సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
భారతీయ తాటి పరిశ్రమలో కొత్త ఉద్యోగ అవకాశాలు, సేంద్రియ ఉత్పత్తులకు బాటవేసిన కెవిఐసి
Posted On:
17 JUN 2020 10:15AM by PIB Hyderabad
ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) నీరా, తాటిబెల్లం తయారీకి సంబంధించి ఒక వినూత్న ప్రాజెక్టును తీసుకువచ్చింది. దీనికి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించగల సామర్ధ్యం ఉంది. శీతల పానీయాలకు ప్రత్యామ్నాయంగా నీరాను ప్రోత్సహించేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇది ఆదివాసీలకు , సంప్రదాయసిద్ధంగా గీత వృత్తిదారులకు స్వయం ఉపాధి కల్పిస్తుంది. దీనిని మంగళవారంనాడు మహారాష్ట్రలోని పాలఘార్ జిల్లా దహనులో ప్రారంభించారు. మహారాష్ట్రలో సుమారు 50 లక్షలకు పైగా తాటిచెట్లు ఉన్నాయి.
నీరా తీయడానికి , తాటిబెల్లం తయారీకి అవసరమైన ఉపకరణాలను 200 మంది చేతివృత్తులవారికి కెవిఐసి పంపిణీ చేసింది. వీరికి కెవిఐసి వారం రోజులపాటు శిక్షణ కూడా ఇచ్చింది. వీరికి అందజేసిన టూల్ కిట్లకు 15 వేల రూపాయల విలువగల వస్తువులు ఉన్నాయి. వాటిలో స్టెయిన్‌లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ కడాయి, పెర్ఫోరేటెడ్ మౌల్డ్‌లు, క్యాంటీన్ బర్నర్లు, నీరా తీసేందుకు అవసరమైన ఇతర పరికరాలైన కత్తి, తాడు,గొడ్డళ్లు వంటివి ఉన్నాయి. దీనివల్ల 400 మంది సంప్రదాయ గీత వృత్తిదారులకు ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుంది.
సూర్యోదయానికంటే ముందే తాటిచెట్ల నుంచి తీసిన నీరా పోషక విలువలు ఎక్కువగా కలిగిన ఆరోగ్యకరమైన పానీయం. దీనిని దేశంలోని పలు రాష్ట్రాలలో వినియోగిస్తారు. అయితే సంస్థాగతమైన మార్కెట్ వ్యూహం లేకపోవడంవల్ల వాణిజ్య పరంగా, పెత్త ఎత్తున నీరా మార్కెటింగ్ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కేంద్ర ఎం.ఎస్.ఎం.ఇ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరి చొరవతో ఈప్రాజెక్టు రూపుదిద్దుకుంది. నీరాను శీతల పానీయంగా ఉపయోగించడానికి, వాణిజ్యపరంగా ఉపయుక్తంగా ఉండడానికి రాష్ట్రంలోని కొన్ని పెద్ద సంస్థలను ఈరంగంలోకి దించేందుకు గల సాధ్యాసాధ్యాలను కూడా అన్వేషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 10 కోట్ల తాటిచెట్లు ఉన్నాయి. అలాగే సరిగా మార్కెట్ చేసుకోగలిగితే నీరా నుంచి కాండీలు , మిల్క్ చాక్లెట్లు, పామ్‌కోలా, ఐస్‌క్రీమ్, సంప్రదాయ స్వీట్లను కూడా తయారు చేయవచ్చు. ప్రస్తుతం దేశంలో 500 కోట్ల రూపాయల విలువగల తాటిబెల్లం, నీరా వ్యాపారం జరుగుతోంది.
నీరా, తాటిబెల్లం తయారీకి సంబంధించి కెవిఐసి సవివరమైన నివేదికను రూపొందించింది. నీరాను తగిన ప్రమాణాలకు అనుగుణంగా సేకరించడం, ప్రాసెస్ చేయడం, నిర్ణీత స్థితిలో దాని ప్యాకింగ్ వంటివి చేపట్టాలని నిర్ణయించారు. లేకుంటే ఇది పులిసిపొయే అవకాశం ఉంది. ప్రాసెస్ అయిన నీరాను కొల్డ్ చెయిన్ ద్వారా బి2సి సరఫరా చెయిన్ కు చేర్చడం జరుగుతుంది.
“ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న శీతల పానీయాలకు బదులుగా కొబ్బరి నీళ్ల లాగే నీరాను ప్రోత్సహించేందుకు కృషిచేస్తున్నాం. నీరా అనేది సేంద్రియ, పౌష్టికాహార విలువలు కలిగినది.ఇది పూర్తిగా ఆరోగ్యకరమైన పానీయం.నీరా ఉత్పత్తి పెంపు, మార్కెటింగ్ తో దేశంలో గ్రామీణ ప్రాంతంలొ కీలక పరిశ్రమగా దీనిని రూపుదిద్దుకునేలా చేయనున్నాం” అని కెవిఐసి ఛైర్మన్ శ్రీ వినయ్ సక్సేనా తెలిపారు. చేతివృత్తుల వారికి అవసరమైన ఉపకరణాలు అందజేసే కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు.
నీరా అమ్మకాలు, స్వయం ఉపాధికి అద్భుత అవకాశాలు ఉన్నాయని శ్రీ సక్సేనా చెప్పారు. భారతదేశంలో తాటి పరిశ్రమ ఒక పెద్ద ఉపాధి కల్పించే పరిశ్రమ. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వావలంబన అలాగే ఓకల్ ఫర్ లోకల్ పిలుపునకు ఇది అనుగుణమైనదని సక్సేనా చెప్పారు.
అలాగే నీరా పానీయానికి ఎగుమతి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. శ్రీలంక, ఆఫ్రికా, మలేసియా, ఇండొనేసియా, థాయిలాండ్ , మయన్మార్ వంటి దేశాలలో దీనిని వాడుతారు. మహారాష్ట్ర, గుజరాత్. గోవా, డామన్ అండ్ డయ్యూ, నాగర్ హవేలి, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ , బీహార్ రాష్ట్రాలలో తాటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది అంతర్జాతీయంగా నీరా ఉత్పత్తిలో మన దేశం ముందుండేట్టు చేస్తుంది.
(Release ID: 1632092)
Visitor Counter : 229