నౌకారవాణా మంత్రిత్వ శాఖ

'మేక్ ఇన్ ఇండియా' ప్రయోజనాలు పొందేందుకు భారత్్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రపంచవ్యాప్త నౌకల యజమానులకు ఆహ్వానం

Posted On: 20 JUN 2020 11:10AM by PIB Hyderabad

భారత ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా' విధానాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఇటీవలే సవరించింది. సవరించిన విధానం ప్రకారం, సంబంధిత అధికారుల ఆమోదం ఉంటే తప్ప, ప్రపంచస్థాయి టెండర్లపై విచారణ ఉండదు. ఈ టెండర్లు 200 కోట్ల రూపాయల కన్నా తక్కువ కొనుగోళ్ల అంచనా విలువతో ఉండాలి.
    
    ప్రభుత్వ సరకు రవాణా విధానం అమలులో భారత్ సంసిద్ధతపై, కేంద్ర నౌకా రవాణా శాఖ మంత్రి శ్రీ మన్సుక్ మాండవీయ (స్వతంత్ర బాధ్యత) సమీక్ష నిర్వహించారు.

    'మేక్ ఇన్ ఇండియా' విధానం భారత నౌకల సంఖ్యను తక్షణం రెట్టింపు చేస్తుందని అంచనా వేశారు. ఇప్పుడున్న 450 నౌకల సంఖ్యను 900 లేదా అంతకంటే ఎక్కువ చేస్తుందని అంచనా వేశారు. మరిన్ని పెట్టుబడులకు కూడా అవకాశం ఉందని భావిస్తున్నారు.

    ప్రభుత్వ సరకుల రవాణాకు సంబంధించి, 'మేక్ ఇన్ ఇండియా' విధానం ద్వారా లబ్ధి పొందడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓడల యజమానులు తమ ఓడలను భారతదేశానికి తీసుకురావాలని ఆహ్వానాలు పొందారు. ఆధునిక సముద్ర పరిపాలన, శిక్షణ పొందిన నౌకా సిబ్బంది నిరంతర లభ్యత, ఇప్పటికే ఉన్న ఓడ నిర్వహణ నైపుణ్యాలతో ఓడల యజమానులు లాభం పొందనున్నారు. 


(Release ID: 1632905) Visitor Counter : 210