వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్రపంచ అక్రిడిటేషన్ డే 2020ను నిర్వహించిన క్యూ.సి.ఐ.

ఆహార భద్రతను మెరుగుపరిచే దిశగా విశ్వసనీయమైన, సమర్థవంతమైన గుర్తింపు యొక్క పాత్రను ప్రముఖంగా ప్రస్తావన

Posted On: 10 JUN 2020 11:37AM by PIB Hyderabad

వ్యాపార మరియు ఆర్థిక రంగాల్లో అక్రిడిటేషన్ పాత్ర ప్రాధాన్యత పెంచేందుకు, ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం జూన్ 9న ప్రపచం అక్రిడిటేషన్ డే (డబ్లూ.ఏ.డి) జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ అక్రిడిటేషన్ ఫోరమ్ (ఐ.ఏ.ఎఫ్) మరియు ఇంటర్నేషనల్ లాబొరేటరీ అక్రిడిటేషన్ కో ఆపరేషన్ (ఐ.ఎస్.ఏ.సి) నిర్ణయించిన విధంగా డబ్లూ.ఏ.డి – 2020 సంబంధించిన ఈ ఏడాది నేపథ్యం “అక్రిడిటేషన్ - ఆహార భద్రత మెరుగుదల

క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూ.సి.ఐ) యొక్క రెండు అక్రిడిటేషన్ బోర్డులు, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ సర్టిఫికేషన్ బాడీస్ (ఎన్.ఏ.బి.సి.బి) మరియు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (ఎన్.ఏ.బి.ఎల్) ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక వెబ్ నార్ ను ఏర్పాటు చేశాయి. ఇందులో సంబంధిత వాటాదారులందరూ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రారంభంలో ఉపన్యసించిన ముఖ్య అతిథి, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. ఛైర్ పర్సన్ శ్రీమతి రీటా టీయోటియా మాట్లాడుతూ, నిర్ణయం తీసుకోవటంలో ఇన్ పుట్ ల కోసం విశ్వసనీయమైన, సమర్థవంతమైన అక్రిడిటేషన్ పాత్రను ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. గుర్తించిందని తెలిపారు. గుర్తింపు పొందిన అనుగుణత అంచనా సంస్థల ద్వారా అందించే డేటా దృఢమైనది, నమ్మదగినది. అదే సమయంలో సమ్మతి పరీక్ష, ప్రమాణాల అమరిక అని నిర్ధారించేందుకు ప్రభుత్వం మరియు నియంత్రించే వారికి మద్ధతు అందించేందుకు ఎన్.ఏ.బి.సి.బి మరియు ఎన్.ఏ.బి.ఎల్. కలిసి పని చేశాయని, ఈ అక్రిడిటేషన్ ప్రపంచ వాణిజ్యం మరియు ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఎన్.ఏ.బి.సి.బి మరియు ఎన్.ఏ.బి.ఎల్.లతో కలిసి ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ  పని చేస్తున్న వివిధ విభాగాల గురించి కూడా ప్రస్తావించిన ఆమె, ఇది ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నియంత్రణ భారాన్ని పంచుకునేందుకు వీలు కల్పిస్తుందని, అదే విధంగా గుర్తింపు పొందిన అనుగుణత అంచనా సంస్థల సేవలను ఉపయోగించి సమ్మతి పర్యవేక్షణలో సహాయపడుతుందని తెలిపారు. వర్చువల్ అసెస్ మెంట్స్ ను సంస్థాగతీకరించాల్సిన అవసరం, రాష్ట్ర ఆహార పరీక్ష ప్రయోగశాలల గుర్తింపు, ప్రాఫిషియెన్సీ టెస్టింగ్ (పి.టి) చేపట్టేందుకు గుర్తింపు పొందిన ప్రయోగశాలలను ప్రోత్సహించటం, గుర్తింపు పొందిన రిఫరెన్స్ మెటీరియల్స్ ప్రొడ్యూసర్స్ (ఆర్.ఎం.పి) సంఖ్యను పెంచటం, రాపిడ్ ను అభివృద్ధి చేయటం వంటి అనేక రంగాలను ఆమె తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ఆహార విశ్లేషణ కోసం టెస్ట్ కిట్లు మరియు దాని ధృవీకరణ కోసం ఒక అక్రిడిటేషన్ పథకం ఆహార రంగానికి సంబంధించిన సమగ్ర మార్పిడి కోసం ఒక సమగ్ర వ్యవస్థ.

ఆహార భద్రత దేశంలోని ప్రజలందరి హక్కు అని, ఈ విషయంలో గత కొన్నేళ్ళుగా ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ, గణనీయమైన కృషి చేసిందని డి/ ఓ. ఆహారం మరియు పౌర సరఫరాల కార్యదర్శి శ్రీ సుదాన్షు పాండే తెలిపారు. వాణిజ్య విభాగం నిర్వహించిన 6 జాతీయ స్టాండర్డ్స్ కాన్ క్లేవ్ లు నాణ్యమైన పర్యావరణ వ్యవస్థను పెంచటంలో మరియు దేశంలోని సంబంధిత వాటాదారులను దీని పట్ల స్పందించే విధంగా మార్చటంలో ఎంతో సహాయ పడ్డాయని ఆయన తెలిపారు. నాణ్యమైన పర్యావరణ వ్యవస్థలో అక్రిడిటేషన్ కు చాలా ముఖ్యమైన పాత్ర ఉందని, దానికి మద్దతుగా నాణ్యమైన ప్రచారాన్ని చేపట్టాలని క్యూ.సి.ఐ.ని కోరారు. దేశంలో అనుగుణత అంచనా మౌలిక సదుపాయాల అభివృద్ధి, వినియోగదారుల సాధికారత అవసరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు.

 

            

శ్రీమతి రీటా టీయోటియా, చైర్‌పర్సన్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ               శ్రీ సుధాన్షు పాండే, కార్యదర్శి (ఎఫ్ అండ్ పిడి)

      

క్యూ.సి.ఐ. ఛైర్మన్ శ్రీ ఆదిల్ జైనుల్ భాయ్ తన ప్రధాన ప్రసంగంలో భాగంగా నాణ్యతను మెరుగుపరచటంలో అక్రిడిటేషన్ ఒక ముఖ్యమైన సాధనం అని నొక్కి చెప్పారు. అయితే దీని అంతిమ లక్ష్యం ఆహార రంగాలతో పాటు ఇతర రంగాల్లో ఉత్పత్తి మరియు సేవల నాణ్యతను మెరుగు పరచటం అని, భారత దేశంలో ఆహార సేవల్లో నాణ్యతను మెరుగు పరచటంలో సహాయపడే సామర్థ్యం మరియు స్థాయిని పెంచాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

 

ఈ సందర్భంగా క్యూ.సి.ఐ. సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆర్.పి.సింగ్ మాట్లాడుతూ, భవిష్యత్తు కోసం ఆరు పాయింట్ల కార్యక్రమ అవసరాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనుగుణత అంచనా వ్యవస్థను పెంచటం, సాజా నివేష్ – సాజా వికాస్ – సాజా విశ్వాస్ దిశగా మరింత ముందుకు సాగేందుకు ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. యొక్క పి.పి.పి.  మోడల్ కు ప్రోత్సాహం అందించడం, ప్రపంచమంతా అంగీకరించిన విధంగా భారతదేశంలో సర్టిఫైడ్ దిశలో పని చేయడం, అనధికారికి మార్కెట్ ఫార్మలైజేషన్ లాంటివి ఇందులో ఉన్నాయి. రాష్ట్రీయ గుణవత అభియాన్ ను ప్రారంభించడం మిగతా రెండు అంశాల్లో ఒకటి. ఇది డబుల్ బ్లైండ్ సిస్టమ్ ద్వారా స్థానిక మార్కెట్ లో నాణ్యతలో సమస్యలను తనిఖీ చేసేందుకు అదే విధంగా ఒకే ఈ – ప్లాట్ ఫామ్ పై అన్ని రెగ్యులేటర్లతో బలమైన మార్కెట్ పర్యవేక్షణ, ఇక రెండోది రాపిడ్ అలర్ట్ సిస్టమ్ అభివృద్ధి చేసేందుకు క్రౌడ్ సోర్సింగ్ కు సహాయం అందించటం.

 


(Release ID: 1630706) Visitor Counter : 314