విద్యుత్తు మంత్రిత్వ శాఖ

2019-20లో రూ.లక్ష కోట్లకు పైగా రుణాల‌ను మంజూరు చేసిన పీఎఫ్‌పీ

Posted On: 25 JUN 2020 4:33PM by PIB Hyderabad

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ్యాప్తి‌తో సహా వివిధ సవాళ్లు నెల‌కొని ఉన్న‌ప్ప‌టికీ కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ,  విద్యుత్ రంగంలో భారతదేశంలోనే ప్రముఖ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ అయిన ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) 2019-20 (ఏప్రిల్-మార్చి) ఆర్థిక సంవత్సరాన్ని బలమైన పనితీరును క‌న‌బ‌రిచింది. కేంద్ర‌ విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 68,000 కోట్ల రూపాయల రుణ పంపిణీతో పాటు.. రూ. లక్ష కోట్లకు పైగా రుణాల‌ను మంజూరు చేసింది. ఇది సంస్థ మెరుగైన ఆర్థిక పనితీరును

క‌నబ‌రుస్తోంది. కోవిడ్‌-19 వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు గాను దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నెల‌కొని ఉన్నప్పటికీ మార్చి 2020 చివరి వారంలో సంస్థ దాదాపు 11,000 కోట్ల రూపాయల రుణాల‌ను పంపిణీ చేయ‌డం విశేషం. ఉద్యోగులు ఇంటివ‌ద్ద నుంచి పనిచేస్తున్నప్పటికీ పీఎఫ్‌సీ బలమైన ఐటీ మౌలిక సదుపాయాల మద్దతుతో ఈ గణనీయమైన రుణ పంపిణీని నిర్వహించ‌గ‌లిగింది.

త‌గ్గిన నిర‌ర్థ‌క ఆస్తు‌లు మార్చితో ముగిసిన ఆర్థి‌క సంవ‌త్స‌రంలో సంస్థ  తన స్వతంత్ర ఆదాయంలో 16 శాతం వృద్ధిని నమోదు చేసింది. నిధుల వ్యయంలో 16 బీపీఎస్ తగ్గింపు చేపట్టిన నేప‌థ్యంలోనూ సంస్థ ఈ వృద్ధిని నిర్వ‌హించ‌డం విశేషం. సంస్థ నికర నిర‌ర్థ‌క ఆస్తులు (ఎన్‌పీఎ) 4.55 శాతం నుండి 3.8 శాతానికి తగ్గాయి. ఇది సంస్థ యొక్క బలమైన పని తీరును ప్రదర్శిస్తుంది. దీనికి తోడు సంస్థ కంపెనీ తన రుణ ఆస్తులలో 10 శాతం మేర‌ వృద్ధిని నమోదు చేసింది. నిధుల వ్యయంలో 16 శాతం మేర బీపీఎస్ తగ్గింపు మరియు వడ్డీ వ్యాప్తిలో 16 బీపీఎస్ పెరుగుదలతో త‌న ప‌నితీరును మ‌రింత‌గా మెరుగుప‌రుచుకుంది. ఇంకా, ఆర్థిక సంవత్సరంలో, పీఎఫ్‌సీ ఒత్తిడితో కూడిన రూ.2,700 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టుల్ని పరిష్కరించింది. ఇందులో ర‌త్తాన్న్ ఇండియా అమరావతి మ‌రియు జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి.

రుణ ఆస్తిలో 12 శాతం వృద్ధి సవాళ్ల‌తో కూడిన వాతావరణం ఉన్నప్పటికీ ఏడాది ప్రాతిప‌దిక‌న చూస్తే 2020 ఆర్ధిక సంవ‌త్స‌రానికి రూ.6788 కోట్ల‌కు చేరింది. అంత‌కు ముందు ఏడాది ఇదే స‌మ‌యంలో సంస్థ లాభం రూ.6,953 కోట్లుగా ఉంది. కార్పొరేట్ పన్ను రేటులో మార్పు కారణంగా డీటీఏ యొక్క ఏక‌-కాల ప‌న్ను ‌ప్రభావం మినహాయింపు లాభంపై కొంత మేర ప్ర‌భావాన్ని చూపింది. ఎఫ్‌వై 20 సంవ‌త్స‌ర‌పు ఆఖ‌రి 45 రోజులలో ఎక్జ్ఛేంజీ రేటులో 6 % వ్య‌త్యాసం కార‌ణంగా కూడా సంస్థ లాభం కొంత ప్రభావితమైంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో (కన్సాలిడేటెడ్ ప్రాతిపదిక) సంస్థ యొక్క ఆర్థిక ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి ఆదాయంలో 15 శాతం వృద్ధి. రుణ‌ ఆస్తిలో 12 శాతం మేర‌ వృద్ధి, నికర ఎన్‌పీఏలు 4.20% నుండి 3.57 శాతానికి తగ్గాయి.

*******


(Release ID: 1634331) Visitor Counter : 182