సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 నియంత్రణ చర్యలకు సంబంధించి జమ్ముకాశ్మీర్ మునిసిపల్ సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
03 JUN 2020 9:34PM by PIB Hyderabad
కోవిడ్ నియంత్రణ చర్యలపై , కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్ము కాశ్మీర్ మునిసిపల్ సంస్థల ప్రతినిధులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తూ, డాక్టర్ జితేంద్రసింగ్, కోవిడ్ మహమ్మారికి సంబంధించి ఇంతకు ముందు రెండు దశలలో ప్రధాన దృష్టి, దేశంలోని వివిధప్రాంతాలలో చిక్కుకుపోయిన ప్రజలకు నిత్యావసర సరకులు అందించడంపై ఉండిందన్నారు. ఆ తర్వాతి దశలో , ప్రధాన బాధ్యత, ప్రజలను దేశం లోని వివిధ ప్రాంతాలనుంచి వారివారి స్వస్థలాలకు చేర్చడంపై ఉందన్నారు. ప్రస్తుత దశలో ప్రధానంగా రెండు అంశాలపై దృష్టిపెట్టడం జరిగిందన్నారు. అది కోవిడ్ నియంత్రణ, ప్రజలలో అవగాహన పెంచడం. ఈ రెండు అంశాలను సాధించడంలో, స్థానిక సంస్థలు,వారి ప్రతినిధులు , పౌరసమాజం ప్రతినిధులు, అసాధారణ ప్రాధాన్యత కలిగి ఉంటారన్నారు.
రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో జమ్ము మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ చంద్రమోహన్‌గుప్త, జమ్ము మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పూర్ణిమ శర్మ, శ్రీనగర్ మునిసిపల్‌కార్పొరేషన్ మేయర్ జునైద్ అజిమ్ మట్టూ , శ్రీనగర్ మునిసిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ పర్వేజ్ ఖాద్రి ఉన్నారు. దీనికితోడు, బిల్లావర్, బషోలి, హిరానగర్, భదెర్‌వా, దోడా, విజయపూర్, కుప్వారా, బారాముల్లా, అనంతనాగ్, చెనాని, రామ్‌ఘడ్, పరోలి, బటోటె మునిసిపల్ సంస్థల ఛైర్మన్లు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రస్తుత సమయంలో పాటించవలసిన మంత్రం , ఆందోళన కాక అవగాహన కలిగిఉండడం అని ఆయన అన్నారు.ఇందుకు, మునిసిపల్ సంస్థల ఎన్నికైన ప్రజాప్రతినిధులు, క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న నాయకులు ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కృషి చేయాలన్నారు. కోవిడ్ విషయంలో అనవసరంగా ఆందోళన చెందడం కాక, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంపై ప్రజలకు అవగాహనకల్పించేందుకు, వారిని ఒప్పించేందుకు కృషి కృషిచేయాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు ,నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.
కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ అవి, పెద్ద సంఖ్యలో ప్రజలకు పరీక్షలు నిర్వహిస్తున్నందువల్ల వెలుగులోకి వస్తున్నాయన్న విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. లేకుంటే కోవిడ్ వ్యాప్తి , మరణాల రేటు గత పది వారాలుగా ఒకే రీతిలో ఉండేదన్నారు.

ప్రస్తుత దశ, కోవిడ్ మహమ్మారి విషయంలో మునిసిపల్ సంస్థలు క్రిమిసంహారకాలు చల్లడం, పరిసరాల పరిశుభ్రత పాటించడం, సామాజికదూరం పాటించడం వంటివి ఎంతో ముఖ్యమైన కార్యకలాపాలుగా చేపట్టాలన్నారు. కోవిడ్ నియంత్రణ ప్రణాళికల రూపకల్పన, అమలు విషయంలో మునిసిపల్ సంస్థలను పరిగణన లోకి తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగిందన్నారు.
స్థానిక సంస్థల ప్రతినిధులతో మంత్రి, ఆయన కార్యాలయం, రెగ్యులర్‌గా సంప్రదిస్తున్నందుకు మునిసిపల్ సంస్థల ఛైర్మన్లు, డాక్టర్ జితేంద్రసింగ్‌ను అభినందించారు. మునిసిపల్ సంస్థలకు విడుదల కావలసిన నిధులలో జాప్యం జరుగుతున్న విషయాన్ని వారు మంత్రి దృష్టికి తెచ్చారు.కరోనా సంక్షోభ సమయంలో మునిసిపల్ సంస్థలు, పౌరసమాజం పాత్రను డాక్టర్‌జితేంద్రసింగ్ కొనియాడారు. అన్ని వర్గాలవారి మధ్య సన్నిహిత సమన్వయం కోసం తాను కృషి చేస్తున్నట్టు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
(Release ID: 1629344)
Visitor Counter : 269