ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ, మొజాంబిక్ అధ్యక్షుడు పిలిపె జసింటో న్యూసి మధ్య టెలిఫోన్ సంభాషణ
Posted On:
03 JUN 2020 7:32PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈరోజు , మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిపె జసింటో న్యూసితో ఫోన్‌లో మాట్లాడారు.
కోవిడ్ -19 మహమ్మారి వల్ల కొనసాగుతున్న సవాళ్ళగురించి ఇరువురు నాయకులు చర్చించారు. ఆరోగ్య సంక్షోభ సమయంలో మోజాంబిక్ కు అత్యావశ్యక మందులు, పరికరాలు అందించడం సహా, ఆ దేశం సాగిస్తున్న కృషికి మద్దతు నిచ్చేందుకు ప్రధానమంత్రి తన సానుకూలతను వ్యక్తం చేశారు.
ఆరోగ్య సంరక్షణ, ఔషధ సరఫరాలకు సంబంధించి ఉభయదేశాల మధ్యగల సన్నిహిత సహకారానికి మొజాంబిక్ అధ్యక్షుడు తన అభినందనలు తెలిపారు.
ఇరువురు నాయకులు ఇతర ముఖ్యమైన అంశాలైన భారతీయ పెట్టుబడులు, మొజాంబిక్ లో అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ఈ సందర్భంగా చర్చించారు. ఆఫ్రికాతో భారతదేశానికిగల మొత్తం భాగస్వామ్యంలో మొజాంబిక్ ఒక ప్రధాన స్తంభం వంటిదని ప్రధానమంత్రి అన్నారు.మెజాంబిక్ కు చెందిన బొగ్గు, సహజవాయు రంగాలలో భారతీయ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులకు హామీ ఇచ్చిన విషయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
రక్షణ, భద్రత రంగాలలో పెరుగుతున్న ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర మొజాంబిక్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై అధ్యక్షుడు న్యూసీ తన ఆందోళనను ప్రధానమంత్రితొ పంచుకున్నారు. మొజాంబిక్ పోలీసులు, భద్రతా బలగాల సామర్ద్య నిర్మాణంతోపాటు ఆ దేశానికి అన్నివిధాలా సాధ్యమైన మద్దతునిస్తామని ప్రధానమంత్రి హామీఇచ్చారు.
మొజాంబిక్‌లో భారతీయులు, భారతీయ సంతతివారి భద్రత, రక్షణకు మొజాంబిక్ అధికారవర్గాలు సాగిస్తున్న కృషి కి ప్రధానమంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుత కోవిడ్ మహమ్మారి సమయంలో సహకారం, మద్దతుకు సంబంధించి మరిన్ని మార్గాలను అన్వేషించడానికి ఇరు దేశాల అధికారులు సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారన్న విషయమై ఇరువురు నాయకులు అంగీకారం తెలిపారు.
(Release ID: 1629218)
Visitor Counter : 327
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam