రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారత నౌకాదళంలోకి దేశీయంగా అభివృద్ధి చేసిన "టోర్పెడో డెకాయ్‌ సిస్టమ్‌"


Posted On: 26 JUN 2020 1:53PM by PIB Hyderabad

 

భారత నౌకదాళంలోకి మరో శక్తిమంతమైన వ్యవస్థ వచ్చి చేరింది. దేశీయంగా అభివృద్ధి చేసిన అధునాతన "టోర్పెడో డెకాయ్‌ సిస్టమ్‌" ‍(శత్రుదేశ టోర్పెడోలను ఏమార్చే వ్యవస్థ) "మారీచ్‌" నావికాదళానికి అందింది. దీనిని ఏ యుద్ధనౌక నుంచైనా ప్రయోగించవచ్చు. దీని డిజైన్‌, అభివృద్ధిని డీఆర్‌డీవో ప్రయోగశాలలు (ఎన్‌ఎస్‌టీఎల్‌, ఎన్‌పీఓఎల్‌) చూసుకున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ ఎలక్ర్టానిక్స్‌ లిమిటెడ్‌లో ఈ యాంటీ డోర్పెడోలు తయారవుతాయి. ఇప్పటికే దీని నమూనాను అనేకసార్లు విజయవంతంగా పరీక్షించారు. నావికాదళ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యవస్థను రూపొందించారు.

అధునాత రక్షణ సాంకేతికతలో దేశీయ అభివృద్ధికి.. స్వదేశీ యాంటీ-టోర్పెడో వ్యవస్థ ప్రత్యక్ష నిదర్శనం. 'మేక్ ఇన్ ఇండియా' పిలుపునకు, సాంకేతిక పరిజ్ఞానంలో 'ఆత్మనిర్భర్' (స్వయంసమృద్ధి) సాధించాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి కూడా ఇది కూడా ఉత్ప్రేరకంగా మారింది.

*****


(Release ID: 1634488) Visitor Counter : 310