సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

అన్ని ఈశాన్య రాష్ట్రాలు ఈ – ఆఫీస్ కలిగి ఉండాలి – డాక్టర్ జితేంద్ర సింగ్

ఈ – ఆఫీస్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళేందుకు జాయింట్ స్టీరింగ్ కమిటీ ప్రతిపాదన

Posted On: 12 JUN 2020 5:00PM by PIB Hyderabad

మొత్తం 8 ఈశాన్య రాష్ట్రాల్లో నిర్ణీత కాలపరిమితిలో ఈ-కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర సిబ్బంది, పిజి మరియు పెన్షన్ల శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు సూచించారు. ఈ ప్రాంత ముఖ్యమంత్రులు, ఐటి మంత్రులు హాజరైన ఈ – వెబ్ నార్ ను ఉద్దేశించి ప్రసగించిన ఆయన, ఈ-ఆఫీస్ కనిష్ట ప్రభుత్వ – గరిష్ట పాలన అనే ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ క్రాంతదర్శనాన్ని నిజం చేస్తుందని, అదే విధంగా పరిపాలన, పారదర్శకత మరియు పౌరుల కేంద్రీకృత డెలివరీ విధానం విషయంలో ప్రజలకు సౌలభ్యాన్ని చేకూరుస్తుందని తెలిపారు.

 

షిల్లాంగ్ డిక్లరేషన్ గుర్తి ప్రస్తవించిన డాక్టర్ జితేంద్ర సింగ్, ఈ – ఆఫీస్ ప్రమోషన్ మరియు దాని సేవల నాణ్యత ఎంతో కీలకమైనవని, ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో సివిల్ సెక్రటేరియట్ నుంచి జిల్లా స్థాయి వరకూ అమలు చేయాల్సిన ఈ – ఆఫీస్ మిషన్ ను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు అన్ని సాంకేతిక మరియు ఆర్థిక సహకరాన్ని అందించేందుకు మంత్రి హామీ ఇచ్చారు.

ఈ – ఆఫీస్ ను ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళేందుకు డి.ఓ.ఎన్.ఈ.ఆర్. కార్యదర్శి అధ్యక్షతన జాయింట్ స్టీరింగ్ కమిటీని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. ఏ.ఆర్.పి.జి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఎన్.ఐ.సి, ఎన్.ఈ.సి మరియు మొత్తం 8 ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు ఈ – ఆఫీస్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల సూచన మరియు అమలు చేసే కమిటీలో భాగస్వాములు అవుతారు.

75 కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాల్లో ఈ – ఆఫీస్ పురోగతి డిజిటల్ సెంట్రల్ సెక్రటేరియట్ ఏర్పాటుకు దోహదపడిందని, ఇది కోవిడ్ -19 లాక్ డౌన్ కాలంలో ఇంటి నుంచి పని చేసే పరిస్థితిని నిర్ధారిస్తుందని డాక్టర్ సింగ్ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల సచివాలయాల్లో ఈ – ఆఫీసు అమలు ద్వారా కాగిత రహిత రాష్ట్ర సచివాలయాలను కాలపరిమితిలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇక్కడ అధికారులకు వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ లు, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ లు మరియు తక్కువగా భౌతికంగా కలిసే పరిపాలనను ప్రోత్సహిస్తుందని తెలిపారు.

 

 

ఈశాన్య రాష్ట్రాల ఈ-ఆఫీస్ వర్క్ షాప్ లో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, మేఘాలయ ముఖ్యమంత్రులు, అస్సాం, మణిపూర్, మిజోరాం, త్రిపుర ఐటి మంత్రులు పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, అదనపు ప్రధాన కార్యదర్శులు మరియు పరిపాలనా సంస్కరణల ప్రధాన కార్యదర్శులు మరియు ఐటీ విభాగాల కార్యదర్శులు కూడా వర్క్ షాప్ కు హాజరయ్యారు. ఈ వెబ్ నార్ లో మొత్తం 220 మంది పాల్గొన్నారు.

ముఖ్యమంత్రులు, ఐటీ మంత్రులు తమ ప్రజెంటేషన్ లో నెట్ వర్క్ కనెక్టివిటీ, ఈ – ఫీస్ ప్రాజెక్టును అమలు చేయడానికి నిధుల కొరత వంటి మౌలిక సదుపాయాల గురించి తెలియజేశారు. దీన్ని పూర్తి స్థాయిలో సానుకూల కోణంలో పరిశీలిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు.

తన ప్రారంభ వ్యాఖ్యల్లో డి.ఏ.ఆర్.పి.జి. కార్యదర్శి డాక్టర్ కె.శివాజీ మాట్లాడుతూ, ఈ ఆఫీసును సమర్థవంతంగా అమలు చేయడానికి ఐటీ అవగాహన ఉన్న యువశక్తి అవసరం ఉందని, దీని ద్వారా ఈశాన్య ప్రాంతం మొత్తం ప్రయోజనాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. ఈ వెబ్ నార్ లో కేంద్ర మంత్రి ప్రసంగించడానికి ముందు, డాక్టర్ శివాజీ నిర్మాణాత్మక సాంకేతిక సమావేశాన్ని నిర్వహించారు. డి.ఓ.ఎన్.ఈ.ఆర్. కార్యదర్శి డాక్టర్ ఇందర్ జిత్ సింగ్ మాట్లాడుతూ, ఫైళ్ళ ప్రాసెసింగ్ లో 100 శాతం ఈ – ఆఫీసును అమలు చేసిన డి.ఓ.ఎన్.ఈ.ఆర్. మొదటి భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అని తెలిపారు.

ఈ వర్క్ షాప్ లో డి.ఏ.ఆర్.పి.జి. ఆదనపు కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్, డి.ఏ.ఆర్.పి.జి. సంయుక్త కార్యదర్శి శ్రీమతి జయ దూబే, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

***



(Release ID: 1631250) Visitor Counter : 207