రక్షణ మంత్రిత్వ శాఖ
ఆపరేషన్ సముద్ర సేతు కింద ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ఓడ రేవు వద్ద ఐ.ఎన్.ఎస్.జలాశ్వ నౌక లోకి ఎక్కిన భారత జాతీయులు
Posted On:
26 JUN 2020 11:38AM by PIB Hyderabad
భారత నౌకాదళానికి చెందిన సముద్ర సేతు ఆపరేషన్ లో భాగంగా మరొక మిషన్ కోసం, ఐ.ఎన్.ఎస్ జలాశ్వ నౌక, 2020 జూన్ 24వ తేదీ సాయంత్రం ఇరాన్ లోని బందర్ అబ్బాస్ చేరుకుని, 2020 జూన్ 25వ తేదీన నౌకాశ్రయంలోకి ప్రవేశించింది. తప్పనిసరి వైద్య మరియు సామాను పరీక్షల అనంతరం 687 మంది భారతీయ పౌరులు ఈ ఓడలోకి ప్రవేశించారు.
ఇరాన్ కు వచ్చే ముందు, ఐ.ఎన్.ఎస్. జలాశ్వ సిబ్బంది, ప్రవాస భారతీయుల తరలింపు ఆపరేషన్ కోసం సన్నాహక కార్యకలాపాలను చేపట్టింది. ఇందులో శానిటైజేషన్ మరియు తరలింపుదారులకు సౌకర్యవంతమైన ప్రదేశాల తయారీ, మాస్కులు, పారిశుధ్య సామగ్రితో కూడిన స్వాగత కిట్‌ల తయారీతో పాటు, టెహ్రాన్ లోని భారతీయ రాయబార కార్యాలయం సూచనలకు అనుగుణంగా ప్రయాణీకులకు బంకుల కేటాయింపు వంటి చర్యలను కూడా సిబ్బంది పూర్తిచేశారు.
భారత నావికాదళం దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు విమాన తరలింపు పాడ్లను ఈ నౌక ఇరాన్ అధికారులకు అందజేసింది.
కోవిడ్-19 జాగ్రత్తలకు కట్టుబడి, జలాశ్వ బోర్డులో ప్రయాణీకులు నివసించే స్థలాలను మూడు జోన్లుగా విభజించారు. మరియు వారిని తరచుగా కలిసే ఓడ సిబ్బందికి ప్రత్యేకంగా జోన్లను కేటాయించారు.
ఓడలోకి ప్రయాణీకులందరూ ఎక్కే ప్రక్రియ పూర్తి కాగానే 2020 జూన్ 25వ తేదీ సాయంత్రం బందర్ అబ్బాస్ నుండి ఓడ బయలుదేరింది.
*****
(Release ID: 1634471)
Visitor Counter : 245