ఉక్కు మంత్రిత్వ శాఖ

స్టీల్ ఫ్యాబ్రికేటర్లతో సమావేశ‌మైన మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

- భిలాయ్ స్టీల్ ప్లాంట్‌ చుట్టూ స్టీల్ ఫ్యాబ్రికేషన్ క్లస్టర్ అభివృద్ధికి రోడ్ మ్యాప్‌పై చ‌ర్చ‌

Posted On: 03 JUN 2020 11:15AM by PIB Hyderabad

భిలాయ్ స్టీల్ ప్లాంట్ చుట్టూ స్టీల్ ఫాబ్రికేషన్ క్లస్టర్ అభివృద్ధి ప్రణాళికను గురించి చ‌ర్చించేందుకు
గాను కేంద్ర ఉక్కు, పెట్రోలియం, సహజవాయువుల‌ శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ అధ్యక్షత నిన్న ఒక స‌మావేశం జ‌రిగింది. ఉక్కు మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, ఐఎన్‌ఎస్‌డీఏజీ, సెయిల్ మరియు స్టీల్ ఫ్యాబ్రికేటర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్ స‌మావేశంలో పాల్గొన్నారు. ఉక్కు అవసరాల విష‌యంలో వంతెన ఫాబ్రికేటర్లు ఎదుర్కొంటున్న సమస్యల‌ను కూడా ఈ స‌మావేశంలో చర్చించారు. స్టీల్ ఫాబ్రికేషన్ క్లస్టర్ ఈ ప్రాంతంలోని ఎంఎస్‌ఎంఈ రంగానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంద‌ని, స్థానికంగా త‌గిన ఉపాధి కల్పనను సులభతరం చేయ‌డంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకూ త‌గిన ప్రేర‌ణను ఇవ్వ‌నుంది. గౌర‌వ ప్ర‌ధాన మంత్రి మోడీ పిలుపునిచ్చిన 'ఆత్మ నిర్భ‌ర్ భార‌త్' స్ఫూర్తికి అనుగుణంగా స్టీల్ ఫాబ్రికేషన్ క్లస్టర్ ఏర్పాటు నిలువ‌నుంది. దుర్గ్ జిల్లాలో స్టీల్ ఫాబ్రికేటర్స్ యొక్క స్టీల్ ప్లేట్ అవసరాన్ని పూర్తిగా నెరవేర్చాలని మరియు వీటి సేకరణకు వచ్చే ఏవైనా నిర్బంధ పరిస్థితులను తొలగించేందుకు గాను త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని మంత్రి శ్రీ ప్రధాన్ భిలాయ్ స్టీల్ ప్లాంట్ సీఈఓ‌ను ఆదేశించారు. ఉక్కు వంతెనలను చాలా ఎక్కు మొత్తంలో ఉపయోగిస్తున్న రైల్వేశాఖ మార్గంలోనే రోడ్డు ర‌వాణా జాతీయ ర‌హ‌దారుల శాఖ కూడా తాను నిర్మించే వంతెనలలో ఉక్కు వినియోగాన్ని అధికం చేసేందుకు గ‌ల వ్యూహాన్ని కూడా మంత్రి  ఈ సంద‌ర్భంగా చర్చించారు.

 



(Release ID: 1628961) Visitor Counter : 159