గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పట్టణ మిషన్ల 5 వ వార్షికోత్సవం


ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) (పీఎంఏవై-యు), స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్సిఎం) మరియు అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్)

47 ఆపరేషనల్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్, కమాండ్ సెంటర్లు (ఐసిసిసి) వార్-రూమ్స్ గా మారాయి, కొవిడ్ పై పోరాటంలో
సమర్థవంతమైన పాత్ర పోషించాయి

ప్రగతి పథంలో స్మార్ట్ రోడ్లు, స్మార్ట్ సోలార్, స్మార్ట్ వాటర్, పిపిపిలు, వైబ్రంట్ పబ్లిక్ స్పేసెస్ ప్రాజెక్టులు

అమృత్ కింద - నాలుగు సంవత్సరాల్లో 54 మైలురాళ్లతో కూడిన 11 సంస్కరణలు అమలు - సమర్థవంతమైన పాలన, పౌర సేవా పంపిణీ కోసం నగర స్థాయి సంస్థల సామర్థ్యాలను బలోపేతం చేయడం దీని లక్ష్యం

మునుపటి పట్టణ గృహనిర్మాణ పథకాల కింద మంజూరు చేసిన గృహాల కంటే పిఎంఎవై (పట్టణ) కింద మంజూరు చేసిన ఇళ్ళు దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువ

పిఎంఎవై (యు) కింద నిర్మాణ కార్యకలాపాల పనులకు అన్ని కోణాలలోను పౌరులను అనుసంధానం చేయడం ద్వారా సుమారు 1.65 కోట్ల మందికి ఉపాధి కల్పన; ఉపాధితో పాటు గుణక ప్రభావం

Posted On: 25 JUN 2020 4:50PM by PIB Hyderabad

భారతదేశం ప్రపంచ చరిత్రలోనే అత్యంత సమగ్రమైన ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ కార్యక్రమాలలో ఒకటి చేపట్టింది. మన గౌరవ ప్రధానమంత్రి నవభారత దార్శనికత మా ప్రధాన కార్యక్రమ విజయాలతో ముడిపడి ఉంది. మే 12, 2020 న, గౌరవ ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌ను ప్రారంభించారు, ఇది రైతులకు ఉపశమనం, సహాయం అందించడంపై దృష్టి పెట్టింది. కుటీర పరిశ్రమలు, గృహ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఇలు - లాక్ డౌన్ చర్యల ద్వారా ప్రతికూలంగా ప్రభావితమైన కోట్లాది మందికి ఇవి జీవనోపాధి సాధనాలు అని  గృహ, పట్టణ వ్యవహారాల శాఖ (ఇంచార్జి) సహాయ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పట్టణ) 5 వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఒక వెబి‌నార్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఎంఓహెచ్ యుఏ  కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా సమక్షంలో పీఎంఏవై-యు, స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్సిఎం), అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్). గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పట్టణ కార్యకలాపాల అమలును పెంచడానికి ఆన్‌లైన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల సంయుక్త కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వ, యుటిల ముఖ్య కార్యదర్శులు (పట్టణాభివృద్ధి), రాష్ట్ర మిషన్ డైరెక్టర్లు, మునిసిపల్ కమిషనర్లు / స్మార్ట్ సిటీల సిఇఓలు, భాగస్వామి ఏజెన్సీల ప్రతినిధులు / ద్వైపాక్షిక / బహుళ పక్ష సంస్థలు మరియు ఇతర ముఖ్య వాటాదారులు పాల్గొన్నారు.

 

ఈ వెబినార్ లో కొన్ని కీలక అంశాలపై చర్చించారు.

 • మిషన్లు, మంత్రిత్వ శాఖ ప్రగతిని, విజయాలను తెలిపే ఈ-బుక్ సిద్ధం చేస్తారు.
 • పట్టణాభివృద్ధి కార్యక్రమాలతో సంబంధించిన వారికి అవసరమైన వివరాలు అందుబాటులో ఉండేలా నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఐయుఎ) వెబ్ సైట్ పునరుద్ధరణ చేస్తారు.
 • పట్టణ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రభావవంతమైన కార్యనిర్వహణ పద్ధతులకు ఉపకరించేలా జాతీయ అర్బన్ లెర్నింగ్ వేదికను డిజిటల్ నైపుణ్యాలతో అందుబాటులో ఉంచుతారు.
 • వాతావరణ మార్పులపై వివిధ నగరాలలో అనుభవాలను అధ్యయనం చేసి వ్యవస్థీకృత విధానాలు అమలు చేయడానికి ఎన్ఐయుఎ (సి3) ఏర్పాటయింది.
 • అన్ని రాష్ట్రాల్లోని నగరాల్లో డిజిటల్ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి డిజిటిల్ గవెర్నెన్స్ కేంద్రం పని చేస్తుంది. అమృత్, పీఎంఎవై-యు తదితర కార్యక్రమాలను వీడియో, ఈ-బుక్ రూపంలో అందుబాటులోకి తెచ్చారు.
 • కోవిడ్-19 విషయంలో కూడా తమ పరిథిలో ఉన్న వివిధ విభాగాలు చేస్తున్న కృషి, నిర్వహణ పై కూడా పుస్తకాల ప్రచురణ, నివేదికలపై కూడా సమీక్షించారు.

 

అమృత్, ఎస్సిఎం, పీఎంఎవై-యు లో అనేక విజయాలను సాధించారు.

 

  అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) ని గౌరవ ప్రధానమంత్రి 2015 జూన్ 25న ప్రారంభించారు. ఈ ఐదేళ్లలో ఈ మిషన్ 500 నగరాలలో 60% జనాభాకు వర్తించేలా అనేక కార్యక్రమాలు చేపట్టింది. మంచి నీటి సరఫరా, మరుగునీటి నిర్వహణ, వరదనీటి కాలువలు, పట్టణాల్లో పార్కులు తదితర అనేక అంశాల్లో విశేషమైన ప్రగతి సాధించింది అమృత్.

 • రూ. 77,640 కోట్ల రాష్ట్ర వార్షిక ప్రణాళికలకు ఆమోదం తెలపగా ఇప్పటి వరకు రూ.75,829 కోట్ల ప్రాజెక్టులు అమలులోకి వచ్చాయి.
 • రూ. 10,654 కోట్లు ఇప్పటికే ఖర్చు కాగా, రూ.65,175 కోట్ల పనులు పూర్తి కాగా, మిగిలినవి చాలా వరకు పూర్తయ్యే స్థితికి వస్తున్నాయి.
 • తాగు నీటి సరఫరా ప్రాజెక్టులు రూ.39,011 కోట్లు, మురుగునీరు, ప్రాజెక్టులు కింద రూ.32,546 కోట్లు కేటాయించారు. 1.39 కోట్ల గృహాలకు నీటి సరఫరా, 1.45 కోట్ల గృహాలకు మురుగునీటి సౌకర్యాలు సమకూరుస్తోంది.
 • మురికివాడలు, తక్కువ ఆదాయ వర్గాల ప్రాంతాలతో కలిపి వివిధ ప్రాంతాల్లో 79 లక్షల కొళాయి కనెక్షన్లు, 45 లక్షల మురుగునీటి సౌకర్యాలు అమృత్ ద్వారా కలిగాయి.
 • పౌరులకు సేవలు అందించే వివిధ ప్రాజెక్టులు, పాలనా వ్యవస్థల బలోపేతానికి 11 రకాల సంస్కరణలు అమృత్ సహకారంతో అమలు జరుగుతున్నాయి.
 • 76 లక్షల వీధి దీపాలను విద్యుత్ పొదుపు దిశగా ఎల్ఈడి దీపాలుగా మార్చారు. అలాగే పట్టణాలు, నగరాల్లో బిల్డింగ్ ప్లాన్ల ఆమోదానికి కాల వ్యవధి తగ్గేలా డిజిటల్ వ్యవస్థ ఆన్ లైన్ భవన నిర్మాణ అనుమతి వ్యవస్థ (ఓబిపిఎస్)ని అమృత్ ద్వారా అమలులోకి తెచ్చారు.
 • ఈ ప్రయత్నం  ప్రపంచ బ్యాంకు వాణిజ్య నిర్వహణ నివేదిక 2020 లో భారత్ 27వ స్థానాన్ని సాధించడానికి దోహదపడింది.
 • మిషన్ అమలులో ఉన్న 500 నగరాలకు గాను 469 నగరాల్లో క్రెడిట్ రేటింగ్ ప్రక్రియను నిర్వహించగా, 163 నగరాలు పెట్టుబడులకు అవకాశం ఉన్న గ్రేడ్ కింద గుర్తించారు.
 • 2019-20లో 8 నగరాలు మూలధన పెట్టుబడి కింద ప్రోజెక్టులు చేపట్టడానికి రూ.3,390 కోట్ల మునిసిపల్ బాండ్లు తీసుకురావడం జరిగింది.
 • మిషన్ కింద 53,000 మంది వివిధ స్థాయి ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు.

 

స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్సిఎం)

 

స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్సిఎం) ని 2015 జూన్ 25న ప్రారంభించారు. పరిశుభ్రమైన, సుస్థిర వాతావరణం పెంపొందించే స్మార్ట్ పరిష్కారాలను అందించి పౌరుల జీవన ప్రమాణాలు గుణాత్మకంగా మెరుగుపడేల చేయడానికి మౌలిక సౌకర్యాలను సమకూర్చడమే ఈ మిషన్ ఉద్దేశం. ఇప్పటి వరకు రూ.1,66,000 కోట్ల టెండర్లు వివిధ పనులకు ఆహ్వానించగా, రూ.1.25,000 కోట్ల పనులకు వర్క్ ఆర్డర్లు మంజూరు చేయడం జరిగింది. సుమారు రూ.27,000 కోట్ల ప్రాజెక్టులు ఇప్పటికే ఈ మిషన్ కింద పూర్తయ్యాయి.

 • రూ.32,500 కోట్ల అదనపు 1000 ప్రాజెక్టులు టెండర్ చేసారు. గత ఏడాదిలో పూర్తయిన ప్రాజెక్టులో 180% వృద్ధి ఉంది.
 • దీని విలువ సుమారు రూ. 12,100 కోట్లు ఉంటుంది.
 • ఈ మిషన్ కింద సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటు చేసి కోవిడ్ రూపుమాపే చర్యలు చేపట్టారు. 47 ఆపరేషనల్ వార్ రూమ్స్ లా పనిచేస్తున్నాయి.
 • పట్టణ బోధనా ఇంటర్న్ షిప్ కార్యక్రమాన్ని కూడా ఈ మిషన్ ద్వారా రూపకల్పన చేసారు.
 • పట్టణాలలో గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారికి ఇంటర్న్ షిప్ అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టారు.

 

ప్రధాన మంత్రి ఆవాస యోజన-పట్టణ (పీఎంఎవై-యు)

 

ప్రధాన మంత్రి ఆవాస యోజన-పట్టణ (పీఎంఎవై-యు) ఏర్పాటు చేసి సరిగ్గా నేటికీ 5 సంవత్సరాలు పూర్తయింది. 2022 కల్లా అందరికి నివాస గృహం లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హుడైన ప్రతి లబ్ధిదారునికి పక్కా ఇల్లు ఉండాలన్నది సంకల్పం. ఈ ప్రయత్నంలో అనేక మైలు రాళ్ళుదాటింది ఏ పథకం. 1.12 కోట్ల ఇళ్ల కోసం డిమాండ్ రాగా ఇప్పటికే 1.05 కోట్ల ఇళ్లకు మంజూరీలు ఇచ్చారు. వాటిలో 65 లక్షల ఇల్లు పూర్తిఅవ్వగా 35 లక్షల ఇల్లు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. నిధులు నిత్యం అందుబాటులో ఉండేలా రూ.60,000 కోట్లతో నేషనల్ అర్బన్ హోసింగ్ ఫండ్ ను అదనపు బడ్జెట్ వనరులతో ఏర్పాటు చేసారు.

 • మొదటి సారిగా క్రెడిట్ లింక్ సబ్సిడీ పథకాన్ని(సిఎల్ఎస్ఎస్) ప్రవేశ పెట్టి మధ్య ఆదాయ తరగతి (ఎంఐజి) కి వారి గృహ అవసారానికి తగ్గట్టుగా లబ్ది చేకూర్చే కార్యక్రమం చేపట్టారు.
 • గ్లోబల్ హోసింగ్ టెక్నాలజీ కింద ప్రత్యామ్నాయ, సృజనాత్మకమైన సాంకేతికతలను అమలు చేస్తూ నిర్మాణంలో కొత్త పుంతలు తొక్కింది ఈ పథకం.
 • పర్యావరణ హితంగా, హరిత శోభిత సుస్థిర లక్ష్యంగా గృహ నిర్మాణాలకు ఈ పథకంలో శ్రీకారం చుట్టారు.
 • ఆత్మ నిర్భర భారత్ స్ఫూర్తికి అనుగుణంగా పట్టణ వలసదారులు, పేద వారి సులభతర నివాసానికి అవకాశం కల్పించే పథకాన్ని ఆర్ధిక మంత్రి ఇటీవల ప్రకటించారు.
 • ఇది ఆఫర్డ్బుల్ రెంటల్ హోసింగ్ కాంప్లెక్స్ లకు సంబంధించిన ఈ పథకం దిగువ స్థాయిలో ఉన్న అనేక మందికి లబ్ది కలిగిస్తుంది.
 • వీటి నిర్మాణ కార్యక్రమంతో గుణక లబ్ది చేకూరుస్తుంది. సుమారు 1.65 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. 

 

****(Release ID: 1634367) Visitor Counter : 220