వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఈ-నామ్ ప్లాట్‌ఫారమ్ లను బలోపేతం చేయడం, 10 వేల ఎఫ్.పి.ఒల ఏర్పాటు కీలక బాధ్యత స్మాల్‌ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం (ఎస్ఎఫ్ఎసి)పై ఉందన్న కేంద్ర వ్యవసాయ , రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్.
ఎస్.ఎఫ్.ఎ.సి 19 వ వార్షిక సర్వసభ్యసమావేశం, 24వ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశంలో మాట్లాడుతూ , 1000 మార్కెట్లను ఈ-నామ్‌తో అనుసంధానం చేయడాన్నిఅభినందించిన కేంద్ర మంత్రి శ్రీ తోమర్
ఈ-నామ్ లో రిజిస్టర్ చేసుకున్న1.66కోట్ల మంది రైతులు , 1.30 లక్షల వ్యాపార సంస్థలు
Posted On:
12 JUN 2020 7:44PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని, 10 వేల ఫార్మర్ ప్రోడ్యూసర్ ఆర్గనైజేషన్లు(ఎఫ్.పి.ఒ) వంటి కీలక చర్యలు తీసుకున్నారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఈ లక్ష్యాన్ని నెరవేర్చే బాధ్యత స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం (ఎస్ఎఫ్ఎసి) పై ఉందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఈ నామ్ ప్లాట్‌పారమ్‌ను బలోపేతం చేయడం దీని బాధ్యత అని ఆయన అన్నారు. ఎస్.ఎఫ్.ఎ.సిల ఏర్పాటు తర్వాత సంస్థాగతంగా, ప్రైవేటు పెట్టుబడులు చెప్పుకోదగిన స్థాయిలో పెరిగాయని ఆయన చెప్పారు.
ఎస్ఎఫ్ ఎ సి 24వ మేనేజ్‌మెంట్ బోర్డు , 19 వ వార్షిక సర్వసభ్య సమావేశాలలో మాట్లాడుతూ శ్రీ నరేంద్ర సింగ్ తోమర్, రెండు దశలలో వెయ్యి మార్కెట్‌లను ఈ-నామ్ తో అనుసంధానం చేసినందుకు అధికారులను అభినందించారు. ఈ ప్లాట్‌ఫారమ్ ల ఏర్పాటు లక్ష్యాన్ని పూర్తి చేయాలని అన్నారు. ఇప్పటి వరకు ఈ-నామ్ ప్లాట్‌పాంపై 1 లక్ష కోట్లరూపాయలకుపైగా వ్యాపారం జరిగినట్టు ఆయన చెప్పారు. ఈ-నామ్ ఏర్పడినప్పటి నుంచి 1.66 కోట్లకుపైగా రైతులు, 1.30 లక్షల వ్యాపార సంస్థలు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకున్నట్టు ఆయన చెప్పారు. సంస్కరణల కారణంగా, వ్యవసాయ ఉత్పత్తలు సులభతర అమ్మకం, పారదర్శకత, రైతులు తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర పొందడం, ఈ ప్లాట్‌ఫాం రైతులకు నేరుగా అందుబాటులో ఉండడం వంటి వాటిని అమలు చేయడం ఒక సవాలు వంటిందని ఆయన అన్నారు. లాక్‌డౌన్ సమయంలో కూడా రైతులు ఎంతో నిబద్ధతతో తమ పంట కోత పనులను పూర్తి చేశారని, రాబడి అందుకోవడం కూడా విజయవంతంగా పూర్తికావస్తున్నదని చెప్పారు. ఈ విషయంలో రైతులకు సహాయపడుతున్న ఎస్ఎఫ్ఎసిని తప్పకుండా అభినందించాలన్నారు.
గతంలో ఎస్.ఎఫ్.ఎ.సిలు ,అమలులో ఉన్న పథకాల ఆధారంగా ఎఫ్.పి.ఒలను ఏర్పాటు చేస్తుండేవని, అయితే ఇవాళ సంతోషకరమైన విషయం ఏమంటే, ప్రధానమంత్రిగారు దేశ వ్యాప్తంగా పదివేల ఎఫ్.పి.ఒలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారని ఆయన అన్నారు.ఇది ఈ లక్ష్యానికి మరింత ఊపునిస్తుంది. ఎఫ్.పి.ఒలను కేవలం ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా అవి వాటి లక్ష్యాలను సాధించేలా చూడాలని శ్రీ తోమర్ సూచించారు. రైతులు బృందాలుగా ఏర్పడడం, చర్చించడం, తగినశిక్షణ పొందడం, దిగుబడి పెంచడం, వైవిధ్యంతో కూడిన పంటలు పండించడం, క్రిమిసంహారకాల వాడకాన్ని తగ్గించడం వంటి వాటి విషయంలో వారి బాద్యత మరింత పెరుగుతుందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రధానమంత్రి గారు లక్ష్యం నిర్దేశించారని, ఈ మధ్యలో కోవిడ్ సమస్య వచ్చిపడిందని. అయినా వ్యవసాయ మంత్రిత్వశాఖ, రైతుల పయనం ఏమీ మందగమనంలో ఏమీ లేదని ఆయన అన్నారు.
లాక్‌డౌన్ సమయంలో రైతులు తమ ఉత్పత్తులను రవాణా చేయడంలో ఎదుర్కొనే సమస్యలు తగ్గించడానికి వ్యవసాయ మంత్రిత్వశాఖ అధికారుల సహాయంతో ఎస్.ఎఫ్.ఎ.సి, కిసాన్ రథ్ యాప్‌ను ప్రారంభించినందుకు శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అభినందనలు తెలిపారు.
***
(Release ID: 1631304)
Visitor Counter : 251