జల శక్తి మంత్రిత్వ శాఖ

2020-21కి గాను మధ్యప్రదేశ్ లో జల్ జీవన్ మిషన్ అమలు కోసం 1,280 కోట్ల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపిన భారత ప్రభుత్వం

Posted On: 10 JUN 2020 6:03PM by PIB Hyderabad

జల్ శక్తి మంత్రిత్వ శాఖ, తాగునీరు మరియు పారిశుద్ధ్య కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన జాతీయ కమిటీ పరిశీలన మరియు ఆమోదం కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రం 2020-21 ఏడాదికి గాను వార్షిక ప్రణాళికను సమర్పించింది. రాష్ట్రాల భాగస్వామ్యంతో జల్ శక్తి మంత్రిత్వ శాఖ అమలు చేసిన జల్ జీవన్ మిషన్ (జె.జె.ఎం) 2014 నాటికి దేశంలోని గ్రామాల్లోని ప్రతి గృహానికి క్రమబద్ధమైన మరియు దీర్ఘకాలిక ప్రాతిపదికన సూచించిన నాణ్యమైన తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ మౌలిక సదుపాయాల కల్పన మీద కాకుండా, సర్వీస్ డెలివరీ మీద దృష్టి పెడుతుంది.

2019 ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఈ మిషన్ ను ప్రకటించారు. గ్రామీణ ప్రజల జీవితాల్లో మెరుగుదలను తీసుకురావటం, అదే విధంగా గ్రామీణ మహిలలు ముఖ్యంగా బాలికల మీద పడుతున్న అదనపు భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ మిషన్ తాగునీటి రంగంలో సంస్కరణలు తీసుకురావాలని ఆశిస్తోంది. ఈ పరివర్తన కార్యక్రమానికి 3.60 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించడం జరిగింది.

ఇందులో భాగంగా 2020-21లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ అమలు కోసం భారత ప్రబుత్వం 1,280 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. ఖర్చు చేయని బ్యాలెన్స్ గా 244.95 కోట్ల రూపాయాలు మరియు ఈ ఏడాది కేంద్ర కేటాయింపుతో సరిపోయే రాష్ట్ర వాటాతో, ఈ సంవత్సరం 3,093 కోట్లు రాష్ట్రానికి అందుబాటులో ఉంటాయి.

ఉన్నతమైన మార్పు దిశగా నడుస్తున్న ఈ మిషన్ కింద, మధ్యప్రదేశ్ 2023-24 నాటికి 100 శాతం పని చేసే గృహ వినియోగ ట్యాప్ వాటర్ కనెక్షన్ (ఎఫ్.హెచ్.టి.సి) కలిగి ఉండాలని యోచిస్తోంది. రాష్ట్రంలోని 1.21 కోట్ల గ్రామీణ గృహాల్లో 13.52 లక్షల కుటుంబాలకు ఇప్పటికే ట్యాప్ కనెక్షన్లు ఉన్నాయి. 2020-21లో గ్రామీణ ప్రాంతాల్లోని 26.27 లక్షల గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించాలని రాష్ట్రం యోచిస్తోంది. గృహాల సార్వత్రిక కవరేజ్ కోసం ప్రణాళికలు వేస్తున్నప్పుడు నీటి కొరత ఉన్న ప్రాంతాలు, నాణ్యత ప్రభావిత ప్రాంతాలు, ఎస్సీ / ఎస్టీ ఆధిపత్య నివాసాలు / గ్రామాలు, ఆశాజనక జిల్లాలు మరియు సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజన గ్రామాలకు, ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.

నీటి నాణ్యత – ప్రభావిత ఆవాసాలకు తాగునీటి సరఫరా జె.జె.ఎం. కింద ప్రధానం మరియు గృహ ట్యాప్ కనెక్షన్లు మరియు కమ్యూనిటీ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లను అందించటం ద్వారా ఈ తరహా 395 ఆవాసాల్లో తాగు నీటిని అందించాలని రాష్ట్రం భావిస్తోంది.

రాజ్యాంగం యొక్క 73 సవరణ యొక్క నిజమైన స్ఫూర్తిని అనుసరించి, స్థానిక గ్రామ సంఘం / గ్రామ పంచాయతీలు / వినియోగదారు సమూహాలు గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థల ప్రణాళిక, అమలు, నిర్వహణ, ఆపరేషన్ లో తాగు నీటి భద్రతను, దీర్ఘకాలిక సుస్థిరతను సాధించే సంకల్పంతో పాల్గొంటున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు ప్రణాళిక, అమలు మరియు వారి కోసం ఉద్దేశించిన నీటి సరఫరా పథకాల నిర్వహణ మరియు నిర్వహణలో చురుగ్గా పాల్గొనేందుకు సమాజ సమీకరణ కోసం ముందుకు తీసుకు వచ్చేందుకు  అన్ని గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ ను ప్రజల ఉద్యమంగా మార్చేందుకు కమ్యూనిటీ సమీకరణతో పాటు ఐ.ఈ.సి. ప్రచారం చేపట్టాల్సి ఉంది.

జల్ జీవన్ మిషన్ కింద, ముందు వరుస కార్యకర్తలు చురుగ్గా పాల్గొనటం ద్వారా సమాజంలో ఉండే వీరి ద్వారా నీటి నాణ్యత పర్యవేక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అనగా ప్రతి గ్రామంలో 5 మందికి ముఖ్యంగా మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తున్న నీటి నాణ్యతను పరీక్షించేందుకు ఫీల్డ్ టెస్ట్ కిట్లను ఉపయోగించే దిశగా ప్రోత్సహిస్తున్నారు. ప్రతి మూలాన్ని ప్రతి సంవత్సరం భౌతిక మరియు రసాయన పారామితుల కోసం, అలాగే రెండు సార్లు బాక్టీరియా కాలుష్యం తెలుసుకునేందుకు పరీక్షించాల్సిన అవసరం ఉంది.

ప్రతి గ్రామ పంచాయితీలో జి.పి. లేదా వారి ఉపకమిటీ అంటే గ్రామ స్థాయిలో ప్రణాళిక కోసం గ్రామ నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ లేదా పానీ సమితులు ఏర్పాటు చేయటం జరిగింది. గ్రామాల గ్రామ కార్యాచరణ ప్రణాళికల ఆధారంగా రాష్ట్రానికి వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశారు. ఎం.జి.ఎన్‌.ఆర్‌.ఈ.జి.ఎస్, గ్రామీణ స్థానిక సంస్థలకు 15 వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, ఎస్‌.బి.ఎం, కాంపా, జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి, లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ఫండ్ మొదలైన వివిధ వనరుల నుంచి నిధుల కలయికను రాష్ట్రం నిర్ధారించవచ్చు. వీటిలో నీటి వనరుల బలోపేతం, అక్విఫర్ రీఛార్జ్, మట్టి నీటి నిర్వహణ మొదలైనవి ఉన్నాయి.

ప్రస్తుతం కోవిడ్ – 19 మహమ్మారి నేపథ్యంలో గ్రామీణ గృహాల్లో ప్రాధాన్యత ప్రాతిపదికన ట్యాప్ కనెక్షన్లను అందించటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తద్వారా గ్రామీణ ప్రజలు స్టాండ్ పోస్ట్ ల నుంచి నీటిని తీసుకురావటం మరియు దీర్ఘ కాలంలో క్యూలో నిలబడటం వంటి కష్టాలను ఎదుర్కోవలసిన అవసరం లేదు. సమాజంలోని పేద మరియు అట్టడుగు వర్గాలు తమ ఇంటి ప్రాంగణంలో ట్యాప్ కనెక్షన్ల ద్వారా నీటిని పొందాలని, అదే విధంగా స్టాండ్ పోస్ట్ లకు వెళ్ళకుండా మరియు భౌతిక దూరాన్ని పాటించాలని, తద్వారా గ్రామీణ వర్గాలు ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.

వేసవి పూర్తి స్థాయిలో ఉండటంతో పాటు రుతుపవనాలు వేగంగా సమీపిస్తున్న తరుణంలో కోవిడ్ -19 మహమ్మారితో దేశం సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు జీవనోపాధి కల్పించటం మరింత ఆవశ్యకం. ఈ వలస కార్మికులు ప్రాథమికంగా నైపుణ్యం మరియు సెమీ స్కిల్ కలిగిన వారు. ప్రతి గ్రామంలో నీటి సరఫరాకు సంబంధించిన ఉద్యోగాలు, ముఖ్యంగా ప్లంబింగ్, ఫిట్టింగ్, నీటి సంరక్షణ పనులు మొదలైన వాటి ద్వారా గ్రామాల్లో వీరి సేవలను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. వీరి సహకారం వ్యవసాయానికి నీటి లభ్యత మరియు ప్రతి గ్రామీణ గృహానికి తాగునీటిని అందించటంలో సహాయపడుతుంది.

 

***


(Release ID: 1630728) Visitor Counter : 268