శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

వ్యాధికారక సూక్ష్మజీవులను మట్టుబెట్టే బహుళ పొరల యాంటీ మైక్రోబియల్ ఫేస్ మాస్క్!

వైరస్ కలిసిన తుంపరలను నివారించేలా హైడ్రోఫోబిక్ ఉపరితలంతో కూడిన బయటి పొర ఈ మాస్క్ ప్రత్యేకత

Posted On: 10 JUN 2020 7:33PM by PIB Hyderabad

ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కరోనా వైరస్ మహమ్మారిని నిరోధించే టీకాలుగానీ, ఔషధంగానీ అందుబాటులో లేదు. వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి,.. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచుగా సబ్బుతో చేతులు శుభ్రపరుచుకోవడం మాత్రమే మనకున్న తరుణోపాయాలు. కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు ఎలాంటి మాస్క్ వాడాలన్న అంశంపై కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తగిన సిఫార్సులు చేసింది. అయితే, ఎక్కువ కాలం మాస్క్ ధరించడం వల్ల మనకు సరిగా ఊపిరాడని పరిస్థితి ఉంది. మాస్క్ వాడకం కూడా కాస్త కష్టతరంగా, ఇబ్బందికరంగా మారింది.  ఈ సమస్యను పరిష్కరించేందుకు వారణాసిలోని ఐఐటీ (బీహెచ్.యూ) బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన డాక్టర్ మార్షల్,.. ఆయన నాయకత్వంలోని పరిశోధక బృందం ఒక కొత్త తరహా మాస్క్ ను రూపొందించింది. వ్యాధికారక సూక్ష్మజీవులను అంతమొందించే ఐదు పొరల యాంటీ మైక్రోబియల్ మాస్క్ ను వారు తయారు చేశారు. వ్యాధికారక సూక్ష్మ క్రిములను మట్టుబెట్టడంతో పాటుగా, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని కూడా అరికట్టడంలో ఈ ప్రత్యేక మాస్క్  బయటి పొర ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

 “ఇపుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న మాస్క్,..బయటినుంచి నీటి తుంపరల ద్వారా వచ్చే సూక్ష్మక్రిములను (మైక్రోబులను) మన నోటికి, నాసికా రంద్రాలకు చేరకుండా నిరోధిస్తుంది. మాస్క్ ఉపరితలంలో చిక్కుకుపోయిన మైక్రోబులపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపించలేక పోతోందిఅని డాక్టర్ మార్షల్ అంటున్నారు. ఐఐటీ (బీహెచ్.యూ) బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ మార్షల్,..తాము రూపొందించిన బహుళ పొరల యాంటి మైక్రోబియల్ మాస్క్ పై  “ఇండియా సైన్స్ వైర్మ్యాగజైన్ కు వివిరించారు.

 

ప్రస్తుతం వినియోగంలో ఈ మాస్కుల్లోని లోపం వైద్యసిబ్బందికి, పారా మెడికల్ సిబ్బందికి మరీ ప్రమాదకరంగా మారే  ఆస్కారం ఉంది. మాస్క్ బయటి పొరలో వైరస్, బాక్టీరియల్ అవశేషాలు అలాగే ఉండటం వారికి తీరని ముప్పు కలిస్తాయి కాబట్టి వివిధ రకాల రక్షణ పొరలతో డాక్టర్ మార్షల్ బృందం కొత్త తరహా మాస్క్ ను రూపొందించింది. నానో మెటల్, అమీన్ మాట్రిక్స్ ప్రొటాన్లతో ఈ మాస్క్ పొరలను వారు రూపొందించారు.

ఈ మాస్కులో మొదటి పొర ఎలాంటి ఆర్.ఎన్.ఏ.నైనా నిర్వీర్యం చేస్తుంది. తరువాతి పొర సూక్ష్మజీవులను కట్టడి చేస్తుంది. మూడవ పొర గాలిలోని కాలుష్యాన్ని తొలగిస్తుంది. నాలుగవ, ఐదవ పొరలు నోటికి, నాసికా రంద్రాలకు  పూర్తి రక్షణ కల్పిస్తాయి.  “శ్వాస వ్యవస్థను దెబ్బతీసే SARS వైరస్ లు, ఇతర వ్యాధికారక వైరస్ లను నివారించి, వాటిని నిర్వీర్యం చేయడంలో  రాగి, వెండి రేణువులు కీలకపాత్ర పోషిస్తాయి. రాగి, కాపర్ ఆక్సైడ్, వెండి, వెండి మూలకాల మిశ్రమాన్ని తీసుకుని వాటి పైపూతతో ఈ మాస్క్ ను రూపొందించాం. వైరస్ ఆర్.ఎన్.ఏ.ని నిర్వీర్యం చేయడంలో ఇది ఎంతగానో దోహదపడుతోంది.,”  అనిమార్షల్ వ్యాఖ్యానిస్తున్నారు.

వైరస్ ఆర్.ఎన్.ఎ.ని మాస్క్ పొర నిర్వీర్యం చేస్తుందా లేదా? అన్న అంశాన్ని తేల్చుకునేందుకు పరిశోధకులు ఊపిరితిత్తుల కణాలపై పరీక్ష చేశారు. కరోనా వైరస్ ఊపిరితిత్తుల కణాలపైనే దాడి చేస్తుంది కాబట్టి వారీ పరీక్ష జరిపారు. “ఊపిరితిత్తుల్లో కేన్సర్ సోకిన కణాలను, కేన్సర్ సోకని కణాలను కూడా మేం పరీక్షకు తీసుకున్నాం. వైరస్ ఆర్.ఎన్.ఏ.ని క్షీణింపజేయడంలో మేం వాడే మూలకాలు ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయన్నది పరీక్షించాం. మూలకాల ద్రావణ రూపంలో, పూత రూపంలో ఎంత ప్రభావం చూపుతాయో పరీక్షల ద్వారా నిర్ధారించుకున్నాం.,”  అని పరిశోధకులు చెప్పారు. ఈ మాస్క్ బయటి పొరకు తుంపరలకు పారదోలే ప్రత్యేకమైన హైడ్రోఫోబిక్ ఉపరితలాన్ని ఏర్పాటు చేశారు. ఇంతటి ప్రత్యేకమైన కొత్త తరహా మాస్కులపై టెంట్ హక్కులకోసం ఇప్పటికే దరఖాస్తు కూడా చేశారు.(Release ID: 1630806) Visitor Counter : 160