ఆర్థిక మంత్రిత్వ శాఖ

తురంత్ కస్టమ్స్ కింద సిబిఐసి ఎండ్ టు ఎండ్ కాగితారహిత ఎగుమతుల ప్రారంభం

Posted On: 23 JUN 2020 11:48AM by PIB Hyderabad

పరోక్ష పన్నుల కేంద్ర బోర్డు, కస్టమ్స్ (సిబిఐసి) చైర్మన్ శ్రీ అజిత్ కుమార్ నిన్న ఇక్కడ సురక్షితమైన క్యూఆర్ కోడెడ్ షిప్పింగ్ బిల్లును ఆవిష్కరించారు, దీని ద్వారా ఎగుమతిని  కస్టమ్స్ అనుమతించిన తరువాత ఎగుమతిదారులకు ఎలక్ట్రానిక్ పద్దతిలో షిప్పింగ్ బిల్లు పంపిస్తారు. ఎగుమతికి రుజువు కోసం ఎగుమతిదారులు కస్టమ్స్ అధికారులను సంప్రదించవలసిన అవసరాన్ని ఈ ఒక్క చర్య తొలగిస్తుంది. ఇది షిప్పింగ్ బిల్లును దాఖలు చేయడం నుండి ఎగుమతిని అనుమతించే తుది ఉత్తర్వు వరకు కస్టమ్స్ ఎగుమతి ప్రక్రియను పూర్తిగా ఎలక్ట్రానిక్ చేస్తుంది. 

భౌతికంగా ప్రమేయం లేకుండా, కాగితరహితంగా కస్టమ్స్‌ తన “తురంత్ కస్టమ్స్” కార్యక్రమం అనే ఒక గొడుగు కిందకు తెచ్చి తన నిబద్ధతను నెరవేర్చడానికి సిబిఐసి తీసుకున్న ఓ చొరవ. ఈ సంస్కరణలు దిగుమతిదారులుఎగుమతిదారులు, ఇతర వాటాదారులకు సమయం,  ఖర్చులను తగ్గించడానికి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం మెరుగైన ఉపయోగం మీద ఆధారపడి ఉంటాయి, తద్వారా ప్రపంచ బ్యాంకు ట్రేడింగ్ అక్రోస్ బోర్డర్స్ పారామితిలో దాని ర్యాంకింగ్ బిజినెస్ రిపోర్ట్  భారతదేశ ర్యాంకింగ్‌ను మెరుగుపరుస్తుంది.

ఎగుమతులపై కాగితరహిత డాక్యుమెంటేషన్ ప్రారంభించడం, 2020 ఏప్రిల్ 15వ తేదీన  దిగుమతుల కోసం ప్రారంభించిన ఇదే విధమైన చొరవకు కొనసాగింపు . షిప్పింగ్ బిల్లు ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ఈ పత్రాల పేపర్ ప్రింటౌట్ తీసుకోవటానికి ప్రస్తుత అవసరాన్ని తొలగించి తద్వారా గ్రీన్ కస్టమ్స్ ను ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ఎగుమతిదారులు ఈ ప్రయోజనం కోసం కస్టమ్స్ హౌస్‌లను సందర్శించాల్సిన అవసరం లేదు. దానికి బదులు వారి వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి వారి సమయాన్ని బాగా ఉపయోగించుకోవచ్చు.

కస్టమ్స్ క్లియరెన్స్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే ఈ ప్రయత్నమని శ్రీ అజిత్ కుమార్ తెలిపారు. మనిషి ఎదురుగా ఉండే పనిలేకుండా, విలక్షణంగా సిద్ధం అయిన తురంత్ కస్టమ్స్ 2021 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా దశలవారీగా అమలు లోకి వస్తుంది. 

 

*****(Release ID: 1633682) Visitor Counter : 51