జల శక్తి మంత్రిత్వ శాఖ

పశ్చిమ బెంగాల్ లో జల్ జీవన్ మిషన్ అమలుపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర జల్ శక్తి మంత్రి

జెజెఎం కింద పశ్చిమ బెంగాల్ కి 2020-21లో రూ.1610 కోట్లు కేటాయింపు

Posted On: 18 JUN 2020 1:05PM by PIB Hyderabad

కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షేఖావత్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ (జెజెఎం) కింద పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని గత స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించినట్లుగారాష్ట్రాలు 2024 నాటికి ప్రతి గ్రామీణ గృహానికి తాగునీటి  కనెక్షన్ల (ఎఫ్‌హెచ్‌టిసి) ద్వారా త్రాగునీటిని అందించాలని లక్ష్యంగా జెజెఎంను అమలు చేస్తున్నాయి. గ్రామీణ జీవితాలను మెరుగుపరచడం మహిళలు ముఖ్యంగా బాలికలకు చాకిరీ తగ్గించడం మిషన్ లక్ష్యం. 

తన లేఖలోశ్రీ షేఖావత్గృహాలకు కొళాయి కనెక్షన్లుఅందుబాటులో ఉన్న నిధుల వినియోగం పరంగా జల్ జీవన్ మిషన్ నిధులను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. 2019-20 సంవత్సరంలో 32 లక్షల గృహాలకు కొళాయి కనెక్షన్లు అందించాలని లక్ష్యం అయితేరాష్ట్రంలో 4,750 కనెక్షన్లు మాత్రమే ఇచ్చారు. ఇంకా, 2019-20లో పశ్చిమ బెంగాల్‌కు  994 కోట్లు కేటాయించారుఅందులో రాష్ట్రానికి 8 428 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఆర్సెనిక్ / ఫ్లోరైడ్-ప్రభావిత ఆవాసాలకు త్రాగునీటిని అందించడం కోసం 2017 మార్చి నుండి పశ్చిమ బెంగాల్‌కు మొత్తం రూ. 1,305.70 కోట్లు విడుదల అయితేవీటిలో  573.36 కోట్లు ఇప్పటికీ వినియోగించుకోలేదు.

రాష్ట్రానికి కేటాయింపులను 2019-20లో రూ. 994 కోట్ల నుండి 2020-21లో రూ.1,610.76 కోట్లకు పెంచామనిఅంతకుముందు ఏడాది ఖర్చు చేయని బ్యాలెన్స్‌తోపశ్చిమ బెంగాల్‌కు జెజెఎం కోసం రూ. 2,760 కోట్ల కేంద్ర నిధుల లభ్యత ఉందని వెల్లడించారు. ప్రతి గ్రామీణ గృహాలకు త్రాగునీరు అందించడం జాతీయ ప్రాధాన్యత అనిసమయానుసారంగా లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్రం ప్రయత్నాలు చేయాలని జల్ శక్తి మంత్రి ఉద్ఘాటించారు.

రాష్ట్రంలోని 21,600 గ్రామాల్లో కోట్ల గృహాలకు ట్యాప్ కనెక్షన్లు ఇవ్వవచ్చని జల్ శక్తి మంత్రి చెప్పారు.

స్థానిక సమాజం పాత్రబాధ్యతపై నొక్కిచెప్పిన జల్ శక్తి మంత్రితాగునీటి భద్రత సాధించడానికి దీర్ఘకాలిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి స్థానిక గ్రామ సంఘం / గ్రామ పంచాయతీలు మరియు నీటి సరఫరా వ్యవస్థల ప్రణాళికఅమలునిర్వహణఆపరేషన్ మరియు నిర్వహణలో పాల్గొనాలని అభ్యర్థించారు. అన్ని గ్రామాల్లోజల్ జీవన్ మిషన్‌ను నిజంగా ప్రజల ఉద్యమంగా మార్చడానికి కమ్యూనిటీ సమీకరణతో పాటు ఐఇసి ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉంది.

2020-21లోపశ్చిమ బెంగాల్‌కు పిఆర్‌ఐలకు 15 వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్‌గారూ. 4,412 కోట్లు అందుతాయి. ఈ మొత్తంలో 50% తప్పనిసరిగా నీటి సరఫరా మరియు పారిశుద్ధ్యం కోసం వినియోగించాలి. 

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలోప్రజలు నీటి కోసం గుంపులుగా ఉండకుండా ఉండడం చాలా ముఖ్యం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అన్ని గ్రామాల్లో నీటి సరఫరా పనులను చేపట్టాలని కోరారుఇది సామాజిక దూరం సాధనలో సహాయపడుతుందిస్థానికులు / వలసదారులకు ఉపాధి పొందడంలో మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుంది. 2024 నాటికి పశ్చిమ బెంగాల్‌ను 100% ఎఫ్‌హెచ్‌టిసి రాష్ట్రంగాఅంటే 'హర్ ఘర్ జల్ రాజ్య'గా మార్చడానికి కేంద్ర సన్నద్ధతో ఉంది.  బెంగాల్ సిఎంతో త్వరలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జెజెఎం ప్రణాళిక మరియు అమలు గురించి చర్చించాలని భావిస్తున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. 

*****

 



(Release ID: 1632317) Visitor Counter : 159