గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ‘గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్’ అనే భారీ ఉపాధి కల్పన తో పాటు, గ్రామీణ ప్రజా పనుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు

కోవిడ్ లాక్ డౌన్ ప్రారంభం నుండి గ్రామస్తులు, పేద ప్రజలు, రైతులు మరియు వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టడం జరిగింది ; తమ స్వంత గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ఉద్యమ స్థాయిలో చర్యలు తీసుకుంటోంది - కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖల మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

Posted On: 20 JUN 2020 3:26PM by PIB Hyderabad

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ‘గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్’ అనే భారీ ఉపాధి కల్పన తో పాటు, గ్రామీణ ప్రజా పనుల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.  వినాశకరమైన కోవిడ్-19 కారణంగా దెబ్బతిన్నవలస కార్మికులు అధిక సంఖ్యలో  తిరిగి వచ్చిన ప్రాంతాలు / గ్రామాలకు సాధికారత కల్పించి, జీవనోపాధి అవకాశాలను మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.   బీహార్ రాష్ట్రం, ఖగారియా జిల్లా, బెల్దార్ బ్లాక్ లోని తెలిహార్ గ్రామం నుండి జూన్ 20వ తేదీ (శనివారం) వీడియో కాన్ఫరెన్స్  ద్వారా ఈ పధకానికి ప్రారంభోత్సవం జరిగింది.  ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ మంత్రి రాజ్ శాఖల మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, ఈ పధకం అమలౌతున్న ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులు, ఇతరులు పాల్గొన్నారు. 

 

 

ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి రాజ్ శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి కారణంగా భారతదేశంతో పాటు యావత్ ప్రపంచం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోందని అన్నారు.  లాక్ డౌన్ ప్రకటించిన రోజు నుండి, గ్రామస్తులు, పేద ప్రజలు, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రత్యేక ప్రాధాన్యతతో కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  ప్రజల అవసరాలను తీర్చడం కోసం ప్రకటించిన 1,70,000 కోట్ల రూపాయల ప్యాకేజీ, ప్రజల ఇబ్బందులను చాలా వరకు తగ్గించిందని శ్రీ తోమర్ చెప్పారు.   ఆ తరువాత, ప్రధానమంత్రి 2020 మే 12వ తేదీన 20 లక్షల కోట్ల రూపాయల  ప్యాకేజీని ప్రకటించారు.  దీని ప్రధాన లక్ష్యం దేశంలో ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడం. దీనితో పాటు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఉపాధి మరియు కొత్త ఉపాధి అవకాశాలను కల్పించడం వంటి అంశాలను కూడా ఈ ప్యాకేజీ పరిధిలోకి చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్యాకేజీని అమలుచేయడం ప్రారంభమైందనీ, రాబోయే రోజుల్లో ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయనీ, శ్రీ తోమర్ చెప్పారు.

 

 

కరోనావైరస్ మహమ్మారి కష్టతరమైన కాలంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ నాయకత్వం మరియు అతని వ్యూహాత్మక ప్రణాళికలో భారతదేశం సవాళ్లను అవకాశాలుగా మార్చగలిగినందుకు మనమందరం ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేయాలని శ్రీ తోమర్ అన్నారు.  తమ సొంత గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు వారి స్వంత ప్రదేశాలలోనే ఉపాధి కల్పించే బాధ్యతను ప్రభుత్వం స్వీకరించింది.  ఇప్పుడు ప్రారంభించబడుతున్న ఈ కొత్త పథకాన్ని రూపొందించి, అమలుచేయడంలో ప్రధానమంత్రి దూరదృష్టిని,  నాయకత్వ లక్షణాలను ప్రశంసించడంతో పాటు, ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వయంగా హాజరైనందుకు ప్రధానమంత్రికి ఈ సందర్భంగా తోమర్ కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. 

 

 

6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో గరిబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్ ‌ను చేపడుతున్నట్లు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ  మంత్రి తెలియజేశారు.  కేంద్ర ప్రభుత్వంలోని 11 మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయంతో ఇది క్షేత్ర స్థాయిలో అమలు చేయబడుతుంది.  ఈ పధకం 125 రోజులు కొనసాగుతుంది, గుర్తించిన 25 పనులను ఈ సమయంలో పూర్తిచేయడం జరుగుతుంది.   ఫలితంగా, ఉపాధి అవకాశాలు వేగంగా వృద్ధి చెందుతాయి.  ఉద్యమ స్థాయిలో ప్రజలకు ఉపాధి కల్పించే దిశగా ఇది ఒక ముఖ్యమైన చర్య. 

 

 

గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, రోడ్డు రవాణా మరియు రహదారులు, గనులు, తాగునీరు మరియు పారిశుధ్యం, పర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం మరియు సహజ వాయువు, నూతన మరియు పునరుత్పాదక ఇంధనం, సరిహద్దు రోడ్లు, టెలికాం మరియు వ్యవసాయం వంటి వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలు కలిసి ఈ పధకాన్ని అమలుచేస్తున్నాయి. ఈ పధకం కింద 25 ప్రజా మౌలిక సదుపాయాల పనులు చేపట్టడంతో పాటు జీవనోపాధి అవకాశాల వృద్ధి పనులను వేగవంతం చేయనున్నారు. 

 

 

ఈ పనుల యొక్క ప్రధాన లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి :

 

 

*          తిరిగి వచ్చిన వలసదారులతో పాటు, ఉపాధి లేక దెబ్బతిన్న గ్రామీణ పౌరులకు జీవనోపాధి అవకాశాన్ని కల్పించడం.  

 

*          గ్రామాలలో ప్రజా మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడంతో పాటు జీవనోపాధి అవకాశాలను కల్పించడం. రోడ్లు, గృహాల నిర్మాణం, అంగన్వాడీలు, పంచాయతీ భవనాలు, సామాజిక ప్రాంగణాలతో పాటు పలు ఇతర వివిధ జీవనోపాధి ఆస్తులను నిర్మించడం.   

 

*          అనేక రకాలైన పనులలో, ప్రతి వలస కార్మికుడు, రాబోయే 125 రోజుల్లో, తన నైపుణ్యం ప్రకారం, ఏదో ఒక పనితో తప్పనిసరిగా ఉపాధి పొందే అవకాశం కల్పించడం. 

 

ఈ కార్యక్రమం దీర్ఘకాలిక జీవనోపాధి విస్తరణ మరియు అభివృద్ధికి కూడా ప్రణాళికను సిద్ధం చేస్తుంది. 

 

 

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ ప్రచారానికి నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయంతో ఈ ప్రచారాన్ని అమలు చేయబడుతుంది.

 

 

*****



(Release ID: 1633005) Visitor Counter : 296