మంత్రిమండలి
గ్రామీణ భారతావనికి చరిత్రాత్మక ప్రోత్సాహం -కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి
రైతులకు ప్రయోజనం కలిగించే , వ్యవసాయరంగంలో మార్పునకు దారితీసే కీలక నిర్ణయాలు
నిత్యావసర సరకుల చట్టానికి సవరణల ద్వారా రైతులకు రెగ్యులేటరీ పరిస్థితులు సరళతరం
వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అంతర్ రాష్ట్ర వాణిజ్యం, రాష్టం లోపల వాణిజ్యానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేని పరిస్థితులను ప్రోత్సహించేందుకు ఆర్డినెన్స్.
ప్రాసెసర్లు, అగ్రిగేటర్లు, టోకు వర్తకులు, పెద్ద రిటైల్ వర్తకులు, ఎగుమతిదారులతో వ్యవవహరించేలా రైతులకు సాధికారత
Posted On:
03 JUN 2020 5:04PM by PIB Hyderabad
నిత్యావసర సరకుల చట్టానికి చరిత్రాత్మక సవరణలు :
నిత్యావసర సరకుల చట్టానికి కేంద్ర కేబినెట్ ఈరోజు సవరణలు ఆమోదించింది. వ్యవసాయరంగంలో గణనీయమైన మార్పు, రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా తీసుకున్న దార్శనిక చర్య ఇది.
నేపథ్యం:
చాలావరకు వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో భారతదేశం మిగులు సాధిస్తున్నప్పటికీ, శీతలీకరణ గిడ్డంగులు, ప్రాసెసింగ్, ఎగుమతుల విషయంలో చాలినన్ని పెట్టుబడులు లేనందువల్ల రైతులు మంచి ధరలు పొందలేక పోతున్నారు. నిత్యావసర సరకుల చట్టం నెత్తిమీద కత్తిలా వేలాడుతుండడంతో అది ఎంటర్‌ప్రెన్యూయర్ల స్ఫూర్తిని దెబ్బ తీస్తోంది. త్వరగా పాడైపోయే గుణం కలిగిన పంట దిగుబడి ఎక్కువగా వచ్చినపుడు రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారు. తగిన ప్రాసెసింగ్ సదుపాయాలు ఉంటే ఇలా వృధా అయ్యే దానిలో చాలావరకు తగ్గించడానికి వీలు కలుగుతుంది.
ప్రయోజనాలు:
నిత్యావసర సరకుల చట్టానికి సవరణలతో, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, వంట నూనెలు, ఉల్లి, బంగాళాదుంపలను నిత్యావసర సరుకుల చట్టంనుంచి తొలగించడం జరుగుతుంది. అధిక నియంత్రణ జోక్యాల భయాలనుంచి ఇది ఇన్వెస్టర్లను విముక్తి చేస్తుంది.
ఉత్పత్తి, నిల్వ, తరలింపు, పంపిణీ, సరఫరా వంటివి ఆర్థిక కార్యకలాపాల వృద్ధికి దోహదపడి, ప్రైవేటు రంగాన్ని ఆకర్షించడానికి ఉపకరిస్తాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను వ్యవసాయ రంగంలో ఆకర్షించడానికి ఇది దోహదం చేస్తుంది. శీతలీకరణ గిడ్డంగులకు , ఆహార సరఫరా చెయిన్‌ను ఆధునీకరించడానికి ఈ చర్య ఉపకరిస్తుంది.
వినియోగదారుల ప్రయోజనాల రక్షణ:
రెగ్యులేటరీ పరిస్థితులనుప్రభుత్వం సరళీకృతం చేయడంతోపాటు, వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వం పూచీ పడింది.యుద్ధం, కరువు, అసాధారణ స్థితిలో ధరల పెరుగుదల, ప్రకృతి విపత్తుల వంటి పరిస్థితులలో వ్యవసాయ ఆహారోత్పత్తులను నియంత్రించవచ్చని ఈ సవరణ చట్టంలో పేర్కొన్నారు. అయితే వాల్యూ చెయిన్ పార్టిసిపెంట్ స్థాపిత సామర్ధ్యం, ఎగుమతిదారుకు సంబంధించి ఎగుమతి డిమాండ్ లను స్టాక్ పరిమితి విధింపునుంచి మినహాయించడం జరిగింది. వ్యవసాయరంగంలో పెట్టుబడులను నిరుత్సాహపరచకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రకటించిన సవరణలు, రైతులకు, వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇది ధరల స్థిరీకరణకు దోహదపడుతుంది. తగిన నిల్వసదుపాయాలు లేనందువల్ల వ్యవసాయ ఉత్పత్తులు వృధాఅయ్యే పరిస్థితిని ఇది తప్పిస్తుంది.
వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి అడ్డంకులు లేని వాణిజ్యం:
కేంద్ర కేబినెట్, ది ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ , కామర్స్ (ప్రమోషన్, పెసిలిటేషన్) ఆర్డినెన్స్ ,2020ని ఆమోదించింది..
నేపథ్యం:
దేశంలోని రైతులు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి వివిధ రకాల ఆంక్షలను ఎదుర్కొంటున్నారు. నోటిఫై చేసిన ఎపిఎంఎస్ మార్కెట్ యార్డుల వెలుపల రైతులు వ్యవసాయ ఉత్పత్తులు అమ్మడంపై ఆంక్షలు ఉన్నాయి. అలాగే రైతులు తమ ఉత్పత్తులను రాష్ట్రప్రభుత్వ రిజిస్టర్డ్ లైసెన్సీలకు మాత్రమే తమ ఉత్పత్తులు అమ్మాలన్న పరిమితులున్నాయి.. దీనికితోడు వివిధ రాష్ట్రాలు రూపొందించిన ఎంపిఎంసి చట్టాల వల్లవివిధ రాష్ట్రాల మధ్య, వ్యవసాయ ఉత్పత్తులు సాఫీగా రవాణా చేయడానికి పలు అడ్డంకులు ఉన్నాయి.
ప్రయోజనాలు:
ఈ ఆర్డినెన్స్ వల్ల రైతులు, వ్యాపారులు వ్యవసాయ ఉత్పత్తులను తమకు తోచిన చోటునుంచి కొనుగోలు చేయడానికి, అమ్మడానికి స్వేచ్ఛగల వాతావరణం ఏర్పడుతుంది.ఇది ఎలాంటి అడ్డంకులు లేకుండా రాష్ట్రంలోను, అంతర్ రాష్ట్ర వ్యాపారానికి వీలు కలిగిస్తుంది. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ చట్టాల ఆవరణల వెలుపల వాణిజ్యాన్నిఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రోత్సహిస్తుంది. దేశంలో విపరీతమైన నియంత్రణలో ఉన్న వ్యవసాయ మార్కెట్లను అన్‌లాక్‌చేయడానికి తీసుకున్న చరిత్రాత్మక చర్య ఇది.
ప్రభత్వ చర్య రైతులకు మరిన్ని అవకాశాలను కల్పిస్తుంది. రైతులకు మార్కెటింగ్ ఖర్చులు తగ్గించి, వారికి మంచి ధరలు రావడానికి వీలు కలిగిస్తుంది. వివిధ ప్రాంతాలలో మిగులు దిగుబడి కలిగిన రైతులు కూడా మంచి ధరలు పొందడానికి, తక్కువ పంట ఉన్న ప్రాంతాలలో వినియోగదారులు తక్కువ ధరలకు వ్యవసాయ ఉత్పత్తులు పొందడానికి వీలు కల్పిస్తుంది. ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ లో ఎలాంటి అంతరాయం లేకుండా చూసేందుకు లావాదేవీలు జరిగే ప్లాట్‌ఫాంపై ఎలక్ట్రానిక్ ట్రేడింగ్‌కు, ఈ ఆర్డినెన్స్ వీలు కల్పిస్తుంది.
ఒక ఇండియా, ఒక వ్యవసాయ మార్కెట్:
ఈ ఆర్డినెన్స్ మౌలికంగా ఎపిఎంసి మార్కెట్ యార్డుల వెలుపల అదనపు ట్రేడింగ్ అవకాశాలను కల్పించి, అదనపు పోటీద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఉద్దేశించినది. ఇది తప్పకుండా ఒక ఇండియా, ఒక వ్యవసాయ మార్కెట్ కు మార్గం సుగమం చేస్తుంది. దీనివల్ల కష్టపడి పనిచేసే రైతులకు ,బంగారు పంటలకు ఇది పునాదివేస్తుంది.
ప్రాసెసర్లు , అగ్రిగేటర్లు, హోల్ సేల్ వ్యాపారులు, పెద్ద రిటైల్ వ్యాపారులు, ఎగుమతిదారులతో లావాదేవీలు జరిపేందుకు రైతులకు సాధికారత :
రైతుల (సాధికారత ,రక్షణ) ధరల హామీ ఒప్పందం, వ్యవసాయ సేవల ఆర్డినెన్స్, 2020 కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
నేపథ్యం:.
భారత వ్యవసాయరంగాన్ని చిన్న కమతాల కారణంగా ఖండ వ్యవసాయంగా అభివర్ణిస్తారు. అంతేకాదు, వాతావరణంపై ఆధారపడడాల్సి రావడం,ఉత్పత్తికి సంబంధించిన అనిశ్చితి, మార్కెట్ ఊహించని రీతిలో ఉండడం వంటి కొన్ని బలహీనతలూ ఉన్నాయి. ఇది వ్యవసాయాన్ని రిస్క్‌గా మార్చడంతోపాటు ఖర్చులు, దిగుబడి నిర్వహణ విషయంలో తగిన సమర్థత లేకుండా చేస్తోంది.
ప్రయోజనాలు:
రైతులు ప్రాసెసర్లతో,అగ్రిగేటర్లతో, పెద్ద రిటైల్‌వర్తకులతో , ఎగుమతిదారులు తదితరులతో లావాదేవీలు జరపడానికి ఈ ఆర్డినెన్స్ సాధికారత కల్పిస్తుంది. ఎలాంటి దోపిడీకి అవకాశం లేకుండా సమాన అవకాశాలు కల్పిస్తుంది. మార్కెట్ అనిశ్చిత పరిస్థితులకు సంబంధించిన రిస్క్‌ను రైతునుంచి స్పాన్సర్‌కు ఇది బదిలీ చేస్తుంది. అంతేకాదు రైతుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ,ఇన్‌పుట్‌లను అందుబాటులోకి తీసుకువస్తుంది.ఇది మార్కెటింగ్ ఖర్చులను తగ్గించడంతోపాటు రైతుల రాబడిని పెంచుతుంది.
భారత వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేర్చేందుకు,సప్లయ్ చెయిన్ నిర్మాణానికి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే ఒక చోదక శక్తిగా ఈ ఆర్డినెన్స్ ఉపకరిస్తుంది. రైతులకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడానికి, అధికవిలువ కలిగిన వ్యవసాయానికి అవసరమైన సలహాలకు, ఇలాంటి ఉత్పత్తులకు మార్కెట్లు సిద్ధం కావడానికి ఇది ఉపకరిస్తుంది.
రైతులు నేరుగా మార్కెటింగ్ కార్యకలాపాలలో పాల్గొనడానికి వీలు కలుగుతుంది. ఫలితంగా మధ్యవర్తులు లేకుండా పోతారు. దీనివల్ల రైతులు పూర్తి ధరను పొందడానికి వీలు కలుగుతుంది. రైతులకు తగిన రక్షణ, వివాదాల పరిష్కారానికి అవసరమైన యంత్రాంగం కల్పించడం జరిగింది. వివాదాల పరిష్కారానికి సంబంధించి స్పష్టమైన గడువులు నిర్ణయించడం జరిగింది.
రైతు సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం:
వ్యవసాయ అనుబంధ రంగాలలోని వారిని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ఆత్మనిర్భర భారత్ అభియాన్ కింద ప్రభుత్వం పలు చర్యలను ప్రకటించింది. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రాయితీ ధరకు రుణసదుపాయం కల్పించడం, వ్యవసాయ మౌలిక సదుపాయ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ , మత్య్స రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ఫుట్, మౌత్ వ్యాధి, బ్రుసెల్లోసిస్‌లకు వాక్సినేషన్, ఔషధ మొక్కల పెంపకానికి ప్రోత్సాహం, తేనెటీగల పెంపకానికి ప్రోత్సాహం, ఆపరేషన్ గ్రీన్ వంటివి ఇందులో ఉన్నాయి.
పిఎం -కిసాన్ పథకం కింద 9.25 కోట్ల రైతు కుటుంబాలు ప్రయోజనం పొందాయి. లాక్‌డౌన్ సమయంలో ఇప్పటి వరకు సుమారు 18,517 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద , మొత్తం క్లెయిమ్ రూ 6003.6 కోట్ల రూపాయలను లాక్‌డౌన్ సమయంలో చెల్లించడం జరిగింది.
రైతుల సంక్షేమం కోసంత ప్రభుత్వం వరుసగా తీసుకుంటూ వస్తున్న చర్యలలో ఇవి తాజావి. కష్టపడి పనిచేస్తున్న భారతీయ రైతుల సంక్షేమానికి కట్టుబడి, నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ కృషికి ఈ చర్యలు అద్దంపడతాయి.
(Release ID: 1629151)
Visitor Counter : 380
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada