రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

మేక్ ఇన్ ఇండియాకు ఉత్తేజం; 156 అప్ గ్రేడ్ చేసిన బిఎంపి ఇన్ ఫాంట్రీ కంబాట్ వాహనాల సరఫరాకు ఒఎఫ్ బికి రూ.1094 కోట్ల ఆర్డర్

Posted On: 02 JUN 2020 7:38PM by PIB Hyderabad

కేంద్రప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియాకు ఉత్తేజం కల్పిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖకు (ఎంఒడి) చెందిన కొనుగోళ్ల విభాగం మేక్ ఇన్ ఇండియాకు ఉత్తేజం ఇస్తూ రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ అనుమతితో 156 బిఎంపి 2/2 కె  ఇన్ ఫాంట్రీ వాహనాల (ఐసివి) సరఫరాకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డుకు (ఒఎఫ్ బి) ఆర్డర్ జారీ చేసింది. ఆధునిక లక్షణాలతో కూడిన ఈ వాహనాలు భారత సైన్యంలో యంత్రపరికరాల సహాయంతో పని చేసే దళాల వినియోగానికి ఉపయోగపడతాయి. తెలంగాణలోని మెదక్ లో ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఈ ఐసివిలను తయారుచేసి సరఫరా చేస్తుంది. ఈ ఆర్డర్ విలువ సుమారు రూ.1094 కోట్లు. 

285 హర్స్ పవర్ ఇంజన్, తక్కువ బరువుండే ఈ  బిఎంపి 2/2 కె ఐసివిలు యుద్ధక్షేత్రంలోఎక్కడకి కావాలంటే అక్కడకి తిరుగుతూ సైనిక దళాల వ్యూహాత్మక అవసరాలకు ఉపయోగపడతాయి. ఎగుడుదిగుడు రహదారుల్లో కూడా తేలిగ్గా తిరిగే స్టీరింగ్ సామర్థ్యంతో ఈ ఐసివిలు గంటకి 65 కిలోమీటర్ల వేగంతో (కెఎంపిహెచ్) నడవగలుగుతాయి. నీటిలో కూడా 07 కెఎంపిహెచ్ వేగంతో ప్రయాణం చేయగల ఉభయచర సామర్థ్యం కూడా వీటికి ఉంటుంది. అలాగే 35 డిగ్రీల ఏటవాలు ప్రదేశంలో కూడా 0.7 మీటర్ల అవరోధాలను దాటుకుంటూ శతృసేనలను తుదముట్టించగల పేలుడు ఆయుధాలు ప్రయోగించే సామర్థ్యం వీటికి ఉంటుంది. 

ఈ 156 బిఎంపి 2/2 కె ఐసివిలు ప్రవేశపెట్టడం 2023 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. వీటి ప్రవేశంతో యాంత్రిక ఇన్ ఫాంట్రీ పోరాటదళం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరడంతో పాటు సైనిక దళాల పోరాట సామర్థ్యం కూడా మరింతగా పెరుగుతుంది.

***



(Release ID: 1629313) Visitor Counter : 180