రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

నిర్మాణ సామగ్రి వాహనాలు, ట్రాక్టర్లు, పంట కోత వాహనాల బీఎస్-4 ఉద్గార నిబంధనలు వాయిదా వేసేందుకు మోటారు వాహన నిబంధనలు సవరించడానికి సూచనలకు ఆహ్వానం

Posted On: 23 JUN 2020 12:28PM by PIB Hyderabad

నిర్మాణ సామగ్రి వాహనాలు, ట్రాక్టర్లు, పంట కోత వాహనాల బీఎస్-4 ఉద్గార నిబంధనలను వాయిదా వేసే సవరణపై 
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ సలహాలు, సూచనలు ఆహ్వానించింది. సంబంధిత వర్గాలు సహా ప్రజలందరి నుంచి వీటిని కోరింది. బీఎస్-4 ఉద్గార నిబంధనలను వాయిదా వేసేందుకు మోటారు వాహన ముసాయిదా నిబంధనలలోని ప్రతిపాదిత సవరణపై సలహాలను ఆహ్వానించింది. దీనిపై ఈనెల 19వ తేదీన నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ను www.morth.gov.in లో చూడవచ్చు.

    వ్యవసాయ మంత్రిత్వ శాఖ, నిర్మాణ రంగం నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ముసాయిదా నోటిఫికేషన్ జీఎస్‌ఆర్‌ 393(ఇ) ని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. లెక్క ప్రకారం, ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచే ఉద్గార నిబంధనల తర్వాతి దశను అమలు చేయాలి. కొవిడ్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని... నిర్మాణ సామగ్రి వాహనాలు, ట్రాక్టర్లు, పంట కోత వాహనాలకు, ఈ గడువును ఈ ఏడాది అక్టోబర్‌ 1 నుంచి వచ్చే ఏడాది అక్టోబర్‌ 1 వరకు పెంచడానికి సూచనలు, సలహాలను మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది.

    సంబంధిత వర్గాలు, ప్రజలు తమ సలహాలు, సూచనలను.. "జాయింట్‌ సెక్రటరీ (ఎంవీఎల్‌), మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌, ట్రాన్స్‌పోర్ట్ భవన్‌, పార్లమెంట్‌ స్ట్రీట్‌, న్యూదిల్లీ-110001" అడ్రస్‌కు పంపాలి. ఈమెయిల్‌ ద్వారా పంపాలనుకునేవారు 
jspb-morth[at]gov[dot]in కు సలహాలు పంపాలి. వచ్చేనెల 18వ తేదీ వరకు సలహాలు, సూచనలు పంపేందుకు గడువుంది.

 

 

*******
 


(Release ID: 1633586) Visitor Counter : 191