మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ 2020-21 సంవత్సరానికి ఎన్.‌సి.ఈ.ఆర్.‌టి. కోసం రోడ్ మ్యాప్‌ను విడుదల చేసింది

Posted On: 24 JUN 2020 5:12PM by PIB Hyderabad

ఆత్మ నిర్భర్ భారత్ ఆధ్వర్యంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ మిషన్‌ను ఏర్పాటు చేయాలనే నిర్ణయం దృష్ట్యా, మరియు అభ్యాస ఫలిత కేంద్రీకృత విధానం వైపు సమగ్ర దృష్టి కేంద్రీకరించిన దృష్ట్యా, ఎన్‌.సి.ఈ.ఆర్.‌టి.  వీటిని సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన వనరులను అభివృద్ధి చేయడం అవసరం. ఇవి, సమయానుసారంగా, అభ్యాస ఫలితాలలో మరియు విద్యార్థుల అభ్యాస స్థాయిలలో మెరుగుదలకు దారితీస్తాయి.   ఈ ప్రాతిపదికన 2020-21 విద్యాసంవత్సరంలో ప్రాధాన్యతా క్రమంలో ఈ కింది పనులను చేపట్టాలని   ఎన్.‌సి.ఇ.ఆర్.‌టి.ని మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన  డి.ఓ.ఎస్.ఈ.ఎల్. ఆదేశించింది.

అభ్యాస ఫలితాలు (లెర్నింగ్ అవుట్ కమ్స్ - ఎల్.ఓ)

ఎన్.‌సి.ఈ.ఆర్.‌టి.  తయారుచేసిన 1 నుండి 10వ తరగతి వరకు అభ్యాస ఫలితాల అమలు కోసం:

i)  ప్రతి అభ్యాస ఫలితాలను వివరించే ఇన్ఫోగ్రాఫిక్స్ / పోస్టర్లు / ప్రెజెంటేషన్లు, ప్రతి సబ్జెక్టుకు మరియు ప్రతి గ్రేడుకు 1 నుండి 5వ తరగతి వరకు 2020 అక్టోబర్ నాటికి పూర్తి కావాలి; అదేవిధంగా 6 నుండి 12వ తరగతి వరకు 2021 మార్చి నాటికి పూర్తి కావాలి.

ii)  ప్రతి గ్రేడ్ ఉపాధ్యాయులకు ఆన్ ‌లైన్ ఉపాధ్యాయ శిక్షణా కోర్సులు, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 2020 డిసెంబర్ నాటికి దశల వారీగా పూర్తి కావాలి, అదేవిధంగా, 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు 2022 జూన్ నాటికి దశల వారీగా పూర్తి కావాలి,

iii) కోవిడ్-19 సమయంలో, ముఖ్యంగా ఎలాంటి డిజిటల్ / ఆన్‌లైన్ అవకాశం లేని అభ్యాసకుల కోసం మొత్తం పాఠ్యాంశాల అనుబంధ / ప్రత్యామ్నాయ విద్యా అధ్యయన సామగ్రి ని సిద్ధం చేయాలి. 1 నుండి 5వ తరగతి వరకు దశల వారీగా 2020 డిసెంబర్ నాటికీ, అదేవిధంగా, 6 నుండి 12వ తరగతి వరకు దశలవారీగా 2021 జూన్ నాటికీ సిద్ధం చేయాలి.

iv)  ప్రతి గ్రేడ్‌లో,  ప్రతి సబ్జెక్టులో, ప్రతి అధ్యయన ఫలితాన్నీ, కనీసం రెండు స్థాయిల్లో నైపుణ్యం లెక్క కట్టడానికి,  కనీసం 10 అంశాలు / ప్రశ్నలు తయారుచేయాలి. 1 నుండి 5వ తరగతి వరకు 2020 నవంబర్ నాటికీ, అదేవిధంగా, మిగిలిన తరగతులకు 2021 మార్చి నాటికీ తయారుచేయాలి.

v)  ఎన్.ఏ.ఎస్., 2017 ఆధారంగా, ఎన్.సి.ఈ.ఆర్.టి., హార్డ్ స్పాట్‌లను గుర్తించింది. ఈ హార్డ్ స్పాట్ లకు అవసరమైన విద్యా అధ్యయన సామాగ్రిని తయారుచేయాలి. 1 నుండి 5వ తరగతి వరకు 2020 డిసెంబర్ నాటికీ, అదేవిధంగా, మిగిలిన తరగతులకు 2021 మార్చి నాటికీ తయారుచేయాలి.

నూతన జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్ (ఎన్.సి.ఎఫ్) :

పాఠశాల విద్య కోసం నూతన జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్ వర్క్ (ఎన్.‌సి.ఎఫ్) కూడా ప్రారంభించబడింది.  నూతన ఎన్‌సిఎఫ్‌కు అనుగుణంగా ఎన్.‌సి.ఈ.ఆర్.‌టి. పాఠ్యపుస్తకాల్లో తగిన మార్పులు చేస్తుందని భావిస్తున్నారు.  విషయ నిపుణులు పాఠశాల విద్య కోసం ఈ ప్రక్రియను ప్రారంభించి, 2020 డిసెంబర్ నాటికి మధ్యంతర నివేదికను సమర్పిస్తారు.

పాఠ్యపుస్తకాలను తిరిగి రూపకల్పన చేస్తున్నప్పుడు, పాఠ్యపుస్తకాల్లో ప్రధాన పాఠ్యాంశం మినహా ఇంకేమీ ఉండకుండా చూడాలి.   అలాగే, పాఠ్య పుస్తకాల వల్ల మేధస్సుపై చాలా ఎక్కువ భారం పడుతోంది.  సృజనాత్మక ఆలోచన, జీవిత నైపుణ్యాలు, భారతీయ నీతి, కళ మరియు సమైక్యత వంటి అదనపు రంగాలను ఏకీకృతం చేయాలి.  ఎన్.‌సి.ఈ.ఆర్.‌టి. కూడా కొత్త పాఠ్య పుస్తకాల లేఅవుట్ మరియు రూపకల్పనపై ముందుగానే పనిచేయడం ప్రారంభిస్తుంది, అయినప్పటికీ, నూతన ఎన్.‌సి.ఎఫ్. ఆధారంగానే  కొత్త పాఠ్య పుస్తకాలు వ్రాయబడతాయి.  2021 మార్చి నాటికి కొత్త ఎన్.‌సి.ఎఫ్. సిద్ధమౌతుందని భావిస్తున్నారు.

ఆత్మ నిర్భర్ భారత్ కింద, పి.ఎమ్. ఈ-విద్యా కోసం, ఎన్.‌సి.ఈ.ఆర్.‌టి. కూడా స్వయంప్రభా ఛానెల్స్ ( ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క ఛానెల్) కోసం 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు పాఠ్యాంశాలను సిద్ధం చేసి, ఈ ఏడాది ఆగస్టు నాటికి ఛానెళ్లను ప్రారంభిస్తుందని భావిస్తున్నారు.

 

*****



(Release ID: 1634148) Visitor Counter : 245