రక్షణ మంత్రిత్వ శాఖ
మిషన్ సాగర్‌లో భాగంగా విక్టోరియా పోర్టుకు చేరుకున్న ఐఎన్‌ఎస్ కేసరి
భారత్ తరపున సీషెల్స్‌కు కొవిడ్ అత్యవసర ఔషధాల సాయం
రెండు దేశాల ప్రతినిధుల సమక్షంలో ఔషధాల అప్పగింత
Posted On:
07 JUN 2020 8:21PM by PIB Hyderabad
మిషన్ సాగర్‌లో భాగంగా, భారత నౌకాదళ ఓడ ఐఎన్‌ఎస్ కేసరి, సీషెల్స్ రాజధాని విక్టోరియాలోని రేవుకు చేరింది. కొవిడ్‌పై పోరాడుతున్న మిత్రదేశాలకు భారత ప్రభుత్వం సాయం అందిస్తోంది. ఇందులో భాగంగానే, కొవిడ్‌ను కట్టడిచేసే అత్యవవసర ఔషధాలను తీసుకుని ఐఎన్‌ఎస్ కేసరి విక్టోరియా రేవుకు చేరుకుంది.
విక్టోరియా రేవులో అధికారిక లాంఛనాలతో భారత ప్రభుత్వం, సీషెల్స్ ప్రభుత్వానికి ఔషధాలను అందించింది. సీషెల్స్ తరపున ఆ దేశ విదేశీ వ్యవహారాల సెక్రటరీ బారీ ఫౌర్, ఆరోగ్య శాఖ సెక్రటరీ పియరీ లాయిడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీషెల్స్‌లో భారత హై కమిషనర్ జనరల్ దర్బీర్ సింగ్ సుహాంగ్, హెచ్‌సీఐ రెండో సెక్రటరీ అశ్విన్ భాస్కరన్ భారత్ తరపున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొవిడ్‌పై పోరాడుతున్న ఇరుదేశాల మధ్య అద్భుతమైన సంబంధాలను మిషన్ సాగర్ పెంపొందిస్తోంది. ప్రధాని శ్రీ నరేంద్రమోదీ విజన్ అయిన "సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్" (సాగర్)కు ఈ సాయం నిదర్శనంగా నిలుస్తుంది. ఇండియన్ ఓషన్ రిమ్ (ఐఓఆర్) దేశాలకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను స్పష్టీకరిస్తుంది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఇతర సంస్థల సహకారంతో ఔషధ వితరణ కార్యక్రమం సాగింది.
(Release ID: 1630374)
Visitor Counter : 250