గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కోవిడ్ సంక్షోభాన్ని పురస్కరించుకుని మహారాష్ట్రలోని గిరిజనుకు సహాయం చేసేందుకు వినూత్న కార్యక్రమాలతో ముందుకు వస్తున్న వన్ ధన్ వికాస్ కేంద్రాలు
Posted On:
05 JUN 2020 2:40PM by PIB Hyderabad
ట్రై ఫెడ్ (టి.ఆర్.ఐ.ఎఫ్.ఈ.డి), గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన వన్ ధన్ కేంద్రాలు, కోవిడ్ నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గిరిజనులకు జీవనోపాధి కల్పించే దిశగా ముందుకు సాగుతోంది. కోవిడ్ కారణంగా ప్రభావితమైన వర్గాల్లో గిరిజనులు ఒకరు. వారి ఆదాయంలో ఎక్కువ భాగం అడవుల నుంచి సేకరించి వివిధ ఉత్పత్తుల నుంచి వస్తోంది. సాధారంగా వారి సేకరణ ఏప్రిల్ నుంచి జూన్ నెలల మధ్యనే గరిష్టంగా ఉంటుంది.
మహారాష్ట్ర కోవిడ్ తీవ్రతను అధికంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో వన్ ధన్ పథకం సాధిస్తున్న విజయం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. మహారాష్ట్రంలో 50కి పైగా గిరిజన వర్గాలు ఉన్నాయి. వన్ ధన్ బృందం ఈ రేఖకు ముందు నిలబడే దిశగా ముందుకు సాగుతోంది. వారి నిరంతర కార్యక్రమాల ద్వారా వన్ ధన్ బృందం 19,350 గిరిజన ఔత్సాహిక పారిశ్రామికులకు నిరంతరం వివిధ ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి వేదికగా సహకారం అందిస్తోంది.
కోవిడ్ 19 ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అనేక కార్యక్రమాలు జరిగాయి. కాలానుగుణమైన మహువా పువ్వులు మరి గిలో (ఈ ప్రాంతం నుంచి ప్రధాన ఎం.ఎఫ్.పి.లను కలిగి ఉండే)గ్రామం నుంచి గ్రామానికి తేనేటీగల సాగును సులభతరం చేయడానికి స్వయం సహాయక బృందాలకు వడ్డీలేని రుణాల దిశగా సహకారం అందిస్తోంది. లాక్ డౌన్ కాలంలో గిలో మరియు మహువా సేకరణ, తగిన భద్రతా చర్యల మధ్య మాస్క్ లు ధరించి, సామాజిక దూరాన్ని పాటిస్తూ కొనసాగుతోంది.

ఈ ప్రాతంలోని వి.డి.వి.కె.ల్లో ఒకరైన శబరి ఆదివాసీ వికాస్ మహామండల్, ఈ ఉత్పత్తుల నుంచి విభిన్న ఉప ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ముందు వెళ్ళడమే గాక, వెనుకబడిన అనుసంధానాలను స్థాపించటంలో స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తోంది. ఈ ఉత్పత్తులకు విలువను జోడించడం ద్వారా, వీటికి మంచి ధర లభిస్తుంది. ఉయికే శిల్ప్ గ్రామ్ లోని వన్ ధన్ వికాస్ కేంద్ర స్వయం కళా సంస్థ, మహువా జామ్, లడ్లు మరియు మహువా రసం కోసం సుమారు 125 క్వింటాళ్ళ మహువా పూలను (6.5 లక్షల రూపాయల విలువైన) కొనుగోలు చేసింది.
మరో బృందం, షాపూర్ వన్ ధన్ వికాస్ కేంద్ర పరిధిలోకి వచ్చే కట్కారి గిరిజన యువజన బృందం సహా ఇతర సమూహాలకు ఒక ప్రమాణాన్ని నిర్ణయించింది. యువబృందం ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేయడమే గాక, దేశవ్యాప్తంగా మార్కెట్లకు గిలోను తీసుకు వెళ్ళేందుకు డి మార్ట్ వంటి రిటైల్ గొలుసుతో కలిసి పని చేస్తోంది.
ఇప్పటికే ఈ కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నారు. 2020 -21 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన ఎం.ఎఫ్.పి.ల నుంచి 0.05 కోట్ల రూపాయల మహువా మరియు గిలో సేకరణ జరిగింది.
ఒకానొక సమయంలో, ప్రధాన విపత్తు విషయంలో వార్తల మధ్య వన్ ధన్ పథకాల గురించి వచ్చే ఇలాంటి విజయవార్తలు కొత్త ఆశను మరియు ప్రేరణను అందిస్తాయి.
వన్ ధన్ పథకం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ట్రిఫెడ్ యొక్క చొరవ మరియు ఇది గిరిజన సేకరణదారుల కోసం జీవనోపాధిని లక్ష్యంగా చేసుకుని, వారిని వ్యవస్థాపకులుగా మారుస్తుంది. ప్రధానంగా అటవీ ప్రాంత గిరిజన జిల్లాల్లో గిరిజన సమాజ యాజమాన్యంలోని వన్ ధన్ వికాస్ కేంద్రాలను (వి.డి.వి.కె) ఏర్పాటు చేయటం ఈ పథకం వెనుక ఉన్న ఆలోచన. ఒక కేంద్రంలో 15 గిరిజన స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్కటి 20 మంది గిరిజన ఎన్.టి.ఎఫ్.పి. సేకరణదారులు లేదా చేతివృత్తుల వారు ఉన్నారు. అనగా వన్ ధన్ కేంద్రానికి 300 మంది లబ్ధిదారులు ఉన్నారు.
గిరిజన ప్రజల జీవనోపాధి మరియు సాధికారత మెరుగు పరిచేందుకు ముందుకు వచ్చిన అత్యున్నత జాతీయ సంస్థగా ట్రైఫెడ్, ఈ పథకం అమలుకు నోడల్ ఏజెన్సీ. ఈ పథకం గిరిజన సేకరణకు కొంత ప్రాథమిక సహాయాన్ని అందించటంలో అద్భుతమైన విజయాన్ని సాధించటమే గాక, వారి జీవితాలను మెరుగు పరచడంలో మరింత సహాయపడింది. 3.6 లక్షల మంది లబ్ధిదారులకు ఆన్ బోర్డింగ్ లో 1,126 వన్ ధన్ కేంద్రాలను దేశ వ్యాప్తంగా గిరిజన అంకురాలుగా ఏర్పాటు చేశారు.
--
(Release ID: 1629714)
Visitor Counter : 293