సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

జమ్ము లో క్యాట్ బెంచ్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

సర్వీస్ వ్యవహారాలను త్వరితగతిన పరిష్కరిస్తూ జమ్ము కశ్మీర్, లడాఖ్ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించనున్న ట్రిబ్యునల్

Posted On: 08 JUN 2020 4:19PM by PIB Hyderabad

ఈశాన్య ప్రాంతం (డిఓఎన్ఈఆర్), పిఎంఓ, సిబ్బంది, ప్రజాసమస్యలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష శాఖల సహాయ (ఇండిపెండెంట్) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఈ రోజు జమ్ము కశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి 18వ బెంచిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. క్యాట్ ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారాలే విచారించి పరిష్కరిస్తాయి కాబట్టి మిగిలిన న్యాయస్థానాలపై కేసుల భారం తగ్గుతుందని కేంద్ర మంత్రి అన్నారు. అంతే కాకుండా బెంచ్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలు, సమస్యలు త్వరితగతిన ఒక కొలిక్కి వస్తాయని ఈ సందర్బంగా మాట్లాడుతూ చెప్పారు. మోడీ ప్రభుత్వం అందరికీ న్యాయం, పారదర్శక పాలనకు కట్టుబడి ఉందని, గడచినా ఆరేళ్లలో ప్రజల శ్రేయస్సు కోరే సంస్కరణలు ముఖ్యంగా జమ్ము కశ్మీర్ ప్రజలకు అనేక కార్యక్రమలు అమలు చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. 370, 35ఏ  అధికరణలను గత ఏడాది ఆగస్టు 5న రద్దు చేశాక దేశవ్యాప్తంగా వినియోగంలో ఉన్న సుమారు 800 కేంద్ర చట్టాలు జమ్ము కశ్మీర్ కి వర్తించి ప్రజలకు ఎంతో ప్రయోజనకారిగా నిలుస్తున్నాయని ఆయన వెల్లడించారు.  30,000 వరకు పెండింగ్ లో ఉన్న కేసులను న్యాయబద్ధంగా నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కారం అవుతాయని డాక్టర్ జితేంద్ర ప్రసాద్ తెలిపారు. 

ముఖ్యమైన మూడు సంస్థలు క్యాట్ , సిఐసి, సీవీసీ కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్ము కశ్మీర్, లడాఖ్ లో ఇపుడు పనిచేస్తున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. 

 

 

ఈ కార్యక్రమంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. జమ్ము కశ్మీర్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జస్టిస్ గీత మిట్టల్, లెఫ్టనెంట్ గవర్నర్ శ్రీ గిరీష్ చంద్ర ముర్ము కూడా ప్రసంగించారు. క్యాట్ సభ్యుడు (జ్యూడిషియల్) శ్రీ రాకేష్ సాగర్ వందన సమర్పణ చేశారు. 

                                                                  <><><>



(Release ID: 1630240) Visitor Counter : 225