విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఆరోగ్యకరమైన, ఇంధన సామర్థ్యం గల భవనాల చొరవను ప్రకటించిన ఈఈఎస్ఎల్, యుఎస్ఐడి

Posted On: 05 JUN 2020 3:31PM by PIB Hyderabad

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా కేంద్ర విద్యుత్ శాఖ కింద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలతో కలిసి పనిచేస్తున్న ఎనర్జీ ఎఫిసిఎన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్), యు.ఎస్. ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యుఎస్ఎయిడ్) ఉమ్మడిగా మైత్రీ కార్యక్రమం చేపట్టాయి. ఇవి ఆరోగ్యకరం, ఇంధన సామర్థ్య భవనాల చొరవతో కార్యస్థానాలను ఆరోగ్యకరంగా, హరితవర్ణ పూరితంగా ఉంచాలన్నది లక్ష్యం. 

ఈ ప్రయత్నం ప్రారంభించిన మార్కెట్ ఇంటిగ్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఫర్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ (మైత్రీ), విద్యుత్ మంత్రిత్వ శాఖ, యుఎస్ఎయిడ్ మధ్య యుఎస్-ఇండియా ద్వైపాక్షిక భాగస్వామ్యంలో ఒక భాగం. తక్కువ ఖర్చుతో ఇంధన వినియోగం చర్యలను వేగవంతం చేసి, భవనాలలో ప్రామాణికమైన విధానాలు ప్రత్యేకంగా శీతలీకరణ ఏర్పాట్లను దృష్టిలో పెట్టుకుని చేపట్టాలన్నది ప్రధాన లక్ష్యం. 

ప్రయోగాత్మకంగా ఈఈఎస్ఎల్ ఈ చొరవను ప్రారంభించి, తమ కార్యాలయాలలోనే ప్రారంభించనున్నది. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ కుమార్ మాట్లాడుతూ, ఈ చొరవ ఇప్పటికే ఉన్న భవనాలు, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలను తిరిగి మార్చడం సవాళ్లను పరిష్కరిస్తుంది, తద్వారా అవి ఆరోగ్యకరమైనవి మరియు ఇంధన పొదుపు సామర్థ్యం కలిగి ఉంటాయి. ప్రయోగాత్మక ప్రయత్నం ఇతర భవనాలు ఆరోగ్యంగా మరియు ఇంధన సామర్థ్యంగా ఉండటానికి తగిన చర్యలు తీసుకోవడానికి మార్గం సుగమం చేస్తాయని మేము ఆశిస్తున్నాము. ఎప్పటిలాగే, మా పని ప్రజల కోసం మరియు ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం, యూఎస్ఎయిడ్ తో భాగస్వామ్యం దాన్ని పెంచడానికి సహాయపడుతుంది ” అని అన్నారు. 

పేలవమైన గాలి నాణ్యత భారతదేశంలో కొంతకాలంగా ఆందోళన కలిగిస్తుంది, కొవిడ్  మహమ్మారి వెలుగులోకి రావడంతో ఈ పరిణామం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రజలు తమ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలకు తిరిగి వచ్చేటప్పుడు, నివాస సౌకర్యం, ఉత్పాదకత పెంచే వాతావరణం ఉండడానికి, మొత్తం ప్రజారోగ్యానికి మంచి ఇండోర్ గాలి నాణ్యతను కాపాడుకోవడం చాలా అవసరం. భారతదేశంలో చాలా భవనాలు ఆరోగ్యకరమైన ఇండోర్ గాలి నాణ్యత కొరత ఉంది. వాటిని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. 

 

ఇంధన పొదుపు, సామర్థ్యం పెంపు పర్యావరణ పరిరక్షణకు ఈఈఎస్ఎల్ కార్యాలయం చేపట్టిన ఈ ప్రయత్నం భవిష్యత్ లో దేశంలోని వివిధ భవనాలు ఎదుర్కొంటున్న ఎటువంటి సమస్యలకు ఒక పరిష్కారం చూపుతాయి. 

ఇండియాకు యుఎస్ఎయిడ్  ఆపద్ధర్మ మిషన్ డైరెక్టర్ రామోనా ఎల్ హమ్జౌయి మాట్లాడుతూ, “యుఎస్ఎయిడ్ - ఈఈఎస్ఎల్ తో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉంది. ఢిల్లీ లోని తన సొంత కార్యాలయంలో ఈ ఆలోచనను మొదటిసారిగా అమలు చేయడం ద్వారా ఈఈఎస్ఎల్ ముందడుగు వేసింది. ఈ భాగస్వామ్యం భవనాలలో గాలి నాణ్యత మరియు ఇంధన వినియోగ సమస్యలను పరిష్కరిస్తుంది - భారతదేశం మరియు దక్షిణ ఆసియాలోని పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది.” శ్రీ కుమార్ మరియు శ్రీమతి ఎల్ హమ్జౌయి ట్విట్టర్లో పైలట్ ప్రాజెక్ట్  ఎలా పని చేస్తుందో వివరిస్తూ ఉమ్మడి వీడియో సందేశాన్ని విడుదల చేశారు ఉద్యోగులు కార్యాలయానికి తిరిగి రావడం ఎలా సురక్షితంగా ఉంటుందో వీడియోలో వివరించారు. వీడియోను ఇక్కడ చూడవచ్చు https://www.youtube.com/watch?v=NfeZjEQKa-c

 



(Release ID: 1629745) Visitor Counter : 214