భారత ఎన్నికల సంఘం

శాసన సభ్యులచే ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఉప ఎన్నిక - పోలింగు తేదీ 06-07-2020

Posted On: 15 JUN 2020 2:39PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శాసనసభ సభ్యుల ద్వారా ఎన్నుకునే ఒక సాధారణ ఖాళీ ఉంది. 

ఖాళీ యొక్క వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

సభ్యుని పేరు 

ఎన్నిక విధానం 

ఖాళీ అవడానికి కారణం 

పదవీ కాలం గడువు 

శ్రీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ 

ఎమ్మెల్యే ల ద్వారా 

రాజీనామా చేసిన  తేదీ 09.03.2020

29.03.2023 వరకు 

 

ఆంధ్రప్రదేశ్ సి.ఈ.ఓ., నుండి సమాచారం  స్వీకరించిన అనంతరం, పైన పేర్కొన్న ఖాళీని భర్తీ చేయడానికి శాసనసభ సభ్యుల ద్వారా, ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఈ క్రింది షెడ్యూల్ ప్రకారం, ఉప ఎన్నిక నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది: -

క్రమ సంఖ్య 

విషయము  తేదీలు 

1.     

ప్రకటన జారీ 

18 జూన్, 2020 (గురువారం)

2.     

నామినేషన్ల దరఖాస్తుకు ఆఖరి తేదీ 

25 జూన్, 2020 (గురువారం)

3.     

నామినేషన్ల పరిశీలన 

26 జూన్, 2020 

(శుక్రవారం)

4.     

నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ.

29 జూన్, 2020

(సోమవారం)

5.     

పోలింగు తేదీ 

06 జులై, 2020

(సోమవారం)

6.     

పోలింగు సమయం 

ఉదయం 

9:00 గంటల నుండి సాయంత్రం

04:00 గంటల వరకు 

7.     

ఓట్ల లెక్కింపు 

06 జులై, 2020

(సోమవారం)

సాయంత్రం

05:00 గంటలకు 

8.     

ఎన్నికల ప్రక్రియ 

పూర్తి కావలసిన గడువు తేదీ 

08 జులై, 2020

(బుధవారం)

                                                                   

స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలను నిర్ధారించడానికి పరిశీలకులను నియమించడం ద్వారా ఎన్నికల ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలి.

ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసే సమయంలో కోవిడ్-19 నియంత్రణ చర్యలకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సూచనలు పాటించేలా చూడడానికి రాష్ట్రానికి చెందిన ఒక సీనియర్ అధికారిని నియమించాలని కూడా  కమిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

*****



(Release ID: 1631659) Visitor Counter : 246