హోం మంత్రిత్వ శాఖ

ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూ ప్రకంపనలు: “భయపాడాల్సిన‌ అవసరం లేదు” అని ప్ర‌క‌టించిన నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అధినేత‌


- న్యూఢిల్లీ- ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఇటీవలి భూప్ర‌కంప‌న‌ల నేపథ్యంలో సంసిద్ధత మరియు ప్ర‌మాద తీవ్ర‌త‌ను త‌గ్గించే చ‌ర్య‌లు అవ‌స‌ర‌మ‌ని నొక్కి చెప్పిన ఎన్‌డీఎంఏ

Posted On: 11 JUN 2020 8:55PM by PIB Hyderabad

న్యూఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఇటీవల సంభ‌వించిన ప‌లు భూకంపాలకు సంబంధించి అంత‌గా భయపడాల్సిన అవసరం లేదని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) డైరెక్టర్ డాక్టర్ బి కె బన్సాల్ తెలిపారు. కానీ భూకంప ప్రమాదాన్ని తగ్గించడానికి సంసిద్ధత మరియు త‌గు ఉపశమన చర్యలు చేపట్టడం చాలా అవ‌స‌ర‌మ‌ని  ఆయన నొక్కి చెప్పారు. ఢిల్లీ - ఎన్‌సీఆర్ ప్రాంతంలో భూకంప ప్రమాదాన్ని తగ్గించడానికి వివిధ ఉపశమనం మరియు సంసిద్ధత చర్యలపై చర్చించడానికి జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ (ఎన్‌డీఎంఏ) ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక  సమావేశంలో డాక్టర్ బన్సాల్ పాల్గొని త‌న వివ‌ర‌ణ‌ను వివ‌రించారు. ఢిల్లీ భూకంప చరిత్ర మరియు దాని ప‌రిణామాల‌ను బట్టి చూస్తే, ఢిల్లీ - ఎన్‌సీఆర్‌లో చిన్నపాటి భూకంపాలు సంభవించడం అసాధారణ విష‌య‌మేమి కాదని డైరెక్టర్, ఎన్‌సీఎస్ తెలియజేశారు. ఏదేమైనా, భూకంపాల‌ను దాని స్థానం, సమయం మరియు పరిమాణం పరంగా క‌చ్చితంగా అంచనా వేసే సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో లేద‌ని తెలిపారు.

సమావేశం తరువాత, ఈ క్రింది చర్యలు తీసుకోవాలని ఎన్‌డీఎంఏ ఆయా  రాష్ట్రాలను అభ్యర్థించింది:

- రాబోయే రోజుల్లో చేప‌ట్ట‌నున్న నిర్మాణాలను భూకంప‌ స్థితిస్థాపకంగా చేప‌ట్టాలి.  దీనికి తోడు హాని కలిగించే బిల్డింగ్ స్టాక్‌ల‌ నిర్మాణాల‌ను నివారించేలా త‌గిన నిబంధ‌న‌ల‌తో కూడిన‌ చట్టాలు పాటించేలా
చ‌ర్య‌లు తీసుకోవాలి.

-  హాని కలిగించే ప్రాధాన్యత నిర్మాణాలను గుర్తించ‌డం, మ‌రీ ముఖ్యంగా  లైఫ్‌లైన్ భవనాలను గుర్తించి వాటిని తిరిగి రెట్రోఫిట్ చేయ‌డం.  అవసరమైన చోట దశలవారీగా ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రైవేట్ భవనాలను కూడా రెట్రోఫిట్ చేయ‌డం మేలు.

- భవిష్యత్తులో భూకంపాలను ఎదుర్కోవటానికి గాను క్రమం తప్పకుండా మాదిరి ప్ర‌మాద ఎదుర్కొను
చ‌ర్య‌ల‌ను  (మాక్ వ్యాయామాలు ) నిర్వహించండి. దీనికి తోడు భూకంపం తరువాత తక్షణ ప్రతిస్పందన కోసం నిర్ధారిత ఎస్ఓపీల‌ను అమ‌లులోకి తెచ్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టండి,

- భూకంపాలకు సంబంధించి చేయవలసినవి మరియు చేయకూడని ప‌నుల‌ను గురించి ప్రజలలో త‌గిన అవగాహన కార్యక్రమాలు చేపట్టండి.

ఈ సమావేశంలో వాయిస్ కాన్ఫరెన్సింగ్ (విసి) ద్వారా ఎన్‌డీఎంఏ సభ్యులు,  జాతీయ విపత్తు ప్రతి స్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్‌‌)  డైరెక్టర్ జనరల్,  మ‌రియు  న్యూఢిల్లీ , రాజస్థాన్, హర్యానా మరియు ఉత్తర ప్రదేశ్ యొక్క ఎన్సిటి ప్రభుత్వ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

***



(Release ID: 1631295) Visitor Counter : 181