శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

నేచర్‌ ఇండెక్స్‌ 2020లో 30 భారతీయ సంస్థలకు స్థానం, వీటిలో 3 డీఎస్‌టీ సంస్థలు
7వ స్థానంలో ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది కల్టివేషన్ ఆఫ్‌ సైన్స్‌ (ఐఏసీఎస్)
14వ స్థానంలో జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ (జేఎన్‌సీఏఎస్‌ఆర్‌)
30వ స్థానంలో ఎస్‌.ఎన్‌.బోస్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బేసిక్‌ సైన్సెస్‌

Posted On: 11 JUN 2020 3:59PM by PIB Hyderabad

నేచర్‌ ఇండెక్స్‌ 2020 రేటింగ్స్‌లో 30 భారతీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఐఐఎస్‌ఆర్‌లు, పరిశోధన సంస్థలు, ప్రయోగశాలలు చోటు దక్కించుకున్నాయి. వీటిలో, కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, విజ్ఞాన విభాగానికి చెందిన మూడు స్వతంత్ర సంస్థలు కూడా ఉన్నాయి. ఆ మూడు సంస్థలు... కోల్‌కతాలోని ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది కల్టివేషన్ ఆఫ్‌ సైన్స్‌ (ఐఏసీఎస్) - 7వ స్థానం; బెంగళూరులోని జవహర్‌లాల్‌ నెహ్రూ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ (జేఎన్‌సీఏఎస్‌ఆర్‌)- 14వ స్థానం; కోల్‌కతాలోని ఎస్‌.ఎన్‌.బోస్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ బేసిక్‌ సైన్సెస్‌ - 30వ స్థానం. పత్రికల్లో ప్రచురితమైన పరిశోధన వివరాలు, పరిశోధన నాణ్యతను బట్టి నేచర్‌ ఇండెక్స్‌ రేటింగ్‌ ఇస్తారు.
 
    సీఎస్‌ఐఆర్‌ను కూడా తోసిరాజని, నాణ్యమైన రసాయన శాస్త్ర పరిశోధనల్లో, దేశంలోని మూడు అత్యుత్తమ విద్యాసంస్థల్లో ఐఏసీఎస్‌ స్థానం దక్కించుకుంది. లైఫ్‌ సైన్సెస్‌ అంశంలో, విద్యాసంస్థల్లో జేఎన్‌సీఏఎస్‌ఆర్‌ 4వ స్థానం పొందింది. భౌతిక, రసాయన శాస్త్ర పరిశోధల్లో 10వ స్థానంలో, విద్యాసంస్థల్లో 10వ స్థానంలో, ప్రపంచవ్యాప్తంగా 469వ ర్యాంకులో నిలిచింది. 
 
    డీఎస్‌టీకి చెందిన విజ్ఞాన సంస్థలు ఏటా స్థిరంగా అగ్రస్థానాల్లో నిలవడం పట్ల డీఎస్‌టీ కార్యదర్శి ప్రొ.అశుతోష్‌ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. విద్యారంగం, పరిశోధనశాలల్లో జరిగిన పరిశోధనలు మంచి పరిమాణాత్మక వృద్ధిని కనబరిచినప్పటికీ, నాణ్యత, పరమార్థం, అనువాద అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు అర్థమవుతోందని అన్నారు.
     
    ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమంగా నిలిచిన భారతీయ సంస్థలు... కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్) 160వ ర్యాంకు; ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) 184వ ర్యాంకు.
 
    ప్రపంచవ్యాప్త, అంశాలవారీ ర్యాంకులను క్రింది లింక్‌ ద్వారా చూడవచ్చు:
    https://www.natureindex.com/annual-tables/2020/institution/all/all/countries-India

    ఆధారం: నేచర్‌ ఇండెక్స్‌, 2020(Release ID: 1630916) Visitor Counter : 104