రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కొచ్చిలోని నావల్ బేస్ వద్ద బహ్రెయిన్ మరియు ఒమన్ నుంచి వచ్చిన 176 మంది భారతీయ పౌరులకు క్వారంటైన్ పూర్తి

Posted On: 04 JUN 2020 7:42PM by PIB Hyderabad

బహ్రెయిన్ మరియు ఒమన్ లకు చెందిన 176 మంది భారతీయులు ఈ రోజు నావల్ బేస్ కొచ్చిలో నిర్భంధ కాలపరిమితిని పూర్తి చేశారు. గత రెండు వారాలుగా సదరన్ నావల్ నావ్ కమాండ్ కోవిడ్ కేర్ సెంటర్ (సిసిసి) నివాసితులు ఇప్పుడు దేశంలోని వివిధ ప్రాంతాలకు తిరిగి వెళ్తారు.

సి.సి.సి.లో ఉన్న సమయంలో వారికి అన్ని భోజనం, వ్యక్తిగత పరిశుభ్రత వస్తు సామగ్రి, పర్యవేక్షించబడిన వైద్య సంరక్షణ, వైఫై మరియు టెలిఫోన్ సౌకర్యాలు, కొత్త బి.ఎస్.ఎన్.ఎల్. సిమ్ కార్డులతో పాటు మార్చిన కరెన్సీ వంటివి ఇతర ప్రాథమిక సౌకర్యాలతో అందించారు.

నివాసితులందరూ వారి బసలో ఆర్.టి – పి.సి.ఆర్. పరీక్షలు చేయించుకున్నారు. అదే విధంగా డిశ్చార్జ్ చేయడానికి ముందు కోవిడ్ నెగటివ్ వచ్చింది.

ఒమన్ నుంచి 49 మంది భారతీయులు  ఈ రోజు సిసిసి నుంచి బయలు దేరారు. బహ్రెయిన్ నుంచి 127 మంది ఇండియన్ నేవీ ఫెసిలిటీని జూన్ 1 మరియు 2 మధ్య విడిచిపెట్టారు.

200 పడకల సామర్థ్యంతో కొచ్చిలో నేవీ నిర్బంధ సౌకర్యం మార్చి 20న ఏర్పాటు చేశారు. సెలవు తర్వాత విధుల్లో కొచ్చికి తిరిగి వచ్చ నావికాదళ సిబ్బందికి రవాణా నిర్బంధ శిబిరంగా పని చేస్తోంది. బహ్రెయిన్ మరియు ఒమన్ నుంచి వచ్చిన వారి కోసం దీని విషయంలో చిన్న సవరణలు చేశారు. ఈ శిబిరాన్ని దక్షిణ నావల్ కమాండ్ లోని స్కూల్ ఆఫ్ నావల్ ఎయిర్ మెన్ (ఎస్.ఎఫ్.ఎన్.ఏ) నుంచి శిక్షణ పొందిన నావికాదళ వైద్యులు మరియు సిబ్బంది నిర్వహిస్తున్నారు.

కోవిడ్ -19తో జరిగిన యుద్ధంలో దేశానికి మద్ధతు ఇవ్వడానికి భారత నావికాదళానికి ఎలాంటి పనులు అప్పజెప్పలేదు. అందుకో హర్ కామ్ దేశ్ కే నామ్ దిశగా తన సంకల్పాన్ని నెరవేరుస్తోంది.

 

***



(Release ID: 1629509) Visitor Counter : 254