సంబంధించి బలమైన చర్యలు తీసుకుంటున్నాయని ఆయన అన్నారు.
భారతదేశాన్ని తదుపరి అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చేందుకు, పెట్టుబడుల నిర్ణయాలకు సంబంధించి విధానపరమైన చర్యలు, పారిశ్రామిక జొన్లు, మౌలిక సదుపాయాల సామర్ధ్యం,ప్రత్యేక ఇన్వెస్టర్ సదుపాయ సేవలు వంటి వాటి విషయంలో కీలక అంశాలను ఈ ఫోరం సమావేశంలో చర్చించారు.
****
(Release ID: 1634627)
Visitor Counter : 221