జల శక్తి మంత్రిత్వ శాఖ

కర్ణాటక రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలు కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ వ్రాసిన - కేంద్ర మంత్రి శ్రీ షేఖావత్

Posted On: 15 JUN 2020 6:15PM by PIB Hyderabad

కేంద్ర జల శక్తి శాఖ మంత్రి కర్ణాటక రాష్ట్రంలో, జల్ జీవన్ మిషన్ (జె.జె.ఎం) అమలుకు సంబంధించి వ్రాస్తూ,  కర్ణాటక రాష్ట్రంలో కోవిడ్ -19 పరిస్థితిని సమర్ధవంతంగా నిర్వహించినందుకు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని,  కేంద్ర జల శక్తి శాఖ మంత్రి అభినందించారు. 2024 నాటికి దేశంలోని ప్రతి గ్రామీణ కుటుంబానికీ, రోజుకు 55 లీటర్ల త్రాగు నీటిని అందించాలని లక్ష్యంతో ప్రధానమంత్రి రూపొందించిన ప్రధాన కార్యక్రమం జల్ జీవన్ మిషన్ (జె.జె.ఎం) ‌ను అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయడంలో జల్ శక్తి మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో కలిసి పనిచేస్తోంది.  గ్రామీణ ప్రజలు,  ముఖ్యంగా మహిళలు మరియు బాలికల చాకిరీని తగ్గించడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరచడం లక్ష్యంగా జె.జె.ఎం. ను అమలుచేస్తున్నారు.

2022-23 నాటికి కర్ణాటక లో నూటికి నూరు శాతం గృహాలకు ఈ పధకాన్ని అమలుచేయాలని సంకల్పించినందుకు, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రిని అభినందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికీ ట్యాప్ కనెక్షన్ అందుబాటులోకి తెచ్చే విధంగా రాష్ట్రంలో జె.జె.ఎం. ను వేగంగా అమలు చేయాలని కేంద్ర మంత్రి కోరారు.   రాష్ట్రంలోని 89.61 లక్షల గ్రామీణ కుటుంబాల్లో, 24.41 లక్షల కుటుంబాలకు ఇప్పటికే ట్యాప్ కనెక్షన్ల (ఎఫ్.‌హెచ్.‌టి.సి) సౌకర్యం కల్పించడం జరిగింది.  2019-20 ఆర్ధిక సంవత్సరంలో  22,133 ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది.  2020-21 సంవత్సరంలో,  23.57 లక్షల కుటుంబాలకు నీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.  ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 3,139 నీటి సరఫరా వ్యవస్థలను రెట్రోఫిటింగ్ మరియు అభివృద్ధి పరచడంపై కేంద్ర మంత్రి దృష్టి సారించారు. వీటి ద్వారా, 23.57 లక్షల ట్యాప్ కనెక్షన్లను అందించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా, పేద, అట్టడుగు ప్రజల గృహలకు  ట్యాప్ కనెక్షన్లు లభించే విధంగా, ఈ ఏడాది, 'ఉద్యమ స్థాయి'లో పనులను ప్రారంభించాలని ఆయన ముఖ్యమంత్రి కోరారు.  

2020-21లో కర్ణాటక రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 1,189.40 కోట్ల రూపాయల నిధులను ఆమోదించింది, ఇది 2019-20 సంవత్సరంలో కేటాయించిన 546.06 కోట్ల రూపాయల కంటే గణనీయమైన పెరుగుదలను సూచిస్తోంది. ప్రారంభ నిల్వ 80.44 కోట్ల రూపాయల తో పాటు, ఈ ఏడాది రాష్ట్రానికి కేటాయించిన 1189.40 కోట్ల రూపాయలతో పాటు,  రాష్ట్ర మాచింగ్ వాటాను కూడా కలిపితే,  మొత్తం 2734.03 కోట్ల రూపాయలు కర్ణాటకలో జల్ జీవన్ మిషన్ అమలుకు అందుబాటులో ఉంటాయి.  గృహాలకు అందుబాటులో ఉంచిన మొత్తం ట్యాప్ కనెక్షన్లు, ఆర్ధిక పురోగతి ఆధారంగా, రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా అమలుచేయాలని కోరడం జరిగింది.  పనితీరు, ఫలితాల  ఆధారంగా రాష్ట్రం అదనపు నిధులను పొందడానికి అవకాశం ఉంటుంది.  నిధుల వినియోగంలో పారదర్శకత కోసం పబ్లిక్ ఫైనాన్స్ యాజమాన్య విధానం (పి.ఎఫ్.‌ఎం.ఎస్) ను తప్పనిసరిగా  అవలంబించడం కోసం దీనిని ప్రముఖంగా పేర్కొనడం జరిగింది. 

నాణ్యమైన నీరు అందుబాటులో లేని ప్రాంతాల్లో పైపుల ద్వారా నీటి సరఫరా అందించడం యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, ఆర్సెనిక్ మరియు ఫ్లోరైడ్ బారిన పడిన 685 ఆవాసాలలో నివసిస్తున్న రాష్ట్రంలోని 3.60 లక్షల జనాభాకు త్రాగునీరు అందించాలని కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రిని కోరారు.  సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (ఎస్.ఏ.జి.వై) పరిధిలోని గ్రామాలు, ఆశాజనక జిల్లాలు, ఎస్సీ / ఎస్టీ లు ఎక్కువగా ఉన్న గ్రామాలు మరియు గ్రామాలతో పాటు  నీటి కొరత ఉన్న అన్ని ప్రాంతాలలో ఈ పధకం సార్వత్రిక అమలుపై దృష్టి పెట్టాలి. 

పి.ఆర్.‌ఐ.లకు 15 వ ఆర్థిక సంఘం గ్రాంట్లను చాలా న్యాయంగా ఉపయోగించడంపై కేంద్ర మంత్రి నొక్కిచెప్పారు, అందులో 50 శాతం నిధులను నీటి సరఫరా సౌకర్యాలు మరియు పారిశుద్ధ్యం కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది.   2020-21 సంవత్సరంలో రాష్ట్రానికి 2,217 కోట్ల రూపాయలు ఆర్ధిక సంఘం గ్రాంట్లు గా అందుతాయి. గ్రామ స్థాయిలో నీటి సరఫరా పనుల కోసం ఎం.జి.ఎన్.‌ఆర్..జి.ఎస్.; ఎస్.‌బి.ఎం.(జి), పి.ఆర్.‌.లకు 15  ఆర్థిక సంఘం గ్రాంట్లు,  జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి, సి..ఎం.పి.., సి.ఎస్.‌ఆర్నిధిస్థానిక ప్రాంత అభివృద్ధి నిధి మొదలైన వివిధ కార్యక్రమాలను కలపడం ద్వారా అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకోవాలని రాష్ట్రాన్ని అభ్యర్థించడం జరిగింది.  నీటి వనరులను బలోపేతం చేయడానికి మరియు తాగునీటి భద్రతకు భరోసా ఇవ్వడానికి నీటి సంరక్షణ కార్యకలాపాలను నిర్వహించడానికి అటువంటి నిధులన్నింటినీ ఒక చోట జమ చేయడం ద్వారా ప్రతి గ్రామానికి గ్రామ కార్యాచరణ ప్రణాళిక (వి.ఎ.పి) ను సిద్ధం చేయాలని కేంద్ర మంత్రి కోరారు.

వీటితో పాటు, దీర్ఘకాలిక సుస్థిరతను నిర్ధారించడానికి, గ్రామాలలో నీటి సరఫరా వ్యవస్థల ప్రణాళిక, అమలు, నిర్వహణలో స్థానిక గ్రామ సంఘం / గ్రామ పంచాయతీలు లేదా వినియోగదారుల బృందాలను సమూహాలకు భాగస్వామ్యం కల్పించాలని కేంద్ర మంత్రి నొక్కి చెప్పారు.  జల్ జీవం మిషన్ ను నిజంగా ఒక ప్రజా ఉద్యమంగా మార్చడానికి అన్ని గ్రామాల్లో ప్రజలను సమీకరించడంతో పాటు ఐ.ఈ.సి. ప్రచారాన్ని చేపట్టాలని కూడా కోరడం జరిగింది.  గ్రామాల్లో నీటి సరఫరా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వాటి వినియోగం, నిర్వహణలో ఆయా గ్రామాల ప్రజలను సమీకరించటానికి మహిళా స్వయం సహాయక బృందాలు, స్వచ్ఛంద సంస్థల సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. 

ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 మహమ్మారి విస్తరిస్తున్న పరిస్థితిల్లో, నైపుణ్యం కలిగిన మరియు తక్కువ నైపుణ్యం కలిగిన వలస కార్మికులకు తగిన ఉపాధి కల్పించడానికీ, అలాగే, గ్రామీణ కుటుంబాలకు త్రాగునీటిని నిర్ధారించడంతో పాటు, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరిచే విధంగా, గ్రామాల్లో నీటి సరఫరా మరియు నీటి సంరక్షణకు సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించాలని కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి ని కోరారు. 

కర్ణాటకను '100 శాతం ఎఫ్.‌హెచ్.‌టి.సి. రాష్ట్రంగా' మార్చడానికి వీలుగా, రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలుకు బేషరతుగా మద్దతు ఇస్తామని కేంద్రమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు.  ప్రతి కుటుంబానికీ, తగినంత పరిమాణంలో, సూచించిన నాణ్యతతో, క్రమబద్ధమైన, దీర్ఘకాలిక ప్రాతిపదికన త్రాగునీరు లభించే విధంగా, జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను సాకారం చేసే విధంగా, ఈ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి కోరారు. 

*****



(Release ID: 1631800) Visitor Counter : 195