రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ , డ్రైవింగ్ లైసెన్సుల జారీ, పాత వాహనాలను వెనక్కి పిలవడంపై మోటారు వాహనాల నియమావళికి సవరణలు చేయడానికి ప్రజల నుంచి సూచనలకు ఆహ్వానం

Posted On: 03 JUN 2020 4:50PM by PIB Hyderabad

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ , డ్రైవింగ్ లైసెన్సుల జారీ,  పాత వాహనాలను వెనక్కి పిలవడానికి సంబంధించి మోటారు వాహనాల నియమావళికి సవరణలు చేయడానికి సాధారణ ప్రజానీకంతో సహా భాగస్వామ్య పక్షాల నుంచి  తిరిగి సూచనలు మరియు వ్యాఖ్యలను కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది.  

ఈ నోటిఫికేషన్లను తొలుత ఈ ఏడాది మార్చి 18వ తేదీన జారీచేయడం జరిగింది.  అయితే  నోటిఫికేషన్ ను పరిశీలించడానికి భాగస్వామ్యపక్షాలకు తగినంత సమయం అవసరమని భావించినందున,  వారు నోటిఫికేషన్ ను తిరిగి పరిశీలించి తమ వ్యాఖ్యలు  మరియు సూచనలు చేయడానికి వీలుగా నోటిఫికేషన్లను తిరిగి  ప్రకటించడం జరుగుతోంది.  తొలుత నోటిఫికేషన్ జారీచేసినప్పుడు లాక్ డౌన్ వల్ల ఏర్పడిన పరిస్థితుల  ప్రభావం దానిపైన పడింది.  

ఈ మేరకు రెండు నోటిఫికేషన్లను 2020, మే 29వ తేదీన జారీచేయడం జరిగింది.   వాటిని www.morth.gov.in.వెబ్ సైటులో చూడవచ్చు.

మోటారు వాహనాల సవరణ చట్టం 4-28 సెక్షను ప్రకారం జారీ చేస్తున్న ముసాయిదా నోటిఫికేషన్ నెం. 336(E)లో పొందుపరచిన అంశాలు:  

* ఎలెక్ట్రానిక్ ఫారాలు మరియు పత్రాల వినియోగం ( మెడికల్ సర్టిఫికెట్, లెర్నర్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ సరెండర్, డ్రైవింగ్ లైసెన్స్  రెన్యూవల్)  

* ఆన్ లైనులో లెర్నర్ లైసెన్స్

* జాతీయ రిజిస్టర్

* డీలర్ పాయింటు నమోదు

* 60 రోజుల ముందుగా రిజిస్ట్రేషన్ రెన్యూవల్

* 30 రోజుల పొడిగింపులకు వీలుగా,  ఆరు (06) నెలల తాత్కాలిక రిజిస్ట్రేషన్ (బాడీ బిల్డింగ్ మొదలైనవి)  

* వర్తకం సర్టిఫికెట్ -  ఎలెక్ట్రానిక్

* పరివర్తనం, వాహనాల రిట్రో ఫిట్మెంట్ మరియు రూపాంతరం చెందిన వాహనాలు

* మార్పులు చేసిన వాహనాలకు బీమా

మోటారు వాహనాల సవరణ చట్టం 39-40 సెక్షను ప్రకారం జారీ చేస్తున్న మరొక  ముసాయిదా నోటిఫికేషన్ నెం. 337(E)లో
ఉన్నటువంటి అంశాలు:  

* లోపాలున్న వాహనాలను వెనక్కి విలిచే విధానం

i. వెనక్కి విలిచే పధ్ధతి

ii. దర్యాప్తు అధికారిని నియమించే పధ్ధతి  

iii.దర్యాప్తు  పధ్ధతి -  కాల వ్యవధి ప్రకారం (06 నెలలు)  

iv. పరీక్షా ఏజెన్సీల పాత్ర

*  ఉత్పత్తిదారులు, దిగుమతిదారులు  మరియు రిట్రోఫిల్టర్ల బాధ్యతలు

* పరీక్షా ఏజెన్సీలకు గుర్తింపు

ఈ నోటిఫికేషన్లు ప్రచురించిన తేదీ నుంచి 60 రోజుల లోపల మీ సూచనలు మరియు వ్యాఖ్యలను  జాయింట్ సెక్రెటరీ (రవాణా),  రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ,  రవాణా భవన్,  పార్లమెంట్ స్ట్రీట్ , న్యూ ఢిల్లీ -110001 (ఈ మెయిల్:jspb-morth[at]gov[dot]in) అడ్రసుకు పంపాలి.   ఇదివరకే తమ వ్యాఖ్యలు పంపినవారు మళ్ళీ పంపవలసిన అవసరం లేదు.  

====



(Release ID: 1629171) Visitor Counter : 222