బొగ్గు మంత్రిత్వ శాఖ

బొగ్గు, గనుల రంగంలో పూర్తిస్థాయి సంస్కరణలకు భారత్ కీలక నిర్ణయం

పోటీని ఆహ్వానించి, మూలధన పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టడానికే ఈ నిర్ణయమన్న ప్రధానమంత్రి

బొగ్గురంగంలో సంస్కరణలతో గిరిజన ప్రాంతాలైన
తూర్పు, మధ్య భారత్ ప్రాంతాలు
అభివృద్ధికి మూలస్తంభాలు కాగలవన్న ప్రధాని

భారీ స్థాయిలో పెట్టుబడి వ్యయానికి, ఉపాధి కల్పనా ప్రణాళికకు బొగ్గు రంగం కట్టుబడి ఉందన్న మంత్రి ప్రహ్లాద్ జోషీ
వాణిజ్యపరంగా తవ్వకంకోసం బొగ్గుగనుల
వేలం ప్రారంభం; 41 బొగ్గుగనులు సిద్ధం

Posted On: 18 JUN 2020 5:23PM by PIB Hyderabad

  వాణిజ్య ప్రాతిపదికపై తవ్వకంకోసం 41 బొగ్గు క్షేత్రాల వేలం ప్రక్రియను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.  ఆత్మ నిర్భర భారత్ అభియాన్ కింద భారత ప్రభుత్వం చేసిన పలు ప్రకటనలకు అనుగుణంగా ప్రక్రియ ప్రారంభించారు. భారత వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య (FICCI)తో కలసి, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రక్రియను ప్రారంభించింది. రెండు దశల్లో వేలం ప్రక్రియను ఎలెక్ట్రానిక్ పద్ధతిలో అమలు చేయడం ద్వారా బొగ్గుగనులను ఔత్సాహికులకు కేటాయించనున్నారు.

  సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,. కోవిడ్-19 మహమ్మారి విసిరిన సవాళ్లను భారత్ అధిగమించగలదని, ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోగలదని అన్నారు. దేశం ఆత్మ నిర్భరత లేదా, స్వావలంబనను సాధించేందుకు తగిన మార్గాన్ని కోవిడ్ సంక్షోభం చూపెట్టిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఆత్మ నిర్భర భారత్,..అంటే దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, దిగుమతులపై వ్యయం చేసే విదేశీ కరెన్సీని పొదుపుచేసుకోవడం అని ప్రధాని అన్నారు. దేశం దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరంలేకుండా,.స్వదేశీయంగానే అభివృద్ధి వనరులను పటిష్టం చేసుకునేందుకు ప్రక్రియ దోహదపడుతుందన్నారు. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న సరుకులకే  అతిపెద్ద ఎగుమతిదారులుగా అవతరించడమే మన లక్ష్యమని అన్నారు.

  లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి రంగాన్ని, ప్రతి ఉత్పాదనను, ప్రతి సేవను దృష్టిలో ఉంచుకుని సంపూర్ణ హృదయంతో పనిచేయాలని, సంబంధిత రంగంలో దేశం స్వావలంబన సాధించేందుకు కృషిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ రోజు తీసుకున్న కీలకమైన నిర్ణయంతో భారత్ ఇంధన రంగంలో సొంతంగా స్వావలంభన సాధించగలదని  చెప్పారు. కేవలం బొగ్గుగనుల తవ్వకం రంగంలో సంస్కరణలకే కాక, యువతకు లక్షలాది ఉద్యోగాలు, భారీగా ఉపాధి కల్పించేందుకు నిర్ణయంతో శ్రీకారం చుట్టినట్టవుతుందని ప్రధాని వివరించారు. ఈ రోజు బొగ్గు గనుల తవ్వకం ప్రక్రియపై వేలం ప్రక్రియను నిర్వహించడమంటే,  దశాబ్దాల  కొనసాగుతున్న లాక్ డౌన్ చెర నుంచి బొగ్గు రంగానికి విమక్తి కలిగిస్తున్నట్టేనని ప్రధాని వ్యాఖ్యానించారు.

   బొగ్గురంగంలో సంస్కరణలతో ఖనిజ రంగంలో సంస్కరణలు కూడా బలోపేతమవుతున్నాయని, ఎందుకంటే,  బొగ్గు నిక్షేపాల క్షేత్రాలకు అతి సమీపంలోనే ఇనుము, బాక్సయిట్, తదితర ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని ప్రధాని అన్నారు. వాణిజ్య ప్రాతిపదికన బొగ్గుగనుల తవ్వకంపై వేలం ప్రక్రియను ప్రారంభించడంతో పారిశ్రామిక రంగానికి చెందిన అన్ని భాగస్వామ్య వర్గాలకు సమాన అవకాశాలు ఏర్పడ్డాయన్నారు. ఈ ప్రక్రియతో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మరింత ఆదాయం సమకూరుతుందని, దేశంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ప్రతి రంగంలోనూ సానుకూల ఫలితాలు ఉంటాయని అన్నారు.

    బొగ్గు రంగంలో చేపట్టిన సంస్కరణలు గిరిజన ప్రాంతాలైన దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాలు అభివృద్ధికి మూల స్తంభాలుగా రూపొందగలవని ప్రధానమంత్రి అన్నారు. ఈ ప్రాంతాల్లోని పలు ఆశావహ జిల్లాలు ఇప్పటివరకూ ఆశించిన రీతిలో ప్రగతిని సాధించలేకపోయాయని అన్నారు. ఈ ప్రాంతాల్లోని 19 ఆశావహ జిల్లాల్లో భారీ స్థాయిలో బొగ్గు నిల్వలు నిక్షిప్తమై ఉన్నాయని, అయినా ఆజిల్లాల ప్రజలకు తగినంత స్థాయిలో ప్రయోజనం దక్కలేదని, ఉపాధికోసం సుదూర నగరాలకు ప్రజలు వలసవెళ్లవలసిన పరిస్థితి ఉందని అన్నారు.

   వాణిజ్య ప్రాతిపదికన గనుల తవ్వకానికి తీసుకున్న చర్యలు తూర్పు, మధ్య భారతావని ప్రాంతాలకు ఎంతో సహాయంగా ఉంటాయని, స్థానిక ప్రజలకు తమ ఇళ్లకు సమీపంలోనే ఉపాధి లభిస్తుందని ప్రధాని అన్నారు. బొగ్గు తవ్వి తీసేందుకు, బొగ్గు రవాణాకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకోసం 50వేల కోట్ల రూపాయల ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇది కూడా ఉపాధి కల్పనకు ఇతోధికంగా దోహదపడుతుందని ప్రధానమంత్రి వివరించారు.

  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ కార్యక్రమంలో మాట్లాడుతూ,..ఇది చారిత్రాత్మక సందర్భమని అన్నారు. దేశంలో ఇంధనంకోసం గిరాకీ ప్రతియేటా దాదాపు 5శాతం పెరుగుతోందని, అందువల్ల అన్ని రకాల ఇంధన వనరులు దేశానికి అవసరమని  అన్నారు. దేశంలో మొత్తం ఇంధన సరఫరాలో దాదాపు 50శాతం బొగ్గునుంచి లభిస్తోందని, డిమాండ్ కు అనుగుణంగా బొగ్గును అందుబాటులో ఉంచడం బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రధాన బాధ్యత అని ప్రహ్లాద్ జోషీ అన్నారు. ఇంధన రంగంలో కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థ కీలకపాత్ర పోషించిందన్నారు.

 బొగ్గు నిక్షేపాలు ఉన్న ప్రాంతాలకోసం భారీ స్థాయిలో పెట్టుబడులకు, ఉపాధి కల్పనకు తగిన ప్రణాళిక రూపొందించేందుకు బొగ్గు రంగం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు. గత ఆరేళ్లలో అన్ని గనుల్లో ఉత్పత్తి భారీగా పెరిగిందన్నారు. భాగస్వామ్య వర్గాలకు సంపూర్ణ స్థాయిలో ప్రమేయం కల్పించేలా వాణిజ్య ప్రాదిపదికన గనుల తవ్వకంపై వేలం ప్రక్రియను, పద్ధతులను రూపొందించినట్టు కేంద్రమంత్రి చెప్పారు. వేలంలో కేటాయించవలసిన బొగ్గు క్షేత్రాలను ప్రజలతో సంప్రదింపుల ద్వారా గుర్తించినట్టు మంత్రి చెప్పారు. ప్రైవేటు కంపెనీలు గనుల తవ్వకం రంగంలోకి ప్రవేశించడానికి ఇదే తగిన తరుణమన్నారు.

  41 బొగ్గుగనులను వేలం ప్రక్రియకు సిద్ధంచేశామని, పూర్తిగా బొగ్గు అన్వేషణ జరిపినవి, పాక్షికంగా అన్వేషణ జరిపినవి కూడా గనుల్లో ఉన్నాయని అన్నారు. చత్తీస్ గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో గనులున్నాయని, టెక్నికల్, ఫైనాన్సియల్ బిడ్డింగ్ ద్వారా రెండు దశల టెండర్లతో వేలం ప్రక్రియ నిర్వహిస్తారని ఆయన చెప్పారు. 

  బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ జైన్ మాట్లాడుతూ,..బొగ్గు పరిశ్రమకు బంధనాలనుంచి  స్వేచ్ఛను కల్పిస్తున్నట్టు చెప్పారు. బొగ్గు గనులు ఇకపై ప్రభుత్వంలో నిర్ణయాలకో, కొందరు కార్పొరేట్ల అవకాశాలకో పరిమితం కాబోవని  అన్నారు. వాణిజ్య ప్రాతిపదిన గనుల తవ్వకం ప్రక్రియ ప్రారంభించడంతో బొగ్గు గనులు, బొగ్గు వాణిజ్యం ఇకపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలందరికీ అందుబాటులో ఉంటాయని అనిల్ కుమార్ జైన్ అన్నారు.

 భారత వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య (FICCI) అధ్యక్షురాలు డాక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడుతూ, వాణిజ్య ప్రాతిపదికన గనుల తవ్వకంపై ప్రధానమంత్రి రోజు ప్రారంభించిన వేలం ప్రక్రియ దేశ ఇంధన అవసరాలను తీర్చగలదని అన్నారు. అంతేకాకుండా ఇంధన రంగంలో దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, బొగ్గు రంగం ఆధునికీకరణకు, ఉద్యోగాల కల్పనకు ఇది దోహదపడుతుందని ఆమె అన్నారు. చారిత్రాత్మకమైన సంస్కరణలతో దేశంలోని సహజ వనరులకు స్వేచ్ఛగా వాడుకునేందుకు వీలు కలుగుతుందని, ఆర్థిక పరిస్థితికి ఉద్దీపన జరుగుతుందని, దేశ ఆర్థికాభివృద్ధి 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకునేందుకు దోహపడుతుందని అన్నారు. ఈ భారీ కార్యక్రమంలో తమకు భాగస్వామ్యం లభించడం సంతోషదాయకమన్నారు. టాటా సన్స్ సంస్థ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, వేదాంత గ్రూపు వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ అగర్వాల్ కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. కోల్ ఇండియా లిమిటెడ్ సంస్థ, దాని అనుబంధ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. 

  గనుల వేలానికి సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియ నిబంధనలు, షరతులు, న్యాయపరమైన అంశాలు, ఒప్పందాలపై సాంకేతిక సమావేశాన్ని కూడా సందర్భంగా నిర్వహించారు.  బొగ్గు మంత్రిత్వ శాఖలో నామినేషన్ పై అధికారిగా నియమితులైన ఎం. నాగరాజు సదస్సును నిర్వహించారు.

***

 

 



(Release ID: 1632466) Visitor Counter : 316