ఆయుష్
అంతర్జాతీయయోగాదినోత్సవం (IDY-2020) పలువురుబాలీవుడ్ ప్రముఖ తారల మద్దతు
Posted On:
20 JUN 2020 4:50PM by PIB Hyderabad
అంతర్జాతీయ యోగాదినోత్సవం వచ్చేసింది. అయితే, కోవిడ్-19 వైరస్ మహమ్మారి నియత్రణ కోసం దేశం పోరాటం సాగిస్తున్న నేపథ్యంలో,.యోగాదినోత్సవం సన్నాహక కార్యకలాపాలు మునుపటిలా, వేగం పుంజుకో కుండా వేలవంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జనం సమూహాలుగా గుమికూడటంపై నిషేధం కొనసాగుతున్నందున ఈ పరిస్థితి ఏర్పడింది. ‘ఇంటి వద్దనే యోగా, కుటుంబంతో కలసి యోగా’అన్న భావనను కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఇపుడు ప్రోత్సహిస్తోంది. ఆరవ అంతర్జాతీయ యోగాదినోత్సవం (2020) ఇళ్ల వద్దనే కుటుంబాలతో కలసి జరుపుకోవాలని ఆయుష్ పిలుపునిస్తోంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం (2020)లో భాగస్వామ్యం వహించడానికి లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే సిద్ధమైపోయారు. యోగా నిర్వహణతో ప్రజల్లో సామరస్యం సాధించాలన్నది ఆయుష్ మంత్రిత్వశాఖ నిర్ధేశించుకున్న లక్ష్యాల్లో ఒకటి. ప్రమాణీకరించిన యోగా నిబంధనల ప్రాతిపదికన భాగస్వాములంతా తమ ఇళ్ల వద్దనే జూన్ 21న ఉదయం ఏడు గంటలకు యోగాసనాలు ఆచరించడం ద్వారా ఈలక్ష్యాన్ని సాధించనున్నారు. సామరస్యపూరిత యోగాసాధన కోసం ఒకశిక్షకుడి సారథ్యంలో యోగాసనాలు నిర్వహిస్తారు. ఇందు కోసం ఆయుష్ మంత్రిత్వశాఖ, ప్రసారభారతితో కలసి పనిచేస్తోంది. యోగాసనాల కార్యక్రమాన్ని దూరదర్శన్ (డి.డి.) నేషనల్ఛానల్పై ప్రసారంచేసేందుకు ప్రసారభారతి ఏర్పాట్లు కూడా చేసింది. యోగాదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి చేసే ప్రసంగం ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణ. ఉదయం ఆరున్నరకు ఇది ప్రసారమవుతుంది.
ఆరవ అంతర్జాతీయ యోగాదినోత్సవంలో ప్రజలు ఇతోధికంగా పాల్గొనాలని పిలుపునిస్తూ, పలువురు సెలెబ్రిటీలు, ప్రభావశీలురైన ప్రముఖులు కూడా పరస్పరం సందేశాలు పంపుకున్నారు. అక్షయ్కుమార్, అనుష్కశర్మ, మిలింద్సోమన్, శిల్పాషెట్టి కుంద్రా వంటి సుప్రసిద్ధ సినీతారలు తమ ప్రేరణాత్మక సందేశాలను ఆయుష్ మంత్రిత్వశాఖతో పంచుకున్నారు. జీవన విధానంలోయోగా అనేది క్రమ శిక్షణ, సహనశీలతతో కూడినదని పేర్కొన్నారు. శాంతిసామరస్యాలనే ఉమ్మడి ప్రయోజనాల కోసం సమైక్యంకావాలనే సందేశాన్నియోగా ప్రపంచ ప్రజలకు అందిస్తోందని వారుత మసందేశాల్లో అభిప్రాయపడ్డారు. ఈ సందేశాలతో పాటుగా, యోగాదినోత్సవానికి సంబంధించిన ఇతర సందేశాలను ఆయుష్ మంత్రిత్వశాఖ ఫేస్బుక్ఖాతా(https://www.facebook.com/moayush), ఇతర సోషల్మీడి యాహ్యాండిల్స్లో, చూడవచ్చు.
అంతర్జాతీయ యోగాదినోత్సవానికి ప్రజలను ముందుగా సన్నద్ధమయ్యేందుకు వీలుగా ఆయుష్మంత్రిత్వశాఖ పలు ఆన్లైన్వనరులను, డిజిటల్వేదికలపై అందుబాటులోకి తెచ్చింది. యోగాపోర్టల్, యూట్యూబ్ వంటిసోషల్ మీడియాహ్యాండిల్స్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలను కూడా ఇందుకు సిద్ధం చేశారు. యోగా సూత్రాలు, నిబంధనలతో కూడిన ఉమ్మడి కార్యక్రమాలను కూడా రూపొందించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాదిమంది వీక్షకులు వాటిని అనుసరిస్తున్నారు. ప్రజలు తమ ఇంటి వద్ద నుంచే యోగాను అభ్యసించేందుకు ఈఎలెక్ట్రానిక్, డిజిటల్ వనరుల వలన ఎన్నోఅవకాశాలను కల్పిస్తున్నాయి.
(Release ID: 1633009)
Visitor Counter : 202