భారత పోటీ ప్రోత్సాహక సంఘం
మాక్‌రిట్చీ వివిధ సంస్థలను కొనుగోలు చేసేందుకు సీసీఐ పచ్చజెండా
- 91 స్ట్రీట్స్ మీడియా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (91 స్ట్రీట్స్), అసెంట్ హెల్త్ అండ్ వెల్నెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అసెంట్) మరియు ఏపీఐ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీఐ) కొనుగోలు చేయనున్న మాక్‌రిట్చీ
Posted On:
15 JUN 2020 4:56PM by PIB Hyderabad
91 స్ట్రీట్స్ మీడియా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (91 స్ట్రీట్స్), అసెంట్ హెల్త్ అండ్ వెల్నెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎసెంట్) మరియు ఏపీఐ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీఐ) కొనుగోలుకు మాక్‌రిట్చీ ఇన్వెస్ట్‌మెంట్స్ (మాక్‌రిట్చీ) చేసిన కొనుగోలు ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. పోటీ చట్టం 2002 లోని సెక్షన్ 31 (1) ప్రకారం సీసీఐ ఈ రోజు మాక్‌రిట్చీ కొనుగోలు ప్రతిపాదనకు పచ్చజెండా ఊపింది.
వివిధ కార్యకలాపాల్లో విస్తరించి ఉన్న 91 స్ట్రీట్స్..
ఈ కోనుగోలుకు సంబంధించిన 'ప్రతిపాదిత కాంబినేషన్'లో భాగంగా సంస్థ తప్పనిసరి కన్వర్టిబుల్ డిబెంచర్లు, తప్పనిసరి కన్వర్టిబుల్ ప్రిఫరెన్స్ షేర్లు లేదా / మరియు 91 స్ట్రీట్స్, అసెంట్ మరియు ఏపీఐ సాధారణ వాటాల సముపార్జన చేయాల్సి ఉంటుంది. మాక్‌రిట్చీ ఇన్వెస్ట్‌మెంట్స్ పీటీఈ లిమిటెడ్, టెమాసెక్ హోల్డింగ్స్ (ప్రైవేట్) లిమిటెడ్లోనని పూర్తి పరోక్ష యాజమాన్యం హోల్డింగ్ సంస్థ. 91 స్ట్రీట్స్ భారతదేశంలో స్థాపించబడిన ఒక సంస్థ. ఇది దేశం మొత్తం నేరుగా మరియు దాని అనుబంధ సంస్థల ద్వారా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 91 స్ట్రీట్స్ ఇంటర్ ఎలియా ఈ-కామర్స్ వేదిక (వెబ్‌సైట్ మరియు మొబైల్ అప్లికేషన్) ను అభివృద్ధి చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం మరియు మేధో సంపత్తిని కలిగి ఉంది. చిల్లర విక్రేతలు / రిటైల్ ఫార్మసీలు చెల్లుబాటు అయ్యే లైసెన్స్‌లతో మందులు మరియు ఇతర పోషకపు ఔషధాల (న్యూట్రాస్యూటికల్స్) అమ్మకంపై కూడా దృష్టి సారించింది. థర్డ్ - పార్టీ ల్యాబ్‌ల వారు అందించే డయాగ్నొస్టిక్ టెస్ట్ ప్యాకేజీ సౌకర్యాలను కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థ టెలి-మెడికల్ కన్సల్టేషన్ వేదికను కూడా కలిగి ఉండడంతో పాటు వాటిని అభివృద్ధి చేస్తుంది. దీనికి అదనంగా ఈ 91 స్ట్రీట్ యొక్క అనుబంధ సంస్థలు హోల్‌సేల్ (బిజినెస్ టు బిజినెస్ (బీ 2 బీ)) ఔషధ ఉత్పత్తుల అమ్మకం, పంపిణీలో మరియు భారతదేశంలోని ఔషధ చిల్లర వ్యాపారులకు లాజిస్టిక్స్ డెలివరీతో పాటుగా రవాణా సేవలను కూడా అందించడంలో నిమగ్నమై ఉన్నాయి.
ఔషధ అమ్మకాలలో మేటిగా అసెంట్..
అసెంట్ అనేది భారతదేశంలో ప్రారంభించబడిన సంస్థ ఇది దేశ వ్యాప్తంగా నేరుగా మరియు దాని అనుబంధ సంస్థల ద్వారా పనిచేస్తోంది (ఇది ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్లో) ఔషధాల హోల్‌సేల్, బీ 2 బీ అమ్మకాలు, పంపిణీలలో
ఈ సంస్థ నిమగ్నమై ఉంది. ఎఫ్‌ఎమ్‌సీజీ, న్యూట్రాస్యూటికల్ ఉత్పత్తులను నగదు మరియు క్యారీ ప్రాతిపదికన మరియు ఆర్డర్‌ను అందించే అప్లికేషన్‌ను సొంతం చేసుకుని అభివృద్ధి చేసే వ్యాపారంలో సంస్థ నిమగ్నమై ఉంది. ఇది ఔషధ పరిశ్రమలో బీ 2 బీ అమ్మకాలను సులభతరం చేయడానికి కావలసిన ఆర్డర్ నిర్వహణ వ్యవస్థను కలిగి ఉంది. ఏపీఐ భారతదేశంలో స్థాపించబడిన
ఒక సంస్థ, ఇది ఎలాంటి వ్యాపారంలోనూ నిమగ్నమై లేదు.
ఈ కొనుగోలుకు సంబంధించి సీసీఐ వివరణాత్మక ఆదేశాలు వెలువడాల్సి ఉంది.
****
(Release ID: 1631749)
Visitor Counter : 246