వ్యవసాయ మంత్రిత్వ శాఖ

పీచుతీసిన ముదురు కొబ్బరికాయకు కనీస మద్దతు ధరను ప్రకటించిన ప్రభుత్వం


లక్షలాది మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా 2020 సీజన్‌కు 5 శాతానికి పైగా పెరుగుదల

అన్ని రకాల పంటలను పండించే రైతుల ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇచ్చింది - కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

Posted On: 23 JUN 2020 11:38AM by PIB Hyderabad

పీచు తీసిన ముదురు కొబ్బరికాయ  2020 సీజన్ కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2019లో ధర రూ.2,571/- ని ఇప్పుడు రూ.2,700/-కి ఆంటే 5.02% పెంచింది. 

 

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని రకాల పంటలను పండించే రైతుల ప్రయోజనాలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చిందని అన్నారు. పీచుతీసిన ముదురు కొబ్బరికాయ కోసం ఎంఎస్పి పెంపు తాజా కొబ్బరికాయను సేకరించడానికి దోహదపడుతుంది, తద్వారా ఎంఎస్పి ప్రయోజనం లక్షలాది మంది చిన్నకమతం కొబ్బరి రైతులకు చేరుతుంది అని ఆయన తెలిపారు. 

కొబ్బరి ఒక చిన్న కమతం పంట కావడం వల్ల కుప్పపోసి, రాశులుగా చేసి కొబ్బరి కొట్టే సౌకర్యం, రైతు స్థాయిలో కొప్రా తయారీ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం సర్వసాధారణం కాదని శ్రీ తోమర్ అన్నారు. కొబ్బరి కురిడీ  కోసం ఎంఎస్‌పి 2020 పంట సీజన్‌కు క్వింటాల్‌కు రూ. 9960 / - అయినప్పటికీ కొబ్బరికాయ కోసం అధిక ఎంఎస్‌పిని ప్రకటించడం వల్ల చిన్న రైతులకు తక్షణ నగదు లభిస్తుంది. ఇప్పటికే మహమ్మారి పర్యవసానంగా సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడి, బాధల్లో ఉన్న కొబ్బరి రైతులకు  ఉపశమనం కలిగిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.  

***


(Release ID: 1633621) Visitor Counter : 253