రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

ఇప్పుడిక‌ తేలికపాటి, మధ్యస్థ వ‌ర్ణాంధత్వం ఉన్న పౌరుల‌కూ‌ డ్రైవింగ్ లైసెన్స్


Posted On: 26 JUN 2020 3:16PM by PIB Hyderabad

తేలికపాటి నుండి మధ్యస్థంగా వ‌ర్ణాంధ‌త్వం ఉన్న పౌరుల‌కు కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసు‌కుంది. ఈ త‌ర‌హా వ‌ర్ణాంధ‌త్వం క‌లిగిన‌ వారికి డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేసేందుకు వీలు క‌ల్పించేలా సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనలు- 1989 లోని ఫార‌మ్‌- 1 మరియు ఫార‌మ్‌- 1A కు సవరణ నిమిత్తం రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీనికి సంబంధించి మంత్రిత్వ శాఖ

24 జూన్ 2020న జీఎస్ఆర్ 401 (ఈ) ను మంత్రిత్వ శాఖ సామాజిక మ‌రియు  సౌకర్యవంతపు రెగ్యూలేష‌న్‌ను ప్ర‌చురించింది. దివ్యాంగులైన పౌరులు రవాణా సంబంధిత సేవలు పొందటానికి మరియు ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందేలా అనుమతించడానికి మంత్రిత్వశాఖ అనేక చర్యల‌ను చేప‌డుతోంది. దివ్యంగులైన‌ ‌వారికి డ్రైవింగ్ లైసెన్స్‌ను సులభతరం చేయడానికి సంబంధించి అడ్వైజ‌రీలు జారీ చేయ‌డ‌మైంది. దీనికి తోడు ఏక‌కంటి చూపు (మోనోక్యులర్ విజ‌న్‌) ఉన్న వారికి సంబంధించి ఇప్ప‌టికే అడ్వైజ‌రీ జారీ చేయ‌బ‌డింది. శారీరక దృఢ‌త్వం (ఫార‌మ్‌- I) లేదా మెడికల్ సర్టిఫికేట్ (ఫార‌మ్ IA) గురించి డిక్లరేషన్‌ల‌లోని

నిబంధ‌ల మేర‌కు కలర్ బ్లైండ్‌నెస్ (వ‌ర్ణాంధ‌త్వం) గ‌ల పౌరులు వాహ‌న డ్రైవింగ్ లైసెన్స్‌లు పొంద‌లేకుండా ఉన్నారంటూ మంత్రిత్వ శాఖకు వివిధ వ‌ర్గాల వారి నుంచి ప్రాతినిధ్యాలు అందాయి.ఈ నేప‌థ్యంలో స‌ర్కారు స‌ద‌రు సమస్యను మెడికల్ ఎక్స్‌పర్ట్ ఇనిస్టిట్యూషన్ దృష్టికి తీసుకొని వెళ్లి సలహాలు తీసుకున్నారు.

తేలికపాటి నుండి మధ్యస్థంగా వ‌ర్ణాంధ‌త్వం ఉన్న‌వారు.. వాహ‌నాలను న‌డిపేలా వెసులుబాటు క‌లిగించ‌వ‌చ్చ‌ని తీవ్ర‌మైన క‌ల‌ర్ బ్లైండ్‌నెస్ క‌లిగిన వారు మాత్ర‌మే డ్రైవింగ్ చేయకుండా ఆంక్ష‌లు విధించ‌వ‌చ్చ‌ని మెడికల్ ఎక్స్‌పర్ట్ ఇనిస్టిట్యూషన్ నుంచి అందింది. ప్రపంచంలోని ప‌లు ఇతర ప్రాంతాలలో కూడా ఈ విధానం  అనుమతించబడుతోంది. ఈ విష‌య‌మై అభిప్రాయాలు మరియు సలహాలను కోరేందుకు గాను స‌ర్కారు ముసాయిదా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.

 

******


(Release ID: 1634582) Visitor Counter : 260