మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్' ప‌థ‌కం కింద మంజూరైన‌ పనులలో పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర హెచ్ఆర్‌డీ మంత్రి అధ్య‌క్ష‌త‌న సమావేశం

Posted On: 05 JUN 2020 7:03PM by PIB Hyderabad

'ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్'(ఐఓఈ) ప‌థ‌కం కింద మంజూరైన వివిధ పనులలో పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ రమేష్ పోక్రియాల్ నిశాంక్
అధ్య‌క్ష‌త‌న శుక్ర‌వారం ఒక స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ (హెచ్ఆర్‌డీ) స‌హ‌య మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే సహ అధ్యక్షత వహించారు. హెచ్ఈ శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ అమిత్‌ ఖేర్‌, ఐఓఈ జేఎస్ శ్రీ చంద్ర శేఖ‌ర్ కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.
ఎంహెచ్ఆర్‌డీ బ్యూరో అధినేత‌లు, వివిధ సంస్థ‌లకు చెందిన డైరెక్ట‌ర్లు మ‌రియు ఐఓఈల వైస్ ఛాన్స‌ల‌ర్లు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ విధానంలో ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. 'ది ఆసియా ర్యాంకింగ్స్‌'లో మొదటి 100 స్థానాల్లో నిలిచిన ఐఐఎస్‌సీ బెంగళూరు మరియు ఇతర ఐఐటీలను కేంద్ర మంత్రి ఈ స‌మావేశంలో అభినందించారు. ర్యాంకింగ్స్‌ను మెరుగుపరిచేందుకు ఇతరులను అనుకరించాలని, పోటీపడాలని ఆయన ఇతర సంస్థలకూ సూచించారు. న‌వ‌ భారతదేశాన్ని నిర్మించాలన్న ప్రధాన మంత్రి కలను నిజం చేయడానికి సంస్థలు తీవ్రంగా కృషి చేయాలని శ్రీ నిశాంక్ కోరారు.
https://twitter.com/DrRPNishank/status/1268885313591447552?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1268885313591447552&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D1629676


వివిధ సంస్థలు అవగాహనను ఎలా మెరుగుపరుచుకోవాలనే విష‌య‌మై ఐఐటీల డైరెక్టర్లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయవచ్చ‌ని త‌ద్వారా అంతర్జాతీయ ర్యాంక్‌‌ను ఎలా మెరుగుపరుచుకోవాలో సూచించ‌గ‌ల‌ద‌ని మంత్రి చెప్పారు. 'బ్రాండ్ బిల్డింగ్ ఆఫ్ ది స్టడీ ఇన్ ఇండియా పథకం' కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయన అన్నారు. ఐఓఈలు, హెచ్ఈఎఫ్ఏ పనులను 15 రోజుల్లో పర్యవేక్షించడానికి ఎంహెచ్‌ఆర్‌డీలో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ ఒక దానిని ఏర్పాటు చేయాలని మంత్రి ఈ స‌మావేశంలో తెలిపారు. ఐఓఈలకు చెందిన వివిధ పబ్లిక్ ఇన్‌స్టిట్యూట్‌ల‌కు ఎంహెచ్ఆర్‌డీ నుంచి క‌మిట్‌మెంట్ లెట‌ర్లు జారీ చేయ‌నున్న‌ట్టు మంత్రి హామీ ఇచ్చారు. అవ‌గాహ‌న ఒప్పందం మేర‌కు ఆయా సంస్థ‌లు చేస్తున్న ఖ‌ర్చుకు త‌గ్గ‌ట్టుగా త‌గిన నిధులు విడుద‌ల చేయ‌బ‌డుతాయ‌న్న హామీతో ఈ లేట‌ర్లు జారీ చేయ‌నున్న‌ట్టుగా మంత్రి అన్నారు. నిర్మాణ కార్య‌క‌లాపాలు ఇప్పుడు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో కోవిడ్ -19 కార‌ణంగా నిలిచిపోయిన ప‌నుల‌ను వేగవంతం చేయాల‌ని ఆయన కోరారు. ప్రతి విద్యా సంస్థ మూడు సంవత్సరాల విజ‌న్ డాక్యుమెంట్‌ను తయారు చేసి సంకలనం కోసం ఎంహెచ్‌ఆర్‌డీకి పంపాల‌ని
శ్రీ నిశాంక్ తెలియ‌జేశారు. వివిధ సంస్థలలో పరిశోధన మరియు ఆవిష్కరణలకు సంబంధించిన అంశాల‌ను వివిధ విద్యా సంస్థల నుండి పొందవచ్చ‌ని విస్తృత ప్రచారం మరియు వ్యాప్తి కోసం 'యుక్తి' పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల‌ని అన్నారు. ముసాయిదా ఎంఓయు, ప్రైవేటు సంస్థల తనిఖీకి సంబంధించిన ప‌లు అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చించబడ్డాయి. 

 (Release ID: 1629778) Visitor Counter : 50